![CI And Tahsildar Enquiry on Farmer Sale Diamond in Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/23/diamond.jpg.webp?itok=CDFmcRAu)
గుత్తి రూరల్: బేతాపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం చిక్కిందన్న విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. ‘రైతుకి చిక్కిన రూ.కోటి వజ్రం’, ‘రూ.30 లక్షలకు విక్రయం’ అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ బ్రహ్మయ్య, సీఐ రాజశేఖర్‌రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. వజ్రం చిక్కిన రైతు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించారు. కొనుగోలు చేసిన వ్యాపారి, మధ్యవర్తులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. వజ్రం ఎప్పుడు, ఎక్క డ చిక్కింది.. ఎంతకి విక్రయించారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే వజ్రం చిక్కినట్లు రైతు కుటుంబీకులు ఒప్పుకోగా.. కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం తాను ఎలాంటి వజ్రమూ కొనుగోలు చేయ లేదని అధికారులతో చెప్పాడు.(వృద్ధుడిని బంధించి.. విలువైన వజ్రం అపహరణ )
Comments
Please login to add a commentAdd a comment