womens fight
-
ఫ్రీ బస్సులో సీట్ల కోసం పెద్ద లొల్లి
-
ఇదేం ఫైటింగ్.. డ్రెస్‌లు పట్టుకుని చిత్తకొట్టుకున్నారు.. మధ్యలో వెళ్లిన..
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల కారణంగా ఆవేశానికిలోనై ఎదుటి వారితో తీవ్ర వాగ్వాదానికి దిగుతాం. ఆ గొడవ కాస్తా పెద్దది అయితే ఫైటింగ్ కూడా జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది. చిన్న విషయానికే ఇద్దరు యువతులు రోడ్డుమీద హంగామా చేశారు. అందరూ చూస్తున్నారనే విషయం మరిచిపోయి ఫైటింగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇద్దరు యువతులు నడిరోడ్డుపై తన్నుకున్నారు. అయితే, ఒకరి వాహనాన్ని మరొకరు ఓవర్ టేక్ విషయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం.. రోడ్డుమీదనే వాళ్లు కొట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారి వీడదీసే ప్రయత్నం చేసిన మరో యువకుడిపై ఓ యువతి దాడికి ప్రయత్నించింది. నీకెందుకు అన్న విధంగా అతడికి కూడా కొట్టే ప్రయత్నం చేసింది. ఇక, ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరీని విడిపించారు. అనంతరం, అక్కడున్న వారిని చెదరగొట్టారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. રાજકોટના યાગ્નિક રોડ પર બે યુવતીઓ વચ્ચે થઇ છુટ્ટાહાથના મારામારી; વીડિયો થયો વાયરલ #Rajkot #Gujarat #Viral #ViralVideo pic.twitter.com/QcVzmXHAmR — Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023 ఇది కూడా చదవండి: వరద బీభత్సం.. ప్రాణాల కోసం పోరాటం.. -
వైరల్ వీడియో: బీజేపీ మహిళా నేతల మధ్య కోల్డ్‌వార్
-
బీజేపీ మహిళా నేతల మధ్య కోల్డ్‌వార్.. వేదికపైనే డిష్యుం డిష్యుం..
బీజేపీ మహిళా నేతలు అందరూ చూస్తుండగానే స్టేజీపై ఒకరొనొకరు చేయిచేసుకున్నారు. స్టేజ్‌పై కూర్చునే సీట్ల వ్యవహారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీకామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని తలైయా ఫీల్డ్ గ్రౌండ్లో జరిగిన 25వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం కోసం బీజేపీ నేతలు వచ్చారు. ఈ సందర్బంగా నేతలంతా స్టేజ్‌పై కూర్చున్నారు. అనంతరం.. బీజేపీ మహిళా నేతలు చంద్రప్రభ తివారీ, నీలం చౌబే మధ్య సీట్ల విషయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వీరి మధ్య ఉన్న విభేదాలు అందరి ముందే బహిర్గతమయ్యాయి. చంద్రప్రభ తివారీ వేదికపై సీటు కోసం వెతుకుతున్నప్పుడు నీలం చౌబే ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టింది. అనంతరం, వీరిద్దూ మాటల వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత ఒకరినొకరు సభావేదికపైనే తోసుకున్నారు. ఇంతలో అక్కడున్న మిగతా నేతలు కల్పించుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో వేదికపై రాష్ట్ర మంత్రులు కమల్ పటేల్, బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఎమ్మెల్యే సంజయ్ పాఠక్, ఇతర నేతలు కూడా ఉన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సెమీస్‌కు చేరువయ్యేందుకు...
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ముందుకెళ్లేందుకు మంచి అవకాశాలున్నాయి. వీటిని మెరుగుపర్చుకోవాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు... బంగ్లాదేశ్‌పై తప్పకుండా గెలవాలి. గత మ్యాచ్‌లో ఓపెనర్లు, బౌలర్ల వైఫల్యంతో భారత్‌కు పటిష్టమైన ఆస్ట్రేలియాతో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ సీనియర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడం జట్టుకు శుభ పరిణామం. కీలక తరుణంలో వీళ్లంతా ఫామ్‌లో ఉంటే ఒక్క సమష్టి ప్రదర్శన ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మలు కూడా రాణిస్తే ప్రత్యర్థిపై భారీ స్కోరు సాధ్యమవుతుంది. దీంతో పాటు బౌలర్లు కూడా బాధ్యత తీసుకుంటే జట్టు విజయానికి బాట పడుతుంది. ‘సెమీస్’ చేజారకుండా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో... మిథాలీ సేన వరుసగా ఓడిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇంగ్లండ్‌తో బ్యాటర్ల వైఫల్యం, ఆస్ట్రేలియాతో పసలేని బౌలింగ్ జట్టు ఫలితాలను మార్చేసింది. ఇప్పుడు ఈ లోపాలపై దృష్టిపెట్టిన టీమ్ మేనేజ్మెంట్... జట్టుపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేసే పనిలో పడింది. వెటరన్ సీమర్ జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇరకాటంలో పడేస్తే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా మన బ్యాటర్స్ పరుగులు సాధిస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించొచ్చు. మరో వైపు బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క పాకిస్తాన్‌పై మాత్రమే గెలిచి మూడు పరాజయాలతో రేసుకు దాదాపు దూరమైంది. ఆ గెలిచిన మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో బంగ్లా అత్యధిక స్కోరు 175. ఇలాంటి ప్రత్యర్థితో భారత్‌కు గెలుపు ఏమంత కష్టం కాదు. తర్వాత ఈ నెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ సేన పొరపాటున ఓడినా కూడా మూడు విజయాలతో సెమీస్ రేసులో ఉంటుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ అనూహ్యంగా పాక్ చేతిలో ఓడిపోవడం భారత్ కలిసొచ్చింది. మూడు విజయాలతో రేసులో ఉన్న విండీస్ రన్‌రేట్ దారుణంగా ఉంది. మంచి రన్‌రేట్ ఉన్న భారత్... బంగ్లాపై గెలిస్తే మరింత మెరుగవుతుంది. దీంతో రన్‌రేట్‌తో ముందంజ వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
చీర చింపిందని ఆత్మహత్య!
సాక్షి, చెన్నై: ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ జరిగింది.. ఇందులో ఓ మహిళ చీర చిరిగింది.. అది అవమానంగా భావించింది బాధితురాలు, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన చెన్నైలో ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చెన్నై పుదువణ్ణారపేట ఎమ్పీడీ ప్రాంతానికి చెందిన లోకేశ్వరన్ భార్య దివ్య (39) తమకు రేషన్ కార్డు ఇప్పించమని పక్కింటి నాగమ్మాల్‌కు రూ.6 వేలు ఇచ్చింది. అయితే ఎన్ని రోజులు గడిచినా కార్డు ఇప్పించలేదు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వమని దివ్య కోరడంతో నాగమ్మాల్ రూ.3 వేలు ఇచ్చింది. మిగతా రూ.3 వేలు ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చింది. దీనిపై ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య చీరను నాగమ్మాల్ చింపివేసినట్లు తెలుస్తోంది. ఇది అవమానంగా భావించిన దివ్య ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతిచెందింది. కొత్త వణ్ణారపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యంపై...పడతుల పోరాటం ... పోలీసుల వ్యాపారం
మహిళలపైకి మందుబాబులను ఉసిగొల్పిన వ్యాపారులు రక్షక భటులు రక్షణ వదిలి మందుబాబులకు మద్యం అందజేత ప్రత్యక్షంగా మద్యం వ్యాపారులకు సహకారం మరీ ఇంత బరితెగింపా అని మండిపాడు పరిసర ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు రావడంతో తోకముడిచిన వైనం మహిళల ఆగ్రహంతో ఎట్టకేలకు మద్యం దుకాణాలు మూత కడియం : మండల కేంద్రమైన కడియంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు మంగళవారం సాయంత్రం పోరాటానికి దిగారు. మంగళవారం మద్యం దుకాణాల వద్దకు పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమ్మకాలను అడ్డుకున్నారు. మూకుమ్మడిగా రావడంతో ఓ షాపు మూసివేయగా మరో షాపులో మాత్రం అమ్మకాలు యథావిధిగా కొనసాగించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆ షాపు గేట్లు మూసివేశారు. దీంతో దుకాణంలోని సిబ్బంది మద్యం బాబులను మహిళలపైకి ఉసిగొల్పారు. రాయడానికి వీలులేని భాషలో ఉద్యమకారులను తిడుతూ ‘ వచ్చినవారిని అవతలికి తన్నేస్తే ఒకొక్కరికి క్వార్టర్ బాటిల్‌ను ఫ్రీగా ఇస్తానంటూ’ మందుబాబులకు షాపు యజమాని ఆఫర్ ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడున్న మందుబాబులు మహిళలపైకి రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలిసి కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం. సురేష్ అక్కడికి చేరుకుని మహిళలతో ఓ వైపు చర్చిస్తూనే మూసివేసిన షాపు గేట్లు తెరిచి అమ్మకాలకు అవకాశం ఇవ్వడంతో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమపై దాడికి ఉసిగొల్పిన వారితో చేతులు కలిపి మోసం చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. షాపును తక్షణం ఇక్కడి నుంచి తొలగించే వరకూ ఊరుకునేది లేదని ఆందోళన చేపట్టారు. ఈ లోపు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున మహిళలు, యువకులు అక్కడికి చేరుకున్నారు. మహిళలను దుర్భాషలాడిన వ్యక్తిని తక్షణం ఇక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని మహిళలకు మద్దతుగా నిలిచారు. షాపు యజమాని అక్కడకు చేరుకుని అమ్మకాలు నిలిపివేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.