
అర్జున్ రెడ్డి హీరోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోచేరిన ఈ యంగ్ హీరో ఈ శుక్రవారం నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో కోలీవుడ్లోనూ అడుగుపెడుతున్నాడు విజయ్. అందుకే తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నాడు.
తమిళనాట వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్న విజయ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఓ తమిళ జర్నలిస్ట్ సినీరంగంలో వారసత్వంపై అడిగిన ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చాడు. ‘సినిమా అంటే వ్యాపారం కూడా.. ఎవరూ ఊరికే డబ్బులు పెట్టరు. నిర్మాత తను పెట్టిన ఖర్చును తిరిగి ఎలా రాబట్టుకోవాలో లెక్కలేసుకొనే సినిమా చేస్తాడు. అందుకే వారసులైతే ఫ్యాన్స్ కారణంగా సినిమా కొంత సేఫ్ అవుతుంది. కొత్త వారితో తీస్తే రిస్క్ ఎక్కువ’ అంటూ వారసత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
అంతేకాదు ఇండస్ట్రీలో బయటి వ్యక్తులు నిలదొక్కుకోవటం చాలా కష్టమన్న విజయ్, తన లాంటి ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ కాగలుగుతారని అది తమ అదృష్టమని తెలిపాడు. సినీరంగంలోకి రావాలనకున్నప్పుడు తన తండ్రి తనని ఈ విషయంపై హెచ్చరించాడని తెలిపాడు. ‘సినిమా హీరో కావడం కన్నా సివిల్స్ పాస్ అవ్వడం ఈజీ ప్రతీ ఏటా 400 మంది అవకాశం ఉంటుంది. కానీ సినిమాల్లో ప్రూవ్ చేసుకోవటం అంతా ఈజీ కాద’ని చెప్పారని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment