వేలిముద్రలతో ఆడో.. మగో చెప్పేస్తారు! | by finding finger prints, men or women they can find | Sakshi
Sakshi News home page

వేలిముద్రలతో ఆడో.. మగో చెప్పేస్తారు!

Published Mon, Mar 31 2014 3:58 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

వేలిముద్రలతో ఆడో.. మగో చెప్పేస్తారు! - Sakshi

వేలిముద్రలతో ఆడో.. మగో చెప్పేస్తారు!

 లండన్: వేలిముద్రలను విశ్లేషించి నేరస్తుల, వ్యక్తుల గుర్తింపును ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించడం మనకు తెలిసిందే. అయితే వేలిముద్రలను పరిశీలించి అవి స్త్రీలవో, పురుషులవో కూడా చెప్పేయొచ్చంటున్నారు బ్రిటన్‌లోని షఫీల్డ్ హాలమ్ వర్సిటీ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో నేరస్తులు, వ్యక్తుల బండారాన్ని అనేక రకాలుగా బయటపెట్టే ఈ వినూత్న వేలిముద్రల పద్ధతిని ఇప్పుడు వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు ప్రయోగపూర్వకంగా పరీక్షిస్తున్నారు.
 
  వేలిముద్రలతోపాటు వాటిపై ఉండిపోయే చెమట, ఇతర రసాయనాల అణువులు, హెయిర్ స్టైలింగ్ కోసం వాడే జెల్, కండోమ్ లూబ్రికెంట్స్ వంటివాటిని బట్టి ఆ వేలిముద్రలు ఆడవారివో, మగవారివో 85 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. నేరానికి పాల్పడేముందు ఆ వ్యక్తులు కాఫీ తాగారా? డ్రగ్స్ తీసుకున్నారా? అన్న విషయాలనూ వారి వేలిముద్రల ఆధారంగా నిర్ధారించవచ్చని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement