బీజేపీలో చేరేందుకే దగ్గుబాటి డ్రామా
Published Sun, Feb 9 2014 1:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :కాంగ్రెస్ అధినేత్రిసోనియాగాంధీ ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసిన పర్చూరు శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజావలి డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు అన్యాయం జరిగింది కాబట్టి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయటానికి తన అంతరాత్మ అంగీకరించటంలేదని దగ్గుబాటి చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఏనాడూ సమైక్య ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించని దగ్గుబాటి ప్రజలను మోసం చేయటానికే సమైక్య మంత్రం వల్లెవేస్తున్నారని ఆరోపించారు. దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరాలనే ఉద్దేశంతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. దగ్గుపాటి దంపతులకు కాంగ్రెస్‌ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, నేడు కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతోందని ఆ దంపతులు ఇలా ప్రవర్తించడం దుర్మార్గమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి చుక్కా చంద్రపాల్, ఎస్టీసెల్ చైర్మన్ ఆమోస్ రాములు, డీసీసీ అధికార ప్రతినిధి జెల్ది రాజమోహన్, ప్రధాన కార్యదర్శి టి.మోహనరావు, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లెపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement