reject vote
-
ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేయగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా తిరస్కార హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు. ఇక సాయంత్రం 5 గంటలకు రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత ఏడుగురు అభ్యర్థులు ఆరు స్థానాల కోసం పోటీ చేసినా, చిట్టచివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో ఆరుగురి మధ్యనే పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్ పోటీ చేశారు. టీడీపీ నుంచి గరికపాటి మోహనరావు, సీతామహాలక్ష్మి పోటీ పడుతున్నారు. ఇక టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు పోటీ చేశారు. -
ఎవరికి ఓటు వేయని దగ్గుబాటి
-
ఎవరికి ఓటు వేయని దగ్గుబాటి
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటును వినియోగించుకున్నారు. ఆయన తన ఓటును ఏ అభ్యర్థికి వేయలేదు. పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల విధానం తనకు నచ్చనందున తాను ఓటు వేయలేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలిపానన్నారు. విభజనలో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటును వేశారు. కాగా ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరంగా ఉన్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి (టీడీపీ), కే కేశవరావు (టీఆర్ఎస్) రాజ్యసభ బరిలో ఉన్న విషయం తెలిసిందే.