
వాషింగ్టన్: దాదాపు 20లక్షల మంది అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే ‘ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం)’ విభాగానికి మహిళా అధినేతగా భారతీయ మూలాలున్న కిరణ్ అహూజా వ్యవహరించనున్నారు. 49 ఏళ్ల కిరణ్ అహూజాను ఓపీఎం హెడ్‌గా ఎంపికచేస్తూ అధ్యక్షుడు బైడెన్ గతంలోనే నామినేట్ చేశారు. అయితే, ఈ నామినేషన్‌పై సెనేట్‌లో మంగళవారం హోరాహోరీ ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో 50–50 ఓట్లు పడ్డాయి.
దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియో గించుకున్నారు. కిరణ్‌కు మద్దతుగా ఓటేశారు. దీంతో కిరణ్ పదవి ఖరారైంది. కీలకమైన ఓటింగ్‌లలో ఉపాధ్యక్షురాలి హోదాలో కమలా హ్యారిస్ ఇలా తన ఓటును వినియోగిం చుకోవడం ఏడాదికాలంలో ఇది ఆరోసారి కావడం విశేషం. ‘ప్రజాసేవలో, దాతృత్వ కార్యక్రమాల్లో కిరణ్‌కు రెండు దశాబ్దాల కుపైగా అపార అనుభవముంది. గతంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోనూ కిరణ్ ఓపీఎంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇకమీదట ఆమె ఓపీఎం అధినేతగా అద్భుత పనితీరు కనబరుస్తారు’ అని సెనేటర్ డ్యానీ ఫెయిన్‌స్టెయిన్ కీర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment