గ్రీన్‌కార్డ్ కోసం తిప్పలు
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడతారనే కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య తారలు. రమ్స్ దర్శకత్వంలో మాస్టర్ దేవాన్ సమర్పణలో శ్రీనివాస్ గుప్తా, మోహన్.ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మించారు.
కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘వీసా తీసుకుని అమెరికా వెళ్లిన ఓ కుర్రాడి కథే గ్రీన్‌కార్డ్. పిల్లలను అమెరికా పంపాలనుకునే తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. 90 శాతం అమెరికాలో తీశాం’’ అన్నారు రమ్స్.