నోటా నొక్కాడు.. దగ్గుబాటి రికార్డులకెక్కాడు!
నోటా నొక్కాడు.. దగ్గుబాటి రికార్డులకెక్కాడు!
Published Fri, Feb 7 2014 8:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యేక గుర్తింపును పొందారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కుని ఉపయోగించుకున్న దగ్గుబాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నోటా (పై వారు ఎవరూ కాదు) ఆప్షన్ ను ఉపయోగించుకున్న తొలి ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కాడు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బిల్లును తిరస్కరించాం. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలను పాటిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతాయి. అలాంటి సంకేతాలు వెళ్లకూడదని నోటా ఆప్షన్ ఎంచుకున్నాను' అని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా తెలిపినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement