Srinivas Gupta
-
హైటెక్స్‌లో ఇండోమాక్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మాదాపూర్: తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ గుప్త అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండోమాక్–2022 పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ అండ్ మిషనరీ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యత్రాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆటోమెషీన్, మెషిన్ టూల్స్ పరిశ్రమలలో పురోగతి చెందుతుందన్నారు. యంత్ర పరికరాల ఉత్పత్తిలో భారతదేశం 10 స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ ఉత్పత్తిలో 0.9 శాతం ఉన్నట్టు తెలిపారు.మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనలో 125కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. -
శ్రీనివాస గుప్తా.. ఈయన సమ్‌థింగ్ స్పెషల్
-
శ్రీనివాస గుప్తా.. ఈయన సమ్‌థింగ్ స్పెషల్
సాక్షి, బెంగళూర్: భార్య బతికి ఉండగానే ప్రత్యక్ష నరకం చూపించే మహానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్తలు ఉన్న ఈ లోకంలో ఈయన సమ్‌థింగ్ స్పెషల్. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. భార్యను మర్చిపోలేని ఆయన ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారు. ఇటీవల గృహప్రవేశం సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రదర్శించారు. గృహప్రవేశం వేడుకలో భార్య కూడా తన పక్కనే ఉందన్న భావనతో ఆయన ఎంతో సంతోషానికి లోనయ్యారు. మొహంలో చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడుతున్న విగ్రహాన్ని చూస్తే అసలది బొమ్మేనా అని గృహ ప్రవేశానికి వచ్చినవారు ఆశ్చర్యపోతున్నారు. దగ్గరిగా వెళ్లి చూస్తే తప్ప అచ్చం మనిషిలాగే ఉన్న దానిని విగ్రహాం అని అసలు గుర్తించలేం. కార్యక్రమానికి వచ్చిన వారు మైనపు బొమ్మతో ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో.. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా సతీమణి మైనపు విగ్రహాన్నే చేయించాడు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!) #Karnataka: Industrialist Shrinivas Gupta, celebrated house warming function of his new house in Koppal with his wife Madhavi’s silicon wax statue, who died in a car accident in July 2017. Statue was built inside Madhavi's dream house with the help of architect Ranghannanavar pic.twitter.com/YYjwmmDUtc — ANI (@ANI) August 11, 2020 -
రేపు టీఆర్ఎస్లోకి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా
హైదరాబాద్: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఈ నెల 10న మంత్రి కేటీఆర్ సమక్షంలో వేలాది మంది కార్యకర్తలతోపాటు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎనలేని సేవ చేస్తున్నారని, ఆ గొప్ప నాయకుడి దారిలో నడిచి ప్రజాభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నానని తెలిపారు. గుజరాత్ మాదిరిగా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం 2 కార్పొరేషన్ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. వైశ్య భవనం కోసం ఉప్పల్ బాగాయత్లో 500 గజాల స్థలం, రూ.10 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని తనకే ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. 10న ఉదయం 9 గంటలకు నాగోలులోని తన నివాసం నుంచి కార్లు, బైకులతో ర్యాలీగా వెళ్లి పార్టీలో చేరతానని చెప్పారు. టీఆర్ఎస్కు జగిత్యాల ముస్లిం నేతల మద్దతు సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలతోపాటు ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్కు తమ మద్దతు ఉంటుందని జగిత్యాల ముస్లిం నాయకులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో పలువురు ముస్లిం నాయకులు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలసి తమ సమస్యలను వివరించారు. ‘కేసీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. జగిత్యాలలో ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ప్రభుత్వ పథకాల్లో ముస్లింలను భాగస్వామ్యం చేశాం’అని పేర్కొన్నారు. ఎంపీని కలసిన వారిలో జగిత్యాల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఖాజా లియాఖత్ అలీ, టీఆర్ఎస్ జగిత్యాల పట్టణ ముస్లిం విభాగం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు అమీన్ ఉద్దీన్, రియాజుద్దీన్, రియాజ్‌ఖాన్, జామియా ఉల్మా అధ్యక్షుడు ఉమర్ అలీ బేగ్ తదితరులు ఉన్నారు. -
పది డాలర్ల కోసం!
‘వియ్ లవ్ అమెరికా.. వియ్ హేట్ గన్స్’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య పాత్రల్లో రమ్స్ దర్శకత్వం లో శ్రీనివాస్ గుప్తా, మోహన్. ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మిం చిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘అమెరికాలో ఎవరు ఎవర్ని కాల్చినా అడిగేవాడుండడు. అమెరికాను ఇష్టపడదాం.. కానీ గన్స్ కల్చర్‌కు దూరంగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు చలపతి రావు . ‘‘2004లో 10 డాలర్ల బీర్ కోసం నా మీద ఓ అమెరికన్ గన్ గురిపెట్టాడు. నాతో పాటు మరికొందరికి ఎదురైన ఇలాంటి అనుభవాల ఆధారంగా ‘గ్రీన్‌కార్డ్’ తెరకెక్కించాం. త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రమ్స్ చెప్పారు.