రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 248 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల ఖాళీ బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా తిరస్కార హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు.
ఇక సాయంత్రం 5 గంటలకు రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత ఏడుగురు అభ్యర్థులు ఆరు స్థానాల కోసం పోటీ చేసినా, చిట్టచివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో ఆరుగురి మధ్యనే పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్ పోటీ చేశారు. టీడీపీ నుంచి గరికపాటి మోహనరావు, సీతామహాలక్ష్మి పోటీ పడుతున్నారు. ఇక టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు పోటీ చేశారు.