పది డాలర్ల కోసం!
‘వియ్ లవ్ అమెరికా.. వియ్ హేట్ గన్స్’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య పాత్రల్లో రమ్స్ దర్శకత్వం లో శ్రీనివాస్ గుప్తా, మోహన్. ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మిం చిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘అమెరికాలో ఎవరు ఎవర్ని కాల్చినా అడిగేవాడుండడు.
అమెరికాను ఇష్టపడదాం.. కానీ గన్స్ కల్చర్‌కు దూరంగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు చలపతి రావు . ‘‘2004లో 10 డాలర్ల బీర్ కోసం నా మీద ఓ అమెరికన్ గన్ గురిపెట్టాడు. నాతో పాటు మరికొందరికి ఎదురైన ఇలాంటి అనుభవాల ఆధారంగా ‘గ్రీన్‌కార్డ్’ తెరకెక్కించాం. త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రమ్స్ చెప్పారు.