bretain
-
ఈ ముత్యమెంతో ముద్దు..
ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ముత్యం. ఇది కృత్రిమమైనది కాదు.. సహజసిద్ధమైనది. 33.15 క్యారెట్ల ఈ ముత్యం వ్యాసం 0.7 అంగుళాలు. మొన్నమొన్నటివరకూ ఇదో అరుదైన ముత్యమని దీన్ని ధరించినవారికి కూడా తెలియదు. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు చెందిన ముత్యపు చెవి రింగులను అమ్మడానికి నిపుణుల వద్దకు తెచ్చినప్పుడు.. అందులో ఒకదానికి ఉన్న ముత్యాన్ని చూసిన నిపుణులు అనుమానంతో దాన్ని పరీక్షల నిమిత్తం తొలుత లండన్ తర్వాత స్విట్జర్లాండ్ పంపించారు. దాన్ని ఎక్స్‌రే తీసిన నిపుణులు చివరికది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సహజ ముత్యమని తేల్చారు. దీన్ని మే 1వ తేదీన బ్రిటన్‌కు చెందిన వూలీ అండ్ వాలిస్ సంస్థ వేలం వేయనుంది. కనీసం రూ.2.5 కోట్లు పలుకుతుందని అంచనా. -
వేలిముద్రలతో ఆడో.. మగో చెప్పేస్తారు!
లండన్: వేలిముద్రలను విశ్లేషించి నేరస్తుల, వ్యక్తుల గుర్తింపును ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించడం మనకు తెలిసిందే. అయితే వేలిముద్రలను పరిశీలించి అవి స్త్రీలవో, పురుషులవో కూడా చెప్పేయొచ్చంటున్నారు బ్రిటన్‌లోని షఫీల్డ్ హాలమ్ వర్సిటీ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో నేరస్తులు, వ్యక్తుల బండారాన్ని అనేక రకాలుగా బయటపెట్టే ఈ వినూత్న వేలిముద్రల పద్ధతిని ఇప్పుడు వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు ప్రయోగపూర్వకంగా పరీక్షిస్తున్నారు. వేలిముద్రలతోపాటు వాటిపై ఉండిపోయే చెమట, ఇతర రసాయనాల అణువులు, హెయిర్ స్టైలింగ్ కోసం వాడే జెల్, కండోమ్ లూబ్రికెంట్స్ వంటివాటిని బట్టి ఆ వేలిముద్రలు ఆడవారివో, మగవారివో 85 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. నేరానికి పాల్పడేముందు ఆ వ్యక్తులు కాఫీ తాగారా? డ్రగ్స్ తీసుకున్నారా? అన్న విషయాలనూ వారి వేలిముద్రల ఆధారంగా నిర్ధారించవచ్చని చెబుతున్నారు. -
రూ.18లక్షల వజ్రం.. మింగేసిన శునకం
లండన్: ప్రేమగా పెంచుకునే బుజ్జి కుక్క.. ఆ యజమానురాలిని కంగారుపెట్టించిం ది.రెండ్రోజుల పాటు నిద్ర లేకుండా చేసిం ది. బ్రిటన్‌లోని దెవాన్లో యాంగీకొల్లిన్స్(51) ఒక రోజు గోళ్లను శుభ్రం చేసుకునేం దుకు చేతివేలికున్న పెళ్లి ఉంగరాన్ని తీసి కిచెన్‌లో పెట్టింది. ఆ వజ్రపుటుంగరం విలువ సుమారు రూ.18 లక్షలు. తీరా తన పని పూర్తయ్యాక వెళ్లి గదిలో చూస్తే ఉంగరం కనిపించలేదు. కొల్లిన్స్కు కాళ్లలో వణుకు మొదలైంది. వెతికితే నేలపై వంగిపోయిన ఉంగరం కని పిం చింది. కానీ, దానికున్న విలువైన వజ్రం మాయం. గది అంతా వెతికింది. ఫలి తం లేదు. అక్కడున్న శునకాన్ని చూసి.. అదే మింగి ఉంటుందనే భావిం చిం ది. ఇక అప్పటి నుంచీ శునకం ఎప్పుడు విసర్జనకు వెళ్లినా పరీక్షిస్తూ కూర్చుం ది. రెండ్రోజుల తర్వాత వజ్రం శునకం మలవిసర్జన ద్వారా బయటకొచ్చింది.