నోటా సినిమాను నిలిపివేయాలి | Stop The NOTA Movie Said By Congress Leaders Guduru Narayana Reddy And Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

నోటా సినిమాను నిలిపివేయాలి

Published Tue, Oct 2 2018 1:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Stop The NOTA Movie Said By Congress Leaders Guduru Narayana Reddy And Sudhakar Reddy - Sakshi

హైదరాబాద్‌: నోటా సినిమాను నిలిపివేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. నోటా సినిమా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యువతపై ప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని అన్నారు.

 కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ..నోటా ట్రైలర్‌ ఓటర్‌ను ప్రభావితం చేసేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం నోటా ప్రివ్యూ చూసిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ స్పందించలేనంత మాత్రాన కాంగ్రెస్‌ మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement