మరోసారి రాజ్యసభకు వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం 57 స్థానాలకుగాను 30 ఏకగ్రీవం కాగా, 27 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజస్థాన్ నుంచి బరిలో దిగిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఓం ప్రకాశ్ మాథుర్, హర్షవర్ధన్ సింగ్, రామ్ కుమార్ వర్మలు గెలుపొందారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ మద్దతిచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి కమల్ మొరక ఓటమి చెందారు. ఉత్తర్ ప్రదేశ్లో అన్ని స్థానాలను(ఏడు) సమాజ్ వాదీ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన వివేక్ ఠంకా మధ్యప్రదేశ్ నుంచి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులుగా ఎంజే అక్బర్, అనిల్ మాధవ్ దవేలు మధ్యప్రదేశ్ నుంచి విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ తంట ఉత్తరఖండ్ నుంచి గెలుపొందారు. ఉత్తరఖండ్లో బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అనిల్ గోయల్ ఓటమిచెందారు. కాంగ్రెస్ అభ్యర్తి కపిల్ సిబల్ గెలుపొందారు. జార్ఖండ్ లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మహేష్ పోద్దాయ్లు గెలుపొందారు. కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గెలుపొందారు. హర్యానాలో బీజేపీ మద్దతుతో జీటీవీ అధినేత సుభాష్ చంద్ర గెలుపొందారు.