రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో ‘నోటా’పై నెలకొన్న సందిగ్ధతపై ఈసీ (ఎలక్షన్ కమిషన్) స్పష్టతనిచ్చింది.
న్యూఢిల్లీ: రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో ‘నోటా’పై నెలకొన్న సందిగ్ధతపై ఈసీ (ఎలక్షన్ కమిషన్) స్పష్టతనిచ్చింది. గతంలో ఓటరు మొదటి ప్రాధాన్యతా ఓటును ఒక అభ్యర్థికి వేసి.. రెండో, మూడో లేదా నాలుగో ప్రాధాన్యత ఓటుగా ‘నోటా’ వేస్తే దాన్ని చెల్లని ఓటుగా ఈసీ పరిగణించేది. ఇప్పడు ఈసీ జారీ చేసిన కొత్త సూచనల ప్రకారం.. మొదటి ప్రాధాన్యతా ఓటు అభ్యర్థికి వేసి, తర్వాత 2, 3 లేదా 4వ ప్రాధాన్యతా ఓటు నోటాకు వేసినా.. అది మొదటి ప్రాధాన్యతా ఓటు వేసిన వ్యక్తికే చెల్లుతుంది. అలా కాకుండా మొదటి ప్రాధాన్యత ఓటు నోటాకు వేసి.. మిగిలిన చోట్ల కూడా మొదటి ప్రాధాన్యత అని రాస్తే.. ఆ ఓటు చెల్లదని స్పష్టం చేసింది.