నచ్చలేదా... నోటా నొక్కుడే | Usage Of NOTA In Election | Sakshi
Sakshi News home page

నచ్చలేదా... నోటా నొక్కుడే

Published Fri, Nov 9 2018 5:03 PM | Last Updated on Fri, Nov 9 2018 5:11 PM

Usage Of NOTA In Election - Sakshi

సాక్షి,సదాశివనగర్‌(ఎల్లారెడ్డి):ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో అభ్యర్థులు గుర్తులతో పాటు నోటా(నన్‌ ఆఫ్‌ ది ఎబవ్‌)ను ఎర్పాటు చేశారు. సాధారణంగా ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి ఓటు వేసే విధానం చాలా కాలంగా అమలులో ఉంది. 2014 సాధారణ ఎన్నికల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో  ఓటర్లకు ఎవరూ నచ్చకపోతే వారి అభిప్రాయాన్ని తెలపడం కోసం ఈవీఎంలలో నోటాను పొందుపర్చారు. నోటా మీటను నోక్కితే ఆ ఓటు పోలింగ్‌లో ఉన్న ఆభ్యర్ధుల్లో ఎవరికీ చెందదు. అయితే ఓటరు తన ఓటు హక్కును వినియెగించుకున్నట్లు అవుతుంది. 
          ఇలాంటి ఆవకాశం వివిధ దేశాల్లో ఓటర్లకు చాలా కాలాంగా ఆందుబాటులో ఉండగా భారత్‌లో గత సాధారణ ఎన్నికల నుంచి ఆమలులోకి తెచ్చారు. నోటాను ఆమలులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమీషన్‌ 2009లో తొలిసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు నివేదించింది. అప్పట్లో ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినా  పౌర హక్కుల సంస్థ పీయూసీయల్‌ దీనికి మద్ధతుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు నోటాను అమలు చేయాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్‌ 27న తీర్పు ఇచ్చింది. దీంతో నచ్చకపోయినా ఎవరికో ఒకరికి ఓటు వేయాల్పిన అవరసవం లేకుండా నోటా నోక్కి అభ్యర్థులు ఎవరూ తనకు నచ్చలేదని ఓటరు తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం లభించింది. 2013లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, మిజోరాం, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో నోటాను తోలిసారి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత 2014లో నోటా ఎర్పాటు చేయగా అప్పట్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement