నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కు తాజాగా జరుగుతున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికలతో తొలిసారిగా అమల్లోకి వచ్చింది.
జగదల్పూర్ : నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కు తాజాగా జరుగుతున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికలతో తొలిసారి గా అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రత్యేకంగా 'నోటా' బటన్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తిరస్కరణ ఓటుకు నోటా అంటే ' నన్ ఆఫ్ ది ఆబౌ' అని పేరు పెట్టారు. అయితే తిరస్కరణకు పోలింగ్‌కు సంబంధం లేదు. పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు.
ఇక ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు భద్రతా బలగాలు విశేష కృషి చేస్తున్నాయి. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన కుంటలో ఎక్కడా చూసినా పోలీసులే, పారమిలట్రీ బలగాలే కనిపిస్తున్నాయి. ఓటర్లకు భరోసా కల్పించేందుకు వీధి వీధి తిరుగుతున్నారు. భద్రతా బలగాలు భారీగా ఉండటం ఓటర్లలో ధైర్యం నింపుతున్నట్టు కనిపిస్తోంది. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కళకళలాడుతున్నాయి. మావోయిస్టుల హెచ్చరికలుండటంతో..... బస్తర్ ప్రాంతంలో ఎన్నికల సమయాన్ని మార్చారు.