భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ గనిలో 50 లక్షల రూపాయల విలువైన 10.69 క్యారెట్ వజ్రం లభ్యమైంది. రాణీపూర్ ప్రాంతంలోని మైన్‌ను లీజ్‌కు తీసుకుని నడిపిస్తున్న ఆనందిలాల్ కుష్వాహ (35) ఈ డైమండ్‌ను గుర్తించారు. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని స్ధానిక డైమండ్ కార్యాలయంలో సమర్పించారని పన్నా డైమండ్ అధికారి ఆర్‌కే పాండే వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఇంతటి భారీ వజ్రం గుర్తించడం ఇదే తొలిసారని మైన్ నిర్వాహకుడు కుష్వాహ పేర్కొన్నారు.
ఈ వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన అనంతరం డిపాజిటర్‌కు అందచేస్తామని అధికారులు తెలిపారు. వజ్రం విలువను ఇంకా లెక్కకట్టనప్పటికీ దాని నాణ్యతను బట్టి 50 లక్షల రూపాయల వరకూ పలుకుతుందని స్ధానిక నిపుణులు తెలిపారు. కుష్వాహ ఇటీవల 70 సెంట్ డైమండ్‌ను కూడా ఈ కార్యాలయంలో డిపాజిట్ చేశారు. తాను, తన తల్లితండ్రులు గత ఆరు నెలల నుంచి గనుల్లో కష్టించి పనిచేస్తున్నామని, ఈ వజ్రం దొరకడం పట్ల ఆనందంగా ఉందని కుష్వాహ చెప్పుకొచ్చారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాల నిక్షేపాలకు పేరొందింది. చదవండి : మహిళా కూలీకి వజ్రం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment