
వాషింగ్టన్: వలస వ్యతిరేక ఎజెండాతో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఉన్న 6.50 లక్షల యువ వలసదారులకు ప్రభుత్వపరమైన రక్షణల రద్దుకు ట్రంప్ చేస్తున్న యత్నాలకు బ్రేక్ పడింది. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతోపాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం 2012లో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ) తీసుకువచ్చింది. దీన్ని ట్రంప్ వ్యతిరేకించారు.తాజాగా డీఏసీఏ విధానం అక్రమమనీ, దీనిపై సమీక్షించేందుకు కోర్టులకు అధికారం లేదని ట్రంప్ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనను ప్రధాన జడ్జి జాన్ రాబర్ట్స్, మరో నలుగురు జడ్జీలు తిరస్కరించారు. ‘డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.