భారతీయ సంప్రదాయాన్ని కొలిచినట్టు చూపగలిగేది చీరకట్టే. చీరల తర్వాత ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. శారీలకు దీటుగా నిలిచిన ఘనత పంజాబీ డ్రెస్‌లకు దక్కుతుంది. మోడర్న్ లుక్‌లో కనిపించినా.. ట్రెడిషనల్ ఇంపాక్ట్‌నూ క్యారీ చేస్తూ.. టీనేజీ యువతుల నుంచి.. నడివయసు నారీమణుల వరకూ అందరికీ నేస్తంగా మారాయివి. ఒంటికి నిండుగా హత్తుకునే ఈ డ్రెస్‌లో కంఫర్టబుల్ అదనంగా ఉండటంతో.. ఏ తరం వారైనా పంజాబీ డ్రెస్‌లను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందుకే చుడీదార ్లకు ఎప్పటికప్పుడు మోడర్న్ టచ్ ఇచ్చి.. వెస్ట్రన్ లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. లేటెస్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన జాకెట్ మోడల్ ప్లేటెడ్ చుడీ, జంప్ సూట్ స్టైల్ ట్యూనిక్‌లు యువతుల మనసును దోచుకుంటున్నాయి.
కుచ్చుల మ్యాజిక్..
ఫ్యాషన్ మార్కెట్‌లో లేటెస్ట్ అప్‌డేట్ జాకెట్ మోడల్ ప్లేటెడ్ చుడీ. కుచ్చులతో వస్తున్న ఈ డ్రెస్ ఈ తరం అమ్మాయిలకు బాగా నప్పుతుంది. స్లీవ్‌లెస్ లాంగ్ టాప్ విత్ మల్లీ ప్లేట్స్ (కుచ్చులు)తో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. లెఫ్ట్‌సైడ్ షార్ట్ లెన్త్‌లో ఉండే ఈ కుచ్చులు.. రైట్‌సైడ్‌కు వచ్చే సరికి ఫ్లోర్‌లెన్త్‌గా మారుతాయి. మ్యాచింగ్ ప్యాంట్, చుడీకి పైన కాంట్రాస్ట్ కలర్స్‌తో అందమైన లాంగ్ జాకెట్ మోడల్ వస్తుంది. మెగా స్లీవ్స్‌తో ఉండే ఈ లాంగ్ జాకెట్ డ్రెస్‌కే డిఫరెంట్ లుక్ తెస్తుంది. కాలేజ్ ఈవెంట్లకు, పార్టీలకు ఈ డ్రెస్ కరెక్ట్‌గా సరిపోతుందని చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.
జంప్ టు రిచ్‌లుక్..
డిజైనింగ్ కాస్ట్యూమ్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫ్యాషన్ వరల్డ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి జంప్‌సూట్ ట్యూనిక్ చుడీలు. ఫుల్ హ్యాండ్స్‌తో హైనెక్ ప్యాటర్న్ కలిగి ఉన్న ఈ డ్రెస్‌లు పార్టీవేర్‌గా మంచి మార్కులు కొట్టేశాయి. తేలికపాటి లేసర్, 60 గ్రామ్స్ ఫ్యాబ్రిక్స్‌తో ఫ్లోర్‌లెన్త్ టాప్.. ఫ్రంట్ అండ్ బ్యాక్ సెంటర్ స్లిట్స్‌తో స్పెషల్ లుక్‌లో కనిపిస్తాయి. కింది వైపు యాంటిక్, గోల్డ్ కలర్‌లలో ఫ్లవర్ ఎంబ్రయిడరీ డిజైన్‌తో రిచ్ లుక్‌ను కట్టబెడుతుంది. వీటికి బాటమ్‌గా ఏదైనా స్పన్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. హైనెక్ ఉండే ఈ ప్యాటర్న్ వేర్ మీద చున్నీలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సింప్లిసిటీ కోరుకునే వాళ్లకు ఈ డ్రెస్ పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. మెడలో
చైన్లు గట్రా వేసుకోవాల్సి పని కూడా ఉండదు. చెవులకు మాత్రం కాస్త పెద్ద సైజు హ్యాంగింగ్స్ ధరిస్తే సరి. పార్టీలో అందరి లుక్కూ మీ మీదే.
నయాదారుల్లో.. చుడీదార్లు
Published Tue, Feb 3 2015 12:06 AM | Last Updated on Mon, Oct 1 2018 1:12 PM
Advertisement
Advertisement