ఎవరికి ఓటు వేయని దగ్గుబాటి | MlA Daggubati venkateswarao cast reject vote | Sakshi
Sakshi News home page

ఎవరికి ఓటు వేయని దగ్గుబాటి

Published Fri, Feb 7 2014 10:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

ఎవరికి ఓటు వేయని దగ్గుబాటి

ఎవరికి ఓటు వేయని దగ్గుబాటి

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటును వినియోగించుకున్నారు. ఆయన తన ఓటును ఏ అభ్యర్థికి వేయలేదు. పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల విధానం తనకు నచ్చనందున తాను ఓటు వేయలేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలిపానన్నారు. విభజనలో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు చెప్పారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటును వేశారు. కాగా ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరంగా ఉన్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి (టీడీపీ), కే కేశవరావు (టీఆర్‌ఎస్) రాజ్యసభ బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement