Rajya Sabha poll
-
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర ఎన్సీపీ అభ్యరి్థగా గురువారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మంత్రి ఛగన్ భుజ్‌బల్, లోక్‌సభకు ఎన్నికైన సునీల్ తాట్కరే వెంటరాగా విధాన్ భవన్లో ఆమె నామినేషన్ సమరి్పంచారు. మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన నుంచి ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దేశం దృష్టిని ఆకర్షించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో సునేత్ర ఓటమి పాలైన విషయం తెలిసిందే. పీయూష్ గోయల్, ఉదయన్‌రాజే భోంస్లే (ఇద్దరూ బీజేపీ) ఇటీవలే లోక్‌సభకు ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అస్సాం, బిహార్లలో రెండేసి, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపురలలో ఒకటి చొప్పున రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. ఆయా చోట సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
రాజ్యసభ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 18 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సోమవారం తేదీలను ప్రకటించింది. ఈనెల 19న ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుపుతామని తెలిపింది. అదో రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు, గుజరాత్ 4, జార్ఖండ్ 2, మధ్యప్రదేశ్ 3, మణిపూర్ 1, రాజస్తాన్ 3, మేఘాలయలో 1 స్థానానికి సీఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. -
నోటా నొక్కాడు.. దగ్గుబాటి రికార్డులకెక్కాడు!
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యేక గుర్తింపును పొందారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కుని ఉపయోగించుకున్న దగ్గుబాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నోటా (పై వారు ఎవరూ కాదు) ఆప్షన్ ను ఉపయోగించుకున్న తొలి ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కాడు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బిల్లును తిరస్కరించాం. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలను పాటిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతాయి. అలాంటి సంకేతాలు వెళ్లకూడదని నోటా ఆప్షన్ ఎంచుకున్నాను' అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా తెలిపినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.