బీజేపీ మహిళా నేతలు అందరూ చూస్తుండగానే స్టేజీపై ఒకరొనొకరు చేయిచేసుకున్నారు. స్టేజ్‌పై కూర్చునే సీట్ల వ్యవహారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీకామెంట్స్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని తలైయా ఫీల్డ్ గ్రౌండ్‌లో జరిగిన 25వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం కోసం బీజేపీ నేతలు వచ్చారు. ఈ సందర్బంగా నేతలంతా స్టేజ్‌పై కూర్చున్నారు. అనంతరం.. బీజేపీ మహిళా నేతలు చంద్రప్రభ తివారీ, నీలం చౌబే మధ్య సీట్ల విషయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వీరి మధ్య ఉన్న విభేదాలు అందరి ముందే బహిర్గతమయ్యాయి.
చంద్రప్రభ తివారీ వేదికపై సీటు కోసం వెతుకుతున్నప్పుడు నీలం చౌబే ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టింది. అనంతరం, వీరిద్దూ మాటల వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత ఒకరినొకరు సభావేదికపైనే తోసుకున్నారు. ఇంతలో అక్కడున్న మిగతా నేతలు కల్పించుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో వేదికపై రాష్ట్ర మంత్రులు కమల్ పటేల్, బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఎమ్మెల్యే సంజయ్ పాఠక్, ఇతర నేతలు కూడా ఉన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment