
అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో ఎవరిని వరిస్తుందో చెప్పులేము. దశ తిరిగితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు.. అలాగే బిక్షగాడు కూడా అయ్యే అవకాశమూ లేకపోలేదు. తాజాగా ఓ రైతు ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు ఆరుగురు స్నేహితులతో కలిసి కొంత కాలం క్రితం.. లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. అనంతరం, వజ్రాల వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. వజ్రాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో ముందుకుసాగాడు.
ఈ క్రమంలో గురువారం వారికి గనిలో విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. ఎంతో ఆనందపడిన రాజేంద్ర గుప్త దాన్ని వెంటనే వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు. వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో, వారి ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. ఇలా రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
Madhya Pradesh News: पन्ना में एक साथ चार लोगों को अलग-अलग खदानों में मिले बेशकीमती हीरे#siamond #mpnews #pannanewshttps://t.co/2QnRAKyMeZ pic.twitter.com/HuPYudd62j
— NaiDunia (@Nai_Dunia) September 22, 2022
Comments
Please login to add a commentAdd a comment