రాజ్యసభ ఎన్నికలకు గ్రీన్ ‌సిగ్నల్‌ | Elections to 18 Rajya Sabha seats to be held on June 19 | Sakshi
Sakshi News home page

ఈ నెల 19 రాజ్యసభ ఎన్నికలు

Published Mon, Jun 1 2020 6:04 PM | Last Updated on Mon, Jun 1 2020 6:39 PM

8 Rajya Sabha seats to be held on June 19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 18 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సోమవారం తేదీలను ప్రకటించింది. ఈనెల 19న ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్‌ జరుపుతామని తెలిపింది. అదో రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు, గుజరాత్‌ 4, జార్ఖండ్‌ 2, మధ్యప్రదేశ్‌ 3, మణిపూర్‌ 1, రాజస్తాన్‌ 3, మేఘాలయలో 1 స్థానానికి సీఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement