అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్‌గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది.
ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్‌ప్లేట్‌కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్‌తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్‌తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్‌ప్లేట్‌ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది.
దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్‌కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment