daggubati venkateswara rao
-
నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా?
కప్పుకునేది కాషాయం కండువా చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బీజేపీని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి..ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టీడీపీ వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్‌తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతులు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట. ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాల కోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్‌ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టీడీపీతో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టీడీపీ నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి. ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు.. వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టీడీపీ గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని.. తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
దగ్గుబాటికి గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళ వారం గుండెపోటుకు గురయ్యారు. హుటా హుటిన ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి 2 స్టెంట్లు వేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. -
పర్చూరులో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
-
పరుచూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి దగ్గుబాటి ప్రచారం
-
ఆమంచి, దగ్గుబాటిని ఆహ్వానించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమంచి బుధవారం పార్టీలో చేరారు. ఈమేరకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఆమంచితో పాటు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ కూడా పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయం ప్రారభోత్సవం సందర్భంగా వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. (తాడేపల్లిలో వైఎస్ జగన్ గృహ ప్రవేశం) -
జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి: దగ్గుబాటి
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలో రేపు (బుధవారం) వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. దగ్గుబాటి మంగళవారం విజయవాడలో ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేను, నా కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ , ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీలో చేరుతున్నాం. మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్. ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత వల్లే వైఎస్సార్ సీపీలో చేరాలని నా కుమారుడు హితేష్ నిర్ణయించుకున్నాడు. రాజకీయాల్లోకి రావాలనే దానిపై హితేష్ ... తల్లిదండ్రులుగా మమ్మల్ని సలహా అడిగాడు. రాజకీయాలు అంటే చాలా బాధ్యతగా స్వీకరించాలనే చెప్పాం. దాన్ని హితేష్ సీరియస్‌గా తీసుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వస్తున్నాడు.’ అని అన్నారు. (వైఎస్ జగన్‌తో దగ్గుబాటి భేటీ) జగన్‌తో కలిసి పని చేయడానికి ఆనందంగా ఉంది.. వైఎస్ జగన్‌తో కలిసి పని చేయడానికి చాలా ఆనందంగా ఉందని దగ్గుబాటి హితేశ్ అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ ఎనలేని పోరాటం చేస్తున్నారని హితేశ్ పేర్కొన్నారు. పాదయాత్రలో ఆయన పడిన కష్టం, ప్రజలకు మేలు చేసేందుకు పడుతున్న తపన చూస్తే... వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరికీ మేలు జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు. అమ్మానాన్నలు ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబంపై ఒక్క మచ్చ కూడా లేదని హితేశ్ తెలిపారు. -
మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్
-
ప్రజా శ్రేయస్సు కోసం జగన్ రావాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు తోడల్లుడు, సీనియర్ రాజకీయ వేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పయనించాలని తన కుమారుడు హితేష్ నిర్ణయించుకున్నారని, అందుకే జగన్‌ను కలుసుకున్నామని చెప్పారు. కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాంతో కలిసి ఆదివారం ఆయన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇదే ఆకాంక్షను తాను జగన్ వద్ద వ్యక్తం చేశానన్నారు. ఏపీలో ప్రభుత్వ పనితీరు పూర్తిగా గాడి తప్పిందని, ప్రభుత్వ డబ్బుతో దీక్షలు చేయడం సరికాదని విమర్శించారు. అసలు తన వద్ద నిధులు లేవంటూనే.. కోట్లకు కోట్లు ఖర్చు చేసి దీక్షలు చేయడం ఏమిటని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ‘జిల్లాల్లో సభల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.. బస్సుల్లో ప్రజలను సభలకు తీసుకు వస్తున్నారు.. టెంట్లు వేస్తున్నారు, కలెక్టర్లు, ఎస్పీలు ఈ సభల కోసమే పని చేస్తున్నారు.. అధికారులంతా తమ విధులను వదలి టీడీపీ కార్యక్రమాల కోసమే నెలలో పది రోజులు పని చేయాల్సి వస్తోంది. ఇంత వరకు రైతుల రుణమాఫీ నాలుగు, ఐదు విడతల డబ్బు ఇవ్వలేదు గానీ, పోస్ట్ డేటెడ్ చెక్కుల ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు డబ్బులు ఇస్తామంటున్నారు. ఇంత విచిత్రమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? కేవలం ఎన్నికల ముందు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం సరికాదు’ అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్. చిత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగన్‌పై అన్నీ పుకార్లే.. జగన్ ప్రవర్తన గురించి ఎన్నో పుకార్లు సృష్టించారని, అయితే ఆయన్ను కలిసి మాట్లాడాక అవన్నీ ఓ పథకం ప్రకారం ప్రత్యర్థులు చేస్తున్నవనేది అర్థం అయిందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. జగన్ మీడియా ఇంటర్వ్యూలు, సుదీర్ఘ పాదయాత్రను గమనించానని, ఒక రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో తనకు తెలియనిది కాదన్నారు. ఇన్నేళ్లుగా ఎన్నో కష్టాలకు ఓర్చి పార్టీని నడుపుతున్న తీరు ఎంతో కష్టమైన పని అని, అందుకే జగన్ కష్టానికి దేవుడు తప్పకుండా మంచి ఫలితం చూపిస్తారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పయనించడానికి వచ్చామని భేటీ సందర్భంగా తెలియ జేసినప్పుడు జగన్ సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. అసెంబ్లీ టికెట్ ఆశించి వచ్చారా? అని మీడియా ప్రశ్నించినప్పుడు.. పార్టీ విధి విధానాల ప్రకారం టికెట్ల కేటాయింపు ఉంటుందని, పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. తన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతారని, లేదంటే రాజకీయాల నుంచి విరమించుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తామంతా ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ, ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఇష్టాలు వారివన్నారు. రాజకీయాల్లో బిడ్డల అభిప్రాయం ప్రకారమే ఉండాలని ఏమీ లేదని, బీజేపీలో పెద్దలు కూడా.. రాజకీయాల్లోనే కొనసాగాలని పురంధేశ్వరికి సూచించారన్నారు. వైఎస్సార్సీపీలో ఎప్పుడు చేరుతున్నారని ప్రశ్నించగా, తమ శ్రేయోభిలాషులు, హితులందరితో మాట్లాడాలన్నారు. జగన్‌తో ఈ సమావేశం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నామనే సంకేతం ఇవ్వాలనే ఇక్కడకు వచ్చామని చెప్పారు. వారు జగన్‌తో భేటీ అయినప్పుడు పార్టీ ముఖ్య నేతలు వి.విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. -
వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తాం
-
‘వైఎస్సార్ సీపీలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నాం’
సాక్షి, హైదరాబాద్: తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు సీనియర్ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం ఆయన తన కుమారుడు హితేశ్‌తో కలిసి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు, నరసరావుపేట నియోజకవర్గ లోక్‌సభ కో ఆర్డినేటర్ కృష్ణదేవరాయులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘హితేశ్ వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తారు. మా నిర్ణయాన్ని వైఎస్ జగన్ స్వాగతించారు. గత రెండు ఏళ్లుగా వైఎస్ జగన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని నడుపుతున్నారు. ఆయన పడుతున్న కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలం చూపెడతాడు. ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తిస్తున్నార’ని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పనితీరు గాడి తప్పిందని విమర్శించారు. డబ్బులు లేవని చెబుతూ.. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చంద్రబాబు దీక్షలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో, ఐదో విడుత రైతుల రుణమాఫీకి ఇంకా డబ్బులు విడుదల చేయలేదని అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తామని చెబుతున్నారని.. ఇంత విచిత్రమైన పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పోస్ట్‌డేటెడ్ చెక్కుల పేరిట రాజకీయాలు చేయడాన్ని తప్పుపట్టారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. తన భార్య పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ
-
వైఎస్ జగన్‌తో దగ్గుబాటి భేటీ
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లో జగన్‌తో దగ్గుబాటి భేటీ అయ్యారు. తన కుమారుడు హితేష్‌తో కలిసి జగన్ నివాసానికి చేరుకున్న దగ్గుబాటికి వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సాదర స్వాగతం పలికారు. గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం.. వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌తో దగ్గుబాటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య పురందేశ్వరి బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
‘అనుమానాలు నివృత్తి చేసి నిధులు తెచ్చుకోవాలి’
-
చంద్రబాబుపై మండిపడ్డ దగ్గుబాటి!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఓట్లు పొందవచ్చని.. అందుకోసమే ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తే దీక్షలు చేయడం, ప్రజలను రెచ్చకొట్టడం కాకుండా పోలవరంపై అనుమానాలు నివృత్తి చేసి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా లేకపోయిన 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పడు మళ్లీ కేంద్రాన్ని ఎందుకు నిధుల గురించి అడుగుతోందని ప్రశ్నించారు. వైజాగ్, చెన్నై కారిడార్‌కు భూ సేకరణ, వసతులు కల్పించకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తోందని విమర్శించారు. బీజేపీ ఏడు మండలాలను విలీనం చేయకపోతే పోలవరం సాధ్యం కాకపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. 10 జాతీయ సంస్థలకు ఒకేసారి 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అసాధ్యం అన్నారు. రాజధాని కడతామని ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలో చెప్పారని.. ఈ విషయంలో బీజేపీ వైఖరి బాగోలేదని అన్నారు. మోదీ మాటలను ప్రశ్నిస్తున్న టీడీపీకి.. ఎన్నికల సమయంలో వారిచ్చిన రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు గర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. పరిపాలన అంటే ప్రెస్ మీట్లు, దీక్షలు కావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల లాభమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్లకు 60వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెబితే ప్రభుత్వం డీపీఆర్‌లు ఇవ్వలేదని విమర్శించారు. విభజన బిల్లులో పోర్టు, స్టీల్ ప్లాంట్లు కచ్చితంగా ఇస్తామని చెప్పలేదన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవనా అంటూ ప్రశ్నించారని, దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావని అన్నారని మరోసారి గుర్తుచేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో చంద్రబాబు పడ్డారని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. రాజకీయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఓ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధి హామీ నిధులతో చంద్రన్న రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. -
ప్రతిపక్షపార్టీగా వైఎస్ఆర్సీపీ సమర్థవంతంగా పనిచేస్తోంది
-
అందుకే రాజకీయాలకు దూరం: దగ్గుబాటి
సాక్షి, విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ భవిష్యుత్‌పై సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో తాను ఎప్పుడూ డబ్బు పంచలేదన్నారు. పదవీకాలం ముగిసే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చానని దగ్గుబాటి వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవని నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి కనీసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు తీసుకున్నా ఓటర్లు తమ మనోభావాలకు అనుగుణంగానే ఓట్లు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 1983కు ముందు ఇటువంటి రాజకీయ వాతావరణం లేదని, క్రమంగా పెరిగిందన్నారు. అందుకే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయాలను ఎవరూ శాశ్వతంగా శాసించలేరని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న మోసాలను, తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతోందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై.. తెలంగాణలో ఓట్ల కోసం ఆనాటి ఏపీ నేతలు పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై మాట్లడలేదని దగ్గుబాటి ఎద్దేవ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్‌ల పనుల్లో పురోగతి సాధించారన్నారు. దేవగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఓట్లు పోతాయనే భయంతో తిరస్కరించాని ఆనాటి నేతలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కేంద్రం పరిధిలోనిదని.. అందుకే ఆ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానికే అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. మోదీ పాలనపై.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత, కుటుంబపరమైన ప్రలోభాలకు అతీతుడని అభివర్ణించారు. గూడ్స్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) సాహసోపేత సంస్కరణగా పేర్కొన్నారు. రాజకీయ కారణాలు, ఇతర అంశాల వల్ల జీఎస్టీ విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ కూడా గొప్ప నిర్ణయమే కానీ ఇన్‌కంటాక్స్ అధికారులు సరైన విధంగా నడిపించకపోవడంతో ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చిందని వివరించారు. -
బాలయ్యా.. నీకు గుర్తుందా?
న్యూఢిల్లీ: ''బాలయ్యా.. చంద్రబాబును చంపెయ్. ఆయన రక్తంతో తడిసిన కత్తిని తెచ్చి నాకు చూపించు'' సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు మామ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన ఆఖరి ఘడియల్లో చేసిన వ్యాఖ్యలివి. 'ఓటుకు కోట్లు' రాజకీయాలతో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలను గుండు గుత్తగా కొనుగోలు చేసి తన రాజకీయ జీవితానికి చరమాంకం పాడిన చంద్రబాబు పట్ల ఎన్టీ రామారావు బాధతో చేసిన వ్యాఖ్యలివని 2009, మార్చి 18వ తేదీన తన బావమరిది, సినీనటుడు బాలకృష్ణకు ఎన్టీ రామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు స్వయంగా రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి దగ్గుబాటి ఈ లేఖను ఫిబ్రవరి నెలలోనే రాసినప్పటికీ....తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న బాలకృష్ణ వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తానీ లేఖను బయట పెడుతున్నానని దగ్గుబాటి మార్చి నెలలో మీడియా సాక్షిగా చెప్పారు. అప్పుడు ఈ లేఖ తెలుగు నాట ఎంతో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నందుకు నిరసనగా బాలకృష్ణ, గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలోని తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తాను బాలకృష్ణకు రాసిన లేఖను దగ్గుబాటి విడుదల చేశారు. 'బాలయ్య! నీకు గుర్తుందా ? మీ నాన్న తన ఆఖరి ఘడియల్లో ఓ రోజు నీతో ఓ విషయం చెప్పారు. ''నీవు నా కొడుకువు. చంద్రబాబును చంపెయ్, రక్తంతో తడిసిన ఆ కత్తిని తెచ్చి నాకు చూపించు'' అన్నారు. ఆయన ఉద్దేశం నిజంగా చంద్రబాబును నీవు చంపాలనికాదు. చంద్రబాబు కారణంగా తాను ఎంత బాధ పడుతున్నానో చెప్పడమే ఆయన ఉద్దేశం. ఆనాడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఓ సీడీలో కూడా నిక్షిప్తం చేసుకున్నావు' అని బాలయ్యనుద్దేశించి దగ్గుబాటి ఆ లేఖలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 1995, ఆగస్టులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటుకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. వెన్నుపోటు పాపంలో తనకు కూడా భాగస్వామ్యం ఉందంటూ దగ్గుబాటి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఈ లేఖను బయటపెట్టినప్పుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన భార్య పురంధేశ్వరి లోక్‌సభకు ఎంపికై కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు నైతికత, విలువల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో నాటి సంఘటనలను గుర్తు చేయడం సమంజసంగా భావించాం. దగ్గుబాటి రాసిన లేఖ నాటి పత్రికలను తిరగేస్తే ఇప్పటికీ కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్‌లో వెతికినా దొరుకుతుంది. -
ఎక్కడ సీటిస్తే అక్కడ పోటీ: పురందేశ్వరి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. అయితే బీజేపీ తనకు ఎక్కడి నుంచి టిక్కెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీచేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎంపీ సుబ్బరామిరెడ్డి లాంటి వారినుంచి అవమానాలు ఎదురైనా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని మండిపడ్డారు. విభజన పేరిట కాంగ్రెస్, కేంద్రం సీమాంధ్రకు అన్యాయం చేసినందునే తాను ఆ పార్టీని వీడానన్నారు. ఆమె శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు. కానీ సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి మేము ప్రతిపాదించిన ఏ అంశాన్నీ కేంద్రం పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను అనుసరించే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నాపై కేంద్ర మంత్రి జైరాం రమేష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. రామాయపట్నంలో నేను భూములు కొన్నట్లు చెబుతున్న జైరాం రమేష్ ఆ సర్వే నంబర్లు చెబితే వెళ్లి ఎక్కడున్నాయో చూసుకుంటా. హరికృష్ణ ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆశీర్వాదం నాకు ఉంటుంద’’ని పురందేశ్వరి అన్నారు. -
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా'
-
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: దగ్గుబాటి
తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పెద్ద అల్లుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కారంచేడులో ఆయన స్వగృహంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. అందువల్లే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వేంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అయితే ఆయన భార్య కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరీ నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై నిరసనగా ఆ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి పురందేశ్వరీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
చిన్నమ్మకు ఆ గౌరవం దక్కుతుందా?
దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన ఆయన కుమార్తె పురందేశ్వరి హస్తాన్ని వీడి కమలాన్ని అందుకోనున్నారు. సన్నిహితులు, నియోజకవర్గ ప్రజలు చిన్నమ్మ అని పిలుపించుకునే ఆమె ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. దగ్గుబాటి దంపతులు రేపో, మాపో బీజేపీ అగ్రనేతలను కలిసి కమల తీర్థం పుచ్చుకోనున్నారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే డిపాజిట్ కూడా దక్కదనే భయమో... లేక దేశవ్యాప్తంగా కనిపిస్తున్న నరేంద్ర మోడీ హవానో... మొత్తానికి హస్తం నుంచి కమలం వైపు జంప్ కావాలని దగ్గుబాటి పురందేశ్వరీ నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తమ మాట చెల్లుబాటు కాలేదని కొన్నాళ్లు పురందేశ్వరి కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విభజన బిల్లు పాస్ కాగానే ఆమె తన మంత్రి పదవిని వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పాలని తన నియోజకవర్గం విశాఖలో కార్యకర్తల అభిప్రాయం కోరారు. అందరూ తనను కాంగ్రెస్‌ను విడిచి పెట్టాలని సూచించారని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్ఠానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తనను మానసికంగా హింసించిందని చిన్నమ్మ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను ఒక ఆడదాన్ని.. మౌనంగా అంతా భరించాను. అయినా సహనంతో ఉన్నాను. నన్ను నమ్ముకున్న క్యాడర్, నా మనుషుల ఏమైపోయినా ఫరవాలేదా? ఇంత జరుగుతున్నా ఎప్పుడూ ఎవ్వరినీ విమర్శించలేదు. ప్రశ్నించలేదు. ఇదే స్థానంలో మరో ఎంపి ఉంటే, పార్టీ ఇలాగే వ్యవహరించేదా? ఇలా జరిగితే ఆ ఎంపి ఊరుకుంటారా? అని' ఆమె ఇటీవలే అధిష్ఠానం తనను పూచిక పుల్లలా ఎలా తీసి పారేసిందో కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ మారినా, మీ వెంటే ఉంటామని చాలామంది చిన్నమ్మకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. మరి కాంగ్రెస్‌లో దక్కని గౌరవం దగ్గుబాటి దంపతులకు కమలంలో దక్కుతుందా? పురందేశ్వరి, వెంకటేశ్వరరావుకు కమలతీర్థం అచ్చొస్తుందా అనేది భవిష్యత్‌లో తేలనుంది. వాస్తవానికి రాజకీయాల నుంచే తప్పుకోవాలని పురందేశ్వరీ భావించారట. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒప్పుకోలేదట. కుటుంబంగా భావించే విశాఖ కార్యకర్తల అభీష్ఠం మేరకే రాజకీయాల్లో కొనసాగాలని పురందేశ్వరీ నిర్ణయించుకున్నారట. ఒకసారి అలవాటు అయ్యాక 'ఎంతటి వారైనా..పదవికి దాసులే’ అనడానికి తాజా రాజకీయ పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. -
రేపు బీజేపీ అగ్రనేతలను కలుస్తా: పురందేశ్వరి
తాను బీజేపీలో చేరుతున్నట్లు కేంద్ర మంత్రి పురందేశ్వరి చెప్పకనే చెప్పారు. విశాఖపట్నంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం తాను ఢిల్లీ వెళ్లి అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి సీనియర్ నాయకులను కలుస్తానని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. బీజేపీలో చేరడానికి తాను ఎలాంటి షరతులు పెట్టడంలేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న తమను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజనను చాలా అన్యాయమైన పద్ధతుల్లో చేశారని, సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆమె కాంగ్రెస్ అధిష్ఠానంపై మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. విభజన విషయంలో జరిగిన పరిణామాలు తనను చాలా బాధపెట్టాయన్నారు. ఈ ఐదేళ్లలో తనను కేవలం ఒక ఎంపీగానే కాకుండా.. సొంత బంధువులా ఆదరించారని, ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్లందరితో మంచి బంధుత్వం ఏర్పడిందని ఆమె చెప్పారు. వాళ్లందరినీ సమావేశపరిచి వాళ్లకు విషయాలు చెప్పి, మార్గదర్శనం చేయమన్నానని, వారిలో చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరిచారని తెలిపారు. ఈ నెలరోజుల నుంచి తమ కుటుంబ సభ్యులు, దగ్గరవాళ్లు అందరూకూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారని అన్నారు. పదేళ్లు చేశాం కాబట్టి, ఇక అసలు రాజకీయాలే వద్దనుకున్నానని, అయితే.. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నందున రాజకీయాల్లో కొనసాగాలని వాళ్లంతా చెప్పారన్నారు. అందుకే తాను ఇక తుది నిర్ణయం తీసుకున్నానని, ముందుగా ఆ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు, నాయకులతో్ పంచుకోడానికి ఇక్కడకు వచ్చానని పురందేశ్వరి తెలిపారు. ఇది అవకాశం వాదం అని కొందరు అనుకోవచ్చుగానీ, అదిమాత్రం కాదన్నారు. తనతో రావాల్సిందిగా నాయకులెవరినీ ఒత్తిడి చేయలేదని, వారి ఆలోచనకే ఆ అంశాన్ని వదిలేశానని తెలిపారు. తన నిర్ణయం సరైనదో కాదో ప్రజలే తేలుస్తారని, ఎన్నికల ఫలితాలతో ఆ విషయం వెల్లడవుతుందని అన్నారు. ఇంతకుముందు తాను ఏ పార్టీ నాయకులనూ సంప్రదించలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై పురందేశ్వరి దంపతులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వాళ్లు గురువారం విశాఖలోని పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడే విషయంపై వారు మంతనాలు జరిపారు. గత అయిదేళ్లుగా తమతో ఉన్న కొద్దిమంది నేతలతో దగ్గుబాటి దంపతులు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. తమ అనుచరులతో పాటు ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులతో ఈ సమావేశం నిర్వహించారు. బీజేపీలోకి వెళ్లాలన్న తమ ఆలోచనను ప్రస్తావించగా, ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ విజయప్రసాద్, ద్రోణం రాజు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, అందువల్ల పార్టీ మారాలన్న అభిప్రాయాన్ని దగ్గుబాటి దంపతులు వెల్లడించినట్లు వారి సన్నిహితవర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర విభజన విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోమని ఆ లేఖలో పేర్కొన్నారు కూడా. ఇక రాజ్యసభ ఎన్నికల్లో పురందేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నిర్దేశించిన అభ్యర్థి కేవీపీ రామచంద్రరావుకు ఓటు వేయలేదు. -
కాంగ్రెస్‌ను వీడనున్న దగ్గుబాటి దంపతులు!
-
బీజేపీలోకి దగ్గుబాటి దంపతులు!
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేమని దిగ్విజయ్‌కు కేంద్ర మంత్రి పురందేశ్వరి లేఖ విభజనపై తమ వాదనలను పట్టించుకోలేదంటూ విమర్శ సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్‌ను వీడనున్నారా? బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? తాజా పరిణామాలు ఇదే విషయూన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజన విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శనివారం లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పురందేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నిర్దేశించిన అభ్యర్థి కేవీపీ రామచంద్రరావుకు ఓటు వేయలేదు. ఇది జరిగిన మరునాడే దిగ్విజయ్‌కు పురందేశ్వరి లేఖ రాసినట్లు వార్తలొచ్చారుు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, అందువల్ల పార్టీ మారాలన్న అభిప్రాయంతో దగ్గుబాటి దంపతులు ఉన్నట్లు వారి సన్నిహితవర్గాలు తెలిపారుు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కడం కష్టమేనన్న అభిప్రాయంతో వారు రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ స్థాయి నేతతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. -
బీజేపీలో చేరేందుకే దగ్గుబాటి డ్రామా
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :కాంగ్రెస్ అధినేత్రిసోనియాగాంధీ ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసిన పర్చూరు శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజావలి డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు అన్యాయం జరిగింది కాబట్టి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయటానికి తన అంతరాత్మ అంగీకరించటంలేదని దగ్గుబాటి చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏనాడూ సమైక్య ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించని దగ్గుబాటి ప్రజలను మోసం చేయటానికే సమైక్య మంత్రం వల్లెవేస్తున్నారని ఆరోపించారు. దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరాలనే ఉద్దేశంతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. దగ్గుపాటి దంపతులకు కాంగ్రెస్ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, నేడు కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతోందని ఆ దంపతులు ఇలా ప్రవర్తించడం దుర్మార్గమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి చుక్కా చంద్రపాల్, ఎస్టీసెల్ చైర్మన్ ఆమోస్ రాములు, డీసీసీ అధికార ప్రతినిధి జెల్ది రాజమోహన్, ప్రధాన కార్యదర్శి టి.మోహనరావు, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లెపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.