ఎవరూ.. నచ్చలేదు | I don’t Like Any Candidates , I Choose NOTA | Sakshi
Sakshi News home page

ఎవరూ.. నచ్చలేదు

Published Sun, Nov 11 2018 4:14 PM | Last Updated on Sun, Nov 11 2018 4:22 PM

I don’t Like Any Candidates , I Choose NOTA - Sakshi

కొత్తూరు :  నోటాకు పోలయ్యే ఓట్లు తూటాల కంటే బలమైనవి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం, ప్రమాదం ఉంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా జాతీయ ఎన్నికల కమిషన్‌ ఈవీఎం యంత్రాలపై నోటా(పై అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, నోటాకు పోలవుతున్న ఓట్ల సంఖ్య రానురానూ పెరుగుతూ వస్తోంది. కొన్ని సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

2014లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు. అయితే, ఈ నియోజకవర్గంలో నోటాకు 1,139 ఓట్లు పోలవడం గమనార్హం. నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపోటముల ఫలితం మరోలా ఉండేది. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 14 మందికి, ఎల్‌బీనగర్‌లో 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 24 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.  
2014 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు..
 

►షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 1,93,094 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,54,985 ఓట్లు, నోటాకు 846 ఓట్లు పోలైయ్యాయి. 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా 8 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

►కల్వకుర్తి నియోజకవర్గంలో 1,99,714 ఓట్లు ఉండగా 1,61,799 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 11 మంది బరిలో దిగగా ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  

►చేవేళ్ల నియోజకవర్గంలో 2,05,757 ఓట్లకు 1,62,571 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,226 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గం నుంచి మొత్తం 14 మంది పోటీచేయగా 5 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ రావడం గమనార్హం.   

►శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,91,281 ఓట్లకు అభ్యర్థులకు 28,294 ఓట్లు, నోటాకు 2,053 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 22 మంది పోటీచేయగా 14 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  

►రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 3,87,355 ఓట్లకు 2,29,586 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,332 పోలయ్యాయి. 24 మంది అభ్యర్థులు పోటీ చేయగా 14 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  

► మహేశ్వరం నియోజకవర్గంలో 4,03,729 ఓట్లలో అభ్యర్థులకు 2,17,679 ఓట్లు, నోటాకు 1,394 ఓట్లు వేశారు. నియోజకవర్గం నుంచి 22 మంది పోటీ చేయగా 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  
 
► ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 5,29,717 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 2,50,852 ఓట్లు, నోటాకు 2241 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 30 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 24 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి.  

►ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 2,30,388 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,81,443 ఓట్లు, నోటాకు 768 ఓట్లు పోలయ్యాయి. 27 మంది అభ్యర్థులు పోటీ చేయగా 17 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.  

►పరిగిలో మొత్తం 2,11,875 ఓట్లకు 1,50,178 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,301 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక్కడ పది మంది బరిలో దిగగా ఐదుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  

► తాండూరు నియోజకవర్గంలో 1,89,216 ఓట్లకు అభ్యర్థులకు 1,33,324 ఓట్లు, నోటాకు 1,302 ఓట్లు పోలైయ్యాయి. పది మంది పోటీ చేయగా ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.  

►కొడంగల్‌ నియోజకవర్గంలో మొత్తం 1,97,649 ఓట్లకు అభ్యర్థులకు 1,38,300 ఓట్లు, నోటాకు 1,135 ఓట్లు పోలయ్యాయి. 8 మంది పోటీ చే యగా ఒకరికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 

►వికారాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 1,95,951 ఓట్లు ఉండగా 1,37,901 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,040 ఓట్లు పోలయ్యాయి. 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా 7 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement