తమ్ముడికి ఆకాష్‌ అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్‌.. ఎన్ని కోట్లో తెలుసా? | Akash Ambani Gifts A Cartier Uncut Diamond Brooch To Anant Ambani | Sakshi
Sakshi News home page

Anant Ambani Engagement: తమ్ముడికి ఆకాష్‌ అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Published Fri, Feb 3 2023 8:33 PM | Last Updated on Fri, Feb 3 2023 8:54 PM

Akash Ambani Gifts A Cartier Uncut Diamond Brooch To Anant Ambani - Sakshi

అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. రాధిక మర్చంట్‌ మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇటీవలే అనంత్‌-రాధికల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ నివాసం అంటీలియాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

తాజాగా అనంత్‌ అంబానీకి చెందిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనంత్‌ ఎంగేజ్‌మెంట్‌ రోజున సోదరుడు ఆకాష్‌ అంబానీ అత్యంత ఖరీదైన ఓ వస్తువును తమ్ముడికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అంబానీ ఫ్యాన్‌ పేజ్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. అనంత్‌ తన సోదరుడు ఆకాష్‌ నుంచి కార్టియర్‌ నుంచి కస్టమైజ్‌ చేసిన పాంథర్‌ బ్రూచ్‌ను(విలువైన స్టోన్స్‌, డైమెండ్స్‌తో తయారు చేయబడి సూట్‌పై అలంకరించే పిన్‌) గిఫ్ట్‌గా పొందినట్లు సమాచారం.

చిరుతపులి ఆకారంలో ఉంటే ఈ బ్రూచ్‌ను 51 నీలమణి, 2 పచ్చలతో పొదిగిన 18 క్యారెట్ల తెల్ల బంగారంతో ప్రత్యేకంగా రూపొందించారట. అంతేగాక ఇందులో 604 అన్‌కట్‌ డైమండ్స్‌ను పొందిపరిచారు. అయితే తెల్లని చిరుతపులిలా కనిపించే బ్రూచ్‌ ధర అక్షరాల 162,000 డాలర్లు అట. అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.3 కోట్లు. అయితే దీని విలువ ఇంత కంటే ఎక్కువే ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.

కాగా అనంత్‌ పెళ్లాడబోయే యువతి ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈవో వీరేన్‌ మర్చంట్‌ కూతురు. వీరు గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం ఆమె ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాధిక క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. ఎనిమిదేళ్లుగా ఆమె భరత న్యాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ముఖేష్ అంబానీకి ముగ్గురు సంతానం కాగా.. ఆకాష్, ఇషా కవలలు, అనంత్ చిన్న కుమారుడు.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement