పెళ్లి కళవచ్చేసింది | diamond stands forever | Sakshi
Sakshi News home page

పెళ్లి కళవచ్చేసింది

Published Wed, Oct 8 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

పెళ్లి కళవచ్చేసింది

పెళ్లి కళవచ్చేసింది

వజ్రం కలకాలం నిలిచే ఉంటుంది. అనుభూతి కూడా అంతే. వజ్ర సహిత అనుభూతి అయితే... ఇక మరచిపోవడం మన తరమా... సోమాజిగూడ కీర్తిలాల్స్ షోరూమ్‌లో యంగ్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘డైమండ్ ఫ్యాక్ట్స్’ ఆద్యంతం విజ్ఞాన వినోదాల మేలు కలయికగా మారింది. ముంబై ఫ్యాషన్ డిజైనర్ కృష్ణామెహతా దుస్తులు... వజ్రాల ధగధగల్లో మోడల్స్ మెరిసిపోతూ ఆహూతులకు ఓ విభిన్న సాయంత్రాన్ని అందించారు. షో స్టాపర్‌గా తళుక్కుమన్న నటి సోనియా కాసేపు తన మనసు విప్పి ఉల్లాసంగా ముచ్చటించింది.
 
 
‘అచ్చమైన హైదరాబాదీ బ్రైడల్‌లా మెరిసిపోతున్నా. బాగున్నా కదూ. పెళ్లి పీటలు ఎక్కకుండానే పెళ్లి కళ వచ్చేసింది. ఐయామ్ సో లక్కీ’ అంటూ మురిసిపోయింది సోనియా. తొలిసారి షో స్టాపర్‌గా మెరిసిన ఈ చిన్నది... తనకు ఇప్పటిదాకా హెవీ జ్యువెలరీ అంటే అంత నచ్చేది కాదని, కానీ టాప్ టు బాటమ్ ఆభరణాలతో అలంకరించుకుంటే వచ్చే లుక్ ఎంత బ్రైట్‌గా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని, తనను తాను చూసుకొని మురిసిపోయింది. ‘ఇలా అలంకరించుకోవాలని అమ్మాయిలు ఎందుకు అంతగా తపిస్తారో నాకు అర్థమైంది. నావంటి మీదున్న ఆభరణాల కంటే నేనే వాల్యుబుల్’ అంటూ చమత్కరించిన సోనియా.. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది. తెలుగు, హిందీ సినిమాలకు చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement