సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలో రేపు (బుధవారం) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. దగ్గుబాటి మంగళవారం విజయవాడలో ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేను, నా కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ , ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీలో చేరుతున్నాం. మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్. ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత వల్లే వైఎస్సార్ సీపీలో చేరాలని నా కుమారుడు హితేష్ నిర్ణయించుకున్నాడు. రాజకీయాల్లోకి రావాలనే దానిపై హితేష్ ... తల్లిదండ్రులుగా మమ్మల్ని సలహా అడిగాడు. రాజకీయాలు అంటే చాలా బాధ్యతగా స్వీకరించాలనే చెప్పాం. దాన్ని హితేష్ సీరియస్‌గా తీసుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వస్తున్నాడు.’ అని అన్నారు. (వైఎస్ జగన్‌తో దగ్గుబాటి భేటీ)
జగన్‌తో కలిసి పని చేయడానికి ఆనందంగా ఉంది..
వైఎస్ జగన్‌తో కలిసి పని చేయడానికి చాలా ఆనందంగా ఉందని దగ్గుబాటి హితేశ్ అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ ఎనలేని పోరాటం చేస్తున్నారని హితేశ్ పేర్కొన్నారు. పాదయాత్రలో ఆయన పడిన కష్టం, ప్రజలకు మేలు చేసేందుకు పడుతున్న తపన చూస్తే... వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరికీ మేలు జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు. అమ్మానాన్నలు ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబంపై ఒక్క మచ్చ కూడా లేదని హితేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment