డిజైర్... ఫ్యాషన్ డిజైనర్
చింతల్ ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో మొన్నే ఇంటర్ (ఎంపీసీ) సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశా. మూడేళ్ల కిందట సొంతూరు రాజమండ్రి నుంచి సిటీకి మకాం మార్చాం. నాన్న సత్యనారాయణ బిజినెస్‌మ్యాన్. అమ్మ రత్నకుమారి గృహిణి. ఈ మహానగరానికి వచ్చాక నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది నా డ్రీమ్. ఎనిమిది మాసాల కిందటి మాట... ‘దెయ్యం ఉందా’ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఎందుకు ట్రై చేయకూడదనిపించింది. ఆడిషన్స్‌కు వెళితే హీరోయిన్‌గా సెలెక్ట్ అయిపోయా. ఆ తరువాత వరుసగా ఆఫర్లు. ‘విలేజ్ లవ్, ఆవాసం, ఫ్లాప్, వీడు క్లాసు... వాడు మాసు, మైలు రాయి’ చిత్రాల్లో చేశాను. వర్ధమాన నటుడు మోహన్‌తో ‘ఒక్కడితో’లో నటించా. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో నాటి సూపర్ హీరో సుమన్, కామెడీ నటుడు ధన్‌రాజ్‌లతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. నటిగా రాణిస్తూనే, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకొనేందుకు కృషి చేస్తున్నా. నేను డిజైన్ చేసిన శారీస్‌నే ధరించి సినిమాల్లో నటించాలన్నది నా కోరిక.
ఆ గాజులు స్పెషల్...
సిటీకి వచ్చిన కొత్తల్లో ఎక్కువ విజిట్ చేసింది పాతబస్తీనే. చార్మినార్ చూసేందుకు వెళ్లినప్పుడల్లా అక్కడ గాజులు కొనేస్తుంటా. అవి ధరిస్తే తెలుగింటి అమ్మాయికి వచ్చే గ్లామరే వేరు! చుడీదార్ అండ్ శారీస్ నాకిష్టమైన డ్రెస్‌లు. ఇంకా గోల్కొండ, ఫలక్‌నుమా ప్యాలెస్‌లూ ఓ రౌండ్ వేశా. ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా చక్కర్లు కొట్టడమంటే మహా సరదా. సమయం దొరికితే కూకట్‌పల్లి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ లాగిస్తుంటా. వారానికి రెండు సార్లయినా తినాల్సిందే. అవసరముంటే సాయం చేయడం, అభాగ్యులకు చేయూతనివ్వడం, పలుకరిస్తే ఆత్మీకత కురిపించడం... హైదరాబాదీల్లో స్పెషాలిటీలివి. అందుకే ఈ నగరమన్నా, మనుషులన్నా ఎంతో ప్రేమ నాకు.
చిత్రమయి
చిత్ర కళాకారుడు యోగేశ్ బామిని వేసిన చిత్రాలు సందర్శకుల మదికి హత్తుకుంటున్నాయి. మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలోని ప్రతి వర్ణం అద్భుతమైన చిత్రంగా రూపుదిద్దుకుంది. ఇందులోని ప్రతి పెయింటింగ్... దేనికదే ప్రత్యేకం. కళాకారుడు మనసు పెట్టి గీసిన ఈ చిత్రాలను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ తిలకించారు. యోగేశ్‌ను అభినందించారు. ఆదివారం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
మాదాపూర్