భారత సంతతికి చెందిన చెందిన బ్రిటిష్ కళాకారిణి రాధికా వెకారియా 30 ఏళ్ల వయసులో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒకపుడు మాట్లాడానికి (నత్తి లాంటిది) ఇబ్బంది పడింది. తన పేరు కూడా పలకడానికి కూడా కష్టపడిన ఆమె సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. రాధిక వెకారియా తన బాల్యంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అనేక అవమానాల పాలైంది. వేధింపులు, బెదిరింపులూఎదుర్కొంది. ఆ అవమానాలు, వేధింపుల నుంచే తన విజయాన్ని వెదుక్కుంది. మౌనంగా ఉంటూనే, ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగింది.
ఫిబ్రవరి 2న లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గ్రామీ అవార్డ్స్ కార్యక్రమంలో టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలిష్, సబ్రినా కార్పెంటర్ చాపెల్ రోన్ వంటి పాపులర్ పాప్ దిగ్గజాలతో కలిసి టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలిష్, సబ్రినా కార్పెంటర్ మరియు చాపెల్ రోన్ వంటి ప్రధాన పాప్ సంస్కృతి దిగ్గజాలతో చేరుతుంది. నడిచింది.ఇంతకీ ఎవరీ రాధిక? ఏమా కథ? తెలుసుకుందాం రండి!
2013 నుండి అమెరికాలో నివసిస్తున్న రాధిక వెకారియా లండన్‌లో పుట్టింది. ఈమె తాతముత్తాతలు భారతసంతతికిచెందినవారు. బాల్యం నుంచి దీర్ఘకాలిక ప్రసంగ లోపాలతో బాధపడేది. మాట్లాడటంలో ఇబ్బంది ఉన్నా తాను ఖచ్చితంగా పాడగలనని గ్రహించింది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. అందుకే మాట్లాడటం నేర్చుకునే ముందు పాడటం నేర్చుకుంది.
మరోవైపు అమ్మమ్మ నుంచి స్ఫూర్తి పొందిన రాధిక చిన్నప్పటి నుంచి శాస్త్రీయసంగీతంపై ఆసక్తి పెంచుకుంది. ఆర్టిస్ట్‌గా రాణించింది. వారియర్స్ ఆఫ్ లైట్’ ఆల్బమ్ నామినేషన్‌కు ఎంపికైంది. ఈ ఆల్బమ్‌ను రాధిక సంస్కృతం, హిందీ, తమిళం, ఆంగ్లభాషల్లో పాడటం విశేషం. ఉత్తమ న్యూ ఏజ్, యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్ విభాగంలో అనౌష్కా శంకర్, రికీ కేజ్ వంటి ప్రముఖ కళాకారుతో తలపడింది.
రాధిక వెకారియా ఇలా అంటుంది..
"మాటల సమస్య ఉన్న చాలా మంది నిజానికి చాలా మంచి గాయకులు, దానికి శ్రావ్యత, కొంచెం స్వరం , కొంచెం సంగీత జ్ఞానం అలవడితే గాయకులుగా రాణిస్తారు. అంతేకాదు అది మనస్సుకు ప్రశాంతత నిస్తుంది.మెదడుకు మంచిది. నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. అందుకే ఆకు పాడటం అలవాటైంది’’ అని చెప్పుకొచ్చింది. అసలు తనకున్న సమస్యను అధిగమించగలనని ఊహించలేదని సంతోషంగా తెలిపింది. తన పాట విని స్నేహితులు , కుటుంబ సభ్యులు ముగ్ధులయ్యారని చెప్పింది. అసలు వేదికలపై మాట్లాడ తానని, ఇపుడు చేస్తున్న పనులన్నీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. తాను నేర్చుకున్న సంగీతమే, తస్వేచ్ఛగా మాట్లాడగలిగేలా చేయగలిగింది అంటూ అంతులేని సంబరంతో చెప్పింది. క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లోపం స్వయంగా నయంకావడం ప్రారంభమైందని వెల్లడించింది. పెద్దయ్యాక పాడడానికి ఒక ధ్యానం చేసేదాన్నని, అది చాలా ప్రభావాన్ని చూపించినట్టు వెల్లడించింది. తనలోని లోపాలకు భయపడటం మానేసి, తనలో ఏదో శక్తి ఉందని, పాటగలనని గ్రహించడమే తన జీవితంలో పెద్ద మలుపు అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment