ఇటీవల కాలంలో చనిపోయిన భర్త నుంచే పిల్లలను కన్న ఓ మహిళ గురించి విన్నాం. ఆకేసులో ఆ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆ పద్ధతిలో పిల్లను కనాలనుకునేలోపు కరోనా మహమ్మారి రావడం భర్త చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఒంటిరిగా అయిపోయిన ఆ భార్య తన భర్త ఉన్నప్పుడు పిల్లలను కనాలనుకున్న ఘటన గుర్తొచ్చి ఆస్పత్రికి వెళ్లి తన నిర్ణయాన్ని తెలిపి మరీ సాహసోపేతంగా బిడ్డను కని వార్తల్లో నిలిచింది. అది మరువక మునుపే అదే మాదిరి ఘటన కాకపోతే కొద్ది తేడా ఉంది. అక్కడ బతికుండగానే భర్త నుంచి స్పెర్మ్ తీసుకున్నారు. ఇక్కడ ఈ జంట కనాలనుకునేలోపే భర్త అకాల మరణం పొందాడు. అయినా తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంటున్నా అంటూ అందుకు పర్మిషన్ ఇమ్మని ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..వెస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆమె భర్త తమ ఇద్దరు పిల్లలను వేర్వేరు ఘటనలు పోగొట్టుకున్నారు. దీంతో ఇరువురు పిల్లను కనాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇటీవలే డిసెంబర్ 17న భర్త ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె తన భర్త బతికుండగానే పిల్లలను కనాలనుకున్న దాన్ని నిజం చేయాలనుకుంది. చనిపోయినప్పటికీ తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంది. అందుకోసం అని చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని సేకరించాలనుకుంది. దీనికి సుప్రీం కోర్టు అనుమతివ్వాలంటూ అభ్యర్థించింది.
తన భర్త బతికున్నప్పుడే తామిరువురం అనుకున్నామని, తన భర్త కోరికని అనుమతిమ్మని కోర్టుని వేడుకుంది. దీంతో ధర్మాసనం చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని తీసుకునేందు అనుమతి మంజూరుచేసింది. ఇక్కడ ఓ చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ ఫలదీకరణం చెందించేలా ఉపయోగించడం అనేది వైద్యశాస్త్రంలో మరింత పురోగతికి నాంది పలుకుతుందనే చెప్పాలి. ఇక ఆ జంట పిల్లలు 2013లో కుమార్తె(29) ఫిషింగ్ ట్రిప్‌లో మరణించగా, కుమారుడు(30) కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లను కనాలని అనుకుంది. అయితే పిల్లలను కనే వయసు సదరు మహిళకు దాటిపోవడంతో సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు.
ఈలోగా అనుకోకుండా భర్త దూరమవ్వడంతో ఆ కోరిక కలగా మిగిలిపోకూడదని ఆ మహిళ స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించి చనిపోయిన భర్త నుంచే స్పెర్మ్‌ని సేకరించేలా అనుమతి పొందింది. కాగా, మరణాంతర ఫలదీకరణంపై వెస్ట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అందువల్ల ఆమె సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటే..ముందుగా సదరు మహిళ స్త్రీ పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె దివగంత భర్త తండ్రి కావాలనుకున్నాడా? అలాగే సదరు మహిళ చెబుతోంది అంతా నిజమేనా? అన్నది నిర్థారణ చేసుకుని ఆస్ట్రేలియా వైద్యాధికారులు అనుమతి ఇస్తేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అధికారులు సదరు మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు.
(చదవండి: ఒక లీటర్ బాటిల్‌లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా! వెలుగులోకి షాకింగ్ విషయాలు!)
Comments
Please login to add a commentAdd a comment