White gold
-
బాబోయ్ ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్‌గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్‌తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్‌తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్‌కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
‘సూరజ్’ సాగు సూపర్!
కరువుకు కేరాఫ్‌గా మారిన మెట్ట/చల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువులను ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో, తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్ రకం నాన్ బీటీ – దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. నిత్యం కరువుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంత చల్కా/మెట్ట భూముల రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.) మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం రైతులు మూడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్ అనే సూటిరకం నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కో ఆపరేటివ్, ఏనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో.. మాణిక్యపురం, ఎనబావి, కళ్లెం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. లింగాల ఘనపురం మండలం సిరిపురానికి చెందిన రైతు కుబర్ల గిరిబాబు డిగ్రీ వరకు చదువుకొని, పది ఎకరాల భూమిలో కొంతకాలం బీటీ పత్తి సాగు చేశారు. బీటీ పత్తి విత్తనాల వల్లనే బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తున్నాయనే భావనతో గిరిబాబు సి.ఎస్.ఎ. తోడ్పాటుతో పదేళ్ల క్రితం నుంచే సేంద్రియ సాగు చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తితోపాటు వరి, కంది పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నారన్నారు. సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవన్నారు. తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని, తమ పంటకు మార్కెట్లో గిరాకీ ఉందని గిరిబాబు(99126 88157) అన్నారు. సేంద్రియ సాగుతో లాభాలు ఇవీ... ► ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల అవసరం లేదు. ► సూరజ్ వంటి నాన్ బీటీ, దేశీ పత్తి విత్తనాల వల్ల భూసారం దెబ్బతినదు. ► ఈ పత్తి నుంచి విత్తనాలు తీసి, మళ్లీ వాడుకోవచ్చు. ప్రతి ఏటా కంపెనీల నుంచి విత్తనాలు కొనక్కర్లేదు. ► చెరువు మట్టి, జీవామృతం, వర్మీ కంపోస్టు, పశువుల పేడ ద్వారా భూమిని సారవంతం చేస్తారు. ► వేపద్రావణం, వావిలాకు కషాయం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేస్తారు. నాన్ బీటీ పత్తి విత్తనాలతో రైతులకు మేలు.. ► బీటీ పత్తి విత్తనాల మాదిరిగా దేశీ పత్తి రకాల సాగులో రసాయనాల అవసరం ఉండదు. ► వర్షధారంగా ఎకరానికి 4–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ► పత్తిని అమ్ముకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు. దేశీ పత్తితో వస్త్రాలు నేసే సంస్థలే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి∙ ► ఎలాంటి కమీషన్లు ఉండవు. ► ప్రస్తుతం సీసీఐ క్వింటా పత్తికి రూ.4,000 చెల్లిస్తుంటే.. నాన్‌బీటీ పత్తికి రూ. 5,100 ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రోత్సహించాలి! దేశీ పత్తి రకం సూరజ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నేలల్లో సాగుకు అనుకూలమైనది. ఈ సంవత్సరం సహజాహారం ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో కొందరు రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయించాం. చేనేత సంస్థలు మల్కా, అభిహార రైతుల నుంచి సూరజ్ దేశీ పత్తి(28–32 ఎం.ఎం. పింజ)ను అధిక ధరకు కొనుగోలు చేశాయి. సూరజ్ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 150 క్వింటాళ్ల వరకు సూరజ్ విత్తనాలు ఉన్నాయి. ఆసక్తిగల రైతులు సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ(85007 83300)ని గానీ, కిసాన్ కాల్ సెంటర్ (85009 83300)ను గానీ సంప్రదించవచ్చు. – డా. జీవీ రామాంజనేయులు, డైరెక్టర్ జనరల్, సుస్థిర వ్యవసాయ కేంద్రం ramoo@csa-india.org చేతి కష్టమే పెట్టుబడి! రెండు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నా. మూడు సంవత్సరాల నుంచి ఇదే సాగు. వర్షం పడితేనే నీళ్లు. బోరు, బావి లేవు. డిసెంబర్ నాటికే పంట పూర్తిగా అయిపోతుంది. డిసెంబర్లో వర్షం పడితే మరో రెండు నెలలు పంట వస్తుంది. చేతుల కష్టమే పెట్టుబడి. ఇప్పటికైతే నష్టపోలేదు. డబ్బుల దగ్గర , ధర విషయంలో ఎలాంటి కిరికిరి లేదు. – మూటకోరు యాదగిరి (70324 64439), సేంద్రియ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా మందులు కొనడం మానేశా! నాకు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. మూడేళ్ల నుంచి నాన్‌బీటీ పత్తిని వేస్తున్నా. విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, కషాయాలు అన్నీ నావే. ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తిని అమ్మితే మాత్రం రూ. 20 వేల వరకు వస్తున్నాయి. పురుగుల మందులు కొనడం పూర్తిగా మానేశాం. రవాణా ఖర్చులు, కటింగ్‌లు, కమీషన్లు లేవు. శరీరంపై ప్రభావం చూపే మందుల వాడకం లేదు. నీటి సౌలతి ఉంటే ఎక్కువ దిగుబడి వచ్చేది. నాన్బీటీతో లాభాలే తప్ప నష్టాలు లేవు. – చెన్నూరి ఉప్పలయ్య (95025 06186), సేంద్రియ నాన్‌బీటీ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ జిల్లా ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
గడప దాటని తెల్ల బంగారం
ధరపై ఆశతో ఇళ్లలోనే పత్తిని దాచుకుంటున్న రైతన్నలు ► ఈసారి మొత్తంగా 50 లక్షల బేళ్ల పత్తి వస్తుందని అంచనా ►ఇప్పటిదాకా మార్కెట్‌కు వచ్చింది 16 లక్షల బేళ్లే.. ►గణనీయంగా పడిపోయిన అమ్మకాలు ►అంతర్జాతీయంగా డిమాండ్ మరింత పెరుగుతుందంటున్న వ్యాపారులు ►క్వింటాల్ ధర రూ.7 వేల దాకా చేరుతుందని అంచనా గడ్డం రాజిరెడ్డి, సాక్షి, కరీంనగర్: చేను దాటిన తెల్లబంగారం గడప దాటడం లేదు. మున్ముందు మరింత ధర వస్తుందన్న ఆశతో రైతులంతా పత్తి పంటను ఇళ్లలోనే దాచుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే పత్తికి డిమాండ్ పెరుగుతోంది. మరో రెండు మాసాల్లో రూ.6 వేల నుంచి రూ.7 వేల దాకా చేరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గత ఖరీఫ్ సీజన్లో కోటి 28 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ)తోపాటు కాటన్ అడ్వయిజరీ బోర్డు (సీఏబీ) కమిటీ లెక్కలు వేసింది. మొత్తంగా 3.5 కోట్ల బేళ్ల పంట చేతికి వస్తుందని అంచనా. గడచిన అక్టోబర్‌లోనే పంట రైతుల చేతికి వచ్చింది. జనవరి 17 వరకు దేశవ్యాప్తంగా రైతులు 1.25 కోట్ల బేళ్ల పంటను విక్రయించినట్లు సీఏఐ, సీఏబీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఒక్క జనవరి నెలలోనే 2 లక్షల బేళ్ల పంట అమ్మకానికి వచ్చింది. కానీ ఈసారి 1.5 లక్షల బేళ్ల పంటను మాత్రమే రైతులు మార్కెట్‌కు తెచ్చారు. అంటే గతేడాదితో పోలిస్తే సుమారు 50 వేల బేళ్ల వరకు పత్తి అమ్మకాలు తగ్గాయి. ఈ లెక్కన రైతులు చేతికి వచ్చిన పంటను ఇళ్లలోనే నిల్వలు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో తగ్గిన సాగు తెలంగాణలో గతేడాది 16 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. 60 లక్షల బేళ్ల అమ్మకాలు జరిగాయి. అయితే భవిష్యత్తులో ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉన్నందున ఈసారి పత్తి సాగు తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తూ పత్తి సాగును తగ్గించారు. గతేడాది 16 లక్షల హెక్టార్లలో సాగుకాగా.. ఈసారి 12.50 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఏకంగా 3.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు తగ్గిపోయింది. మొత్తంగా 50 లక్షల బేళ్ల పంట చేతికొస్తుందని లెక్కలు వేశారు. ఇప్పటివర కు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల బేళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. మిగతా పంటంతా రైతులు ఇళ్లలోనే దాచుకున్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల బేళ్ల అమ్మకాలు జరగ్గా.. ఈసారి అది 18 లక్షలకు పరిమితం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. రూ. 43 వేలకు క్యాండి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఒక క్యాండి (గింజలు తీసిన 3.56 క్వింటాళ్ల పత్తి) ధర ప్రస్తుతం రూ.43 వేలు ఉంది. మున్ముందు ఇది రూ.50 వేల వరకు చేరుతుందని లెక్కలు వేస్తున్నారు. గింజల ధరలు సైతం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.2,500 వరకు పలుకుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది కూడా రూ.2,600–రూ.3 వేల దాకా పలికే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో ఈ నెల చివరి వరకు క్వింటాల్ పత్తి రూ.6 వేల నుంచి రూ.7 వేల దాకా పలికే అవకాశం ఉన్నట్లు కాటన్ వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాల్ పత్తికి రూ.5,500 నుంచి రూ.5,700 పలుకుతోంది. పత్తి ధర ఆశజనకంగానే ఉన్నా కందికి మాత్రం రేటు రాక రైతులు విలవిల్లాడుతున్నారు. ఖరీఫ్‌లో సోయా పంట కూడా రైతుకు కన్నీళ్లే మిగిల్చింది. ధరల కిక్కు వెనుక విదేశీ ఆర్డర్లు? ఈ ఏడాది పాక్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు మనదేశం 40 లక్షల బేళ్ల పత్తిని ఎగుమతి చేయనుంది. ఈ మేరకు ఆయా దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయి. అయితే ధర మరింత పెరగొచ్చని దేశీయ మార్కెట్లో ట్రేడర్లు, జిన్నర్లు పత్తి బేళ్లను నిల్వ పెట్టుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో బేళ్లకు ధర తక్కువ ఉంది. దీంతో మనదేశానికి చెందిన బడా స్పిన్నింగ్ వ్యాపారులు ఓవైపు అక్కడ్నుంచి దిగుమతులు చేసుకుంటుండగా మరోవైపు జిన్నర్లు, ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించే ఆలోచనతో బేళ్లను స్టాక్ పెడుతున్నారు. ఫలితంగా పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ధర కోసం దాసుకున్నా.. నా పేరు సాంబయ్య. మాది మోత్కులగూడెం. నాకు ఎకరం భూమి ఉంది. పత్తి సాగు చేశా. మొదట్లో చేతికొచ్చిన పత్తిని అమ్మితే క్వింటాకు రూ.4,800 ధర పెట్టిండ్లు. 3 కింటాళ్లు అమ్ముకున్న. ఆ తర్వాత ధర లేదని మిగితా పత్తిని అమ్ముకోలే. ఇంట్లోనే దాసిన. ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోంది. ఏడు వేలు అయితదని అంటుండ్లు. అప్పటిదాక పత్తిని అమ్మద్దని నిర్ణయించుకున్న. నేనే కాదు మా తమ్ముళ్లు, బంధువులు కూడా పంటను ఇంట్లోనే దాసుకున్నం. – పొనగంటి సాంబయ్య, రైతు, మోత్కులగూడెం, జమ్మికుంట పలు రాష్ట్రాల్లో పత్తి అమ్మకాలు ఇలా.. రాష్ట్రం అమ్మకం(లక్షల బేళ్లలో..) పంజాబ్ 6.84 హరియాణా 9.58 రాజస్తాన్ 9.98 గుజరాత్ 27.21 మహారాష్ట్ర 30.7 మధ్యప్రదేశ్ 10.28 తెలంగాణ 16.06 ఆంధ్రప్రదేశ్ 7.34 కర్ణాటక 4.32 తమిళనాడు 69 వేల బేళ్లు ఒడిశా 86 వేల బేళ్లు మిగతా రాష్ట్రాల్లో 61 వేల బేళ్లు -
పెట్టుబడికి... ప్లాటినం రక్ష!
♦ ప్లాటినం ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్ ♦ ఉత్పత్తితో పోలిస్తే డిమాండ్ పెరుగుదలే అధికం పెట్టుబడి పెట్టాలంటే ఎంతసేపూ డిపాజిట్లు, షేర్లు, రియల్ ఎస్టేటూ, బంగారం, వెండి... ఇంతేనా!! ఇంకేమీ లేవా? లేకేం... బంగారంకన్నా ఖరీదైన తెల్ల బంగారం ప్లాటినం ఉంది. కాకపోతే దీని డిమాండ్ ఎక్కువగానే ఉన్నా సరఫరా మాత్రం తక్కువ.అందుకే ధర కూడా ఎక్కువ. సరఫరా అంతగా ఉండదు కాబట్టి దీన్నెవరూ పెద్దగా సూచించరు. కాకపోతే ఈ మధ్య ప్లాటినం ఆభరణాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మాత్రం స్వల్పకాలంలో లాభాలు ఆర్జించాలనుకునేవారికి ఇది బాగానే అక్కరకొస్తోంది. అందుకే ఈ వారం ప్లాటినం కబుర్లివి... ప్లాటినంతో ట్రేడింగ్ చేయొచ్చు... ప్లాటినం డిమాండ్ ఈ మధ్య బాగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లూ దృష్టి పెడుతున్నారు. అందుకే నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ 2012లో ఈ-ప్లాటినం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ప్రాధాన్యం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్ మార్కెట్లో కూడా ప్లాటినం ట్రేడింగ్‌ను ఆరంభించారు. ఇన్వెస్టర్లు ప్లాటినాన్ని యూనిట్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఈ-యూనిట్లను విక్రయించవచ్చు. కావాలనిపిస్తే ఎలక్ట్రానిక్ యూనిట్ల రూపంలో ఉంచేసుకోవచ్చు కూడా. లేదంటే భౌతికంగా డెలివరీ కూడా తీసుకోవచ్చు. ప్లాటినం భౌతిక డెలివరీ కేంద్రాలు ముంబై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లలో ఉన్నాయి. ఈ భౌతిక డెలివరీ విషయానికొస్తే ప్రస్తుతం ప్లాటినం నాణేలు, కడ్డీల రూపంలో లభ్యమవుతోంది. ఇవి జాతీయ బ్యాంకులతో పాటు అథరైజ్డ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ యూనిట్లలో ప్లాటినంను డెలివరీ చేస్తున్నారు. వీటి నాణ్యత 99.95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రాము ప్లాటినం ధర రూ.2,730కి కాస్త అటూ ఇటుగా ఉంది. దేశంలో భౌతికంగా ప్లాటినం కొనుగోలు చేయటమనేది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అంటే డెలివరీలు స్వల్పంగానే నమోదవుతున్నాయి. ప్లాటినాన్ని భౌతికంగా కొనుగోలు చేసేవారు కచ్చితంగా వెండర్స్ వద్ద అధికారిక సర్టిఫికెట్‌ను సరిచూసుకోవాలి. దీంతో ధర పెరుగుతుందంటున్న నిపుణులు ఈ-ట్రేడింగ్‌లోనూ నానాటికీ వృద్ధి డిమాండ్‌కు తగ్గట్టు లేని ఉత్పత్తి ప్లాటినం ధరలు మున్ముందు బాగా పెరిగే అవకాశం ఉందని మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, డెవలప్మెంట్ నివేదిక చెబుతోంది. ఎందుకంటే దేశంలో 2017 నాటికి ప్లాటినం డిమాండ్ 80 టన్నులకు పెరిగే అవకాశముంది. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితరాల వల్ల ఇక్కడ డిమాండ్ వేగంగా పెరుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. యువత, మగవారు ఎక్కువగా ప్లాటినం ఆభరణాల వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే ప్లాటినంను భావితరాల బంగారంగా చెబుతున్నారు. 35-40 ఏళ్ల వయసున్న మహిళలు ప్లాటినాన్ని ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వ సూచికగా గుర్తిస్తున్నారని ప్లాటినం గిల్డ్ ఇండియా చెబుతోంది. ఇది గతేడాది డిసెంబర్లో ఎవేరా బ్రాండ్‌తో ప్లాటినం వెడ్డింగ్ కలె క్షన్స్ను ప్రారంభించింది. ఇవి ప్లాటినం డిమాండ్‌ను అనూహ్యంగా పెంచాయి. డిమాండ్ ఇంతలా పెరుగుతున్నా ప్లాటినం ఉత్పత్తి మాత్రం అలా లేదు. 2013-14లో ప్లాటినం ఉత్పత్తి అంతర్జాతీయంగా 1.7 లక్షల కిలోలుగా ఉండగా... అది గతేడాది 1.5 ల క్షల కిలోలకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ప్లాటినంలో దక్షిణాఫ్రికా వాటా 75% వరకు ఉండగా తర్వాతి స్థానాల్లో రష్యా, జింబాబ్వే ఉన్నాయి. ప్లాటినం వినియోగంలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో జపాన్, యూరప్ ఉన్నాయి. డిమాండ్-సరఫరా మధ్య తేడా ఎక్కువగా ఉంది కనక ఇది ధర పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓ సంస్థ అంచనా ప్రకారం ప్లాటినం జ్యుయల్లరీ మార్కెట్ విలువ భారత్‌లో రూ.1,900 కోట్లుగా ఉంది. వార్షిక వృద్ధి 45%. ఇవీ... ప్లాటినం విశేషాలు ►చూడ్డానికి వెండిలా తెల్లగా ఉండే ప్లాటినాన్ని 1735లో గుర్తించారు. అరుదైన లోహం. దృఢమైనది. తీగలా సాగుతుంది కనక ఆభరణాల తయారీలో ఉత్తమమైంది. తుప్పు పట్టదు. దీని వల్ల ఎలాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రావు. ►ప్లాటినం వినియోగంలో అగ్రస్థానం ఆటోమొబైల్ది. నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను త గ్గించడానికి ఆటోమొబైల్ క్యాటలిటిక్ కన్వర్టర్స్లో ప్లాటినాన్ని ఎక్కువగా వాడతారు. ఆ తరవాత కెమికల్ రంగంలో ఆక్టేన్ పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి కోసం కూడా దీన్ని వాడతారు. ►ప్లాటినం జ్యుయలరీకి డిమాండ్ పెరుగుతోంది. గడచిన 30 ఏళ్లలో ఈ డిమాండ్ ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. ►ఎలక్ట్రానిక్స్- కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లకు ప్లాటినంతో పూత వేస్తారు. కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడంతో ఇక్కడ ప్లాటినం డిమాండ్ క్షీణించింది. 2000లో 3 లక్షల ఔన్స్‌గా ఉన్న డిమాండ్ 2014 నాటికి 2 లక్షల ఔన్స్‌కు తగ్గింది. ►ఇంకా ఆక్సిజన్ సెన్సర్లు, స్పార్క్ ప్లగ్‌లు, టర్బైన్ ఇంజన్స్, డెంటల్ అనువర్తనాలు, ఎలక్ట్రోడ్స్ తదితర వాటి తయారీలో ప్లాటినాన్ని వాడతారు. -
గులాబీ గోల్డ్
అలంకరణపరంగా కావొచ్చు.. ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కావొచ్చు బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. పసిడి అనగానే పచ్చని పసుపు వర్ణం కళ్లముందు కదలాడుతుంది. పత్తిని తెల్లబంగారం, బొగ్గును నల్లబంగారం అంటూ వ్యవహరిస్తున్నా..సిసలైన బంగారం విషయానికొస్తే పసుపు రంగేనని ఫిక్సయి ఉంటాం. శతాబ్దాలుగా ఈ ఎల్లో గోల్డ్‌కే డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. బంగారంలోనూ రకరకాల వర్ణాలు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుపు, ఊదా, గులాబీ తదితర రంగుల్లోనూ పుత్తడి లభిస్తోంది. వివిధ రకాల లోహాలను బంగారానికి జోడించడం ద్వారా ఈ రంగులు వస్తాయి. పసిడికి పల్లాడియం లేదా వెండిని కలపడం వల్ల వైట్ గోల్డ్ వస్తుంది. దీనికి రోడియం పూత పూయడం వల్ల మరింత మెరుపు వస్తుంది. అమెరికాలో వివాహాది శుభకార్యాల్లో వైట్గోల్డ్కి బాగానే డిమాండ్ ఉంటోంది. ఇక, పసిడిపై పూతగా వివిధ రకాల ఆక్సైడ్లు కలపడం ద్వారా గులాబీ, ఊదా, పర్పుల్ వంటి అసాధారణ రంగుల్లో బంగారం ఆభరణాలను తయారు చేస్తున్నారు. -
శునక ప్రేమ
కేన్స్ నదీ తీరాన ప్రతి ఏడాదీ మే నెలలో జరుగుతున్నట్లుగానే ఈ ఏడాది కూడా చలన చిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విదేశీ తారలు, మన దేశం నుంచి వెళ్లిన తారలతో ఈ వేదిక కళకళలాడుతోంది. ఇప్పటికే మల్లికా శెరావత్ ర్యాంప్ వాక్ చేసింది. ఇంకా ఇక్కణ్ణుంచి ఉదయ్‌చోప్రా, ఐశ్వర్యా రాయ్ తదితర తారలు అక్కడికెళ్లారు. కాగా, శనివారం ఈ సంబరాలు జరుగుతున్న సమయంలో అనుకోని విధంగా ఓ శునకం ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. ఠీవీగా కాసేపు కూర్చుని చిత్రోత్సవాలను తిలకించింది. ఎవరి ఆనందంలో వాళ్లు నిమగ్నమై, ఈ శునకాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వేడుకల్లో భాగంగా ‘వైట్ గోల్డ్’ అనే సినిమాకి సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది. దాంతో దర్శకుడు కొర్నల్ ముండ్రుక్జో, చిత్రకథానాయిక సోఫియా సోట్టా తదితర చిత్రబృందం ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకను ఆసక్తికరంగా తిలకిస్తున్న సమయంలో ఆ శునకం వీరి చెంతకు చేరింది. హఠాత్తుగా కొర్నల్ మీద ఎక్కడ లేని ప్రేమా కురిపించింది. కొర్నల్ కూడా ఈ శునక ప్రేమకు ముగ్ధులయ్యారని ఈ ఫొటో చెబుతోంది.