
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ తన పరిధిని మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతున్నాడు. తన అభిమానులను ప్రేమగా రౌడీస్ అనిపిలుచుకునే విజయ్ ఇప్పటికే రౌడీ పేరుతో ఓ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన ఈ యంగ్ హీరో తాజాగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించాడు విజయ్.
ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నోటా తోనే నిర్మాణ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న నోటా సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ యంగ్ సీయంగా కనిపిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment