గులాబీ, తెల్ల రంగుల్లో ‘నోటా’ చిహ్నం | Election Commission finalizes symbol for NOTA option | Sakshi
Sakshi News home page

గులాబీ, తెల్ల రంగుల్లో ‘నోటా’ చిహ్నం

Published Sat, Nov 2 2013 2:17 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Election Commission finalizes symbol for NOTA option

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే ఓటర్లకు తిరస్కరించే హక్కును (ఈవీఎంలలో నన్ ఆఫ్ ద ఎబవ్ ఆప్షన్- పైన పేర్కొన్న అభ్యర్థులు ఎవరూ కాదు) కల్పిం చిన కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా దీన్ని త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయనుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెల్ల రంగులో, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై ఈ ఐచ్ఛికను గులాబీ రంగులోనూ ముద్రించనుంది. దీంతో ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 11 కోట్ల మంది పౌరులకు ఈవీఎంలలో ఈ ఐచ్ఛిక తొలిసారిగా అందుబాటులోకి రానుంది. నోటా చిహ్నం దీర్ఘ చతురస్రాకారంలో ‘నన్ ఆఫ్ ద ఎబోవ్ (నోటా)’ అని ఆంగ్లంలో పెద్ద అక్షరాలతో ముద్రించి ఉంటుంది. నన్ ఆఫ్ ద ఎబవ్ పదాలను స్థానిక భాషల్లోనూ ముద్రించాలని ఈసీ ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement