
ప్రపంచవ్యాప్తంగా డైమండ్స్ అమ్మకాల్లో భారత్ వాటా 7 శాతానికి చేరింది. ఇక్కడ అపార వ్యాపార అవకాశాలున్నాయని డైమండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డీపీఏ) పేర్కొంది. వజ్రాల అమ్మకాలను పెంచేందుకు జెమ్ జువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌తో కలిసి పనిచేయనున్నట్టు అసోసియేషన్ ఇండియా ఎండీ రిచా సింగ్ తెలిపారు. అల్రోసా, డీ బీర్స్, డోమినియన్ డైమండ్, జెమ్ డైమండ్స్, లుకారా డైమండ్, పెట్రా డైమండ్స్, రియో టింటో వంటివి డీపీఏలో సభ్య కంపెనీలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment