అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారని, ఈ ఫలితాన్ని ఇక ఎవరూ మార్చలేరని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని వీడాలని సూచించారు. బైడెన్ గెలుపును ఒప్పుకోవాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. బైడెన్ గెలుపును అధికారికంగా అంగీకరించకుండా ట్రంప్ మొండికేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే తాను ఓడిపోయానని ఆరోపిస్తున్నారు. న్యాయ పోరాటం సాగిస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో బైడెన్ గెలిచారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని ఒబామా తాజాగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment