ఈ ముత్యమెంతో ముద్దు..
ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ముత్యం. ఇది కృత్రిమమైనది కాదు.. సహజసిద్ధమైనది. 33.15 క్యారెట్ల ఈ ముత్యం వ్యాసం 0.7 అంగుళాలు. మొన్నమొన్నటివరకూ ఇదో అరుదైన ముత్యమని దీన్ని ధరించినవారికి కూడా తెలియదు.
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు చెందిన ముత్యపు చెవి రింగులను అమ్మడానికి నిపుణుల వద్దకు తెచ్చినప్పుడు.. అందులో ఒకదానికి ఉన్న ముత్యాన్ని చూసిన నిపుణులు అనుమానంతో దాన్ని పరీక్షల నిమిత్తం తొలుత లండన్ తర్వాత స్విట్జర్లాండ్ పంపించారు. దాన్ని ఎక్స్‌రే తీసిన నిపుణులు చివరికది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సహజ ముత్యమని తేల్చారు. దీన్ని మే 1వ తేదీన బ్రిటన్‌కు చెందిన వూలీ అండ్ వాలిస్ సంస్థ వేలం వేయనుంది. కనీసం రూ.2.5 కోట్లు పలుకుతుందని అంచనా.