సాక్షి, బెంగళూర్: భార్య బతికి ఉండగానే ప్రత్యక్ష నరకం చూపించే మహానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్తలు ఉన్న ఈ లోకంలో ఈయన సమ్‌థింగ్ స్పెషల్. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య రోడ్ యాక్సిడెంట్‌లో మరణించారు. భార్యను మర్చిపోలేని ఆయన ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారు. ఇటీవల గృహప్రవేశం సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రదర్శించారు.
గృహప్రవేశం వేడుకలో భార్య కూడా తన పక్కనే ఉందన్న భావనతో ఆయన ఎంతో సంతోషానికి లోనయ్యారు. మొహంలో చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడుతున్న విగ్రహాన్ని చూస్తే అసలది బొమ్మేనా అని గృహ ప్రవేశానికి వచ్చినవారు ఆశ్చర్యపోతున్నారు. దగ్గరిగా వెళ్లి చూస్తే తప్ప అచ్చం మనిషిలాగే ఉన్న దానిని విగ్రహాం అని అసలు గుర్తించలేం. కార్యక్రమానికి వచ్చిన వారు మైనపు బొమ్మతో ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో.. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా సతీమణి మైనపు విగ్రహాన్నే చేయించాడు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!)
#Karnataka: Industrialist Shrinivas Gupta, celebrated house warming function of his new house in Koppal with his wife Madhavi’s silicon wax statue, who died in a car accident in July 2017.
— ANI (@ANI) August 11, 2020
Statue was built inside Madhavi's dream house with the help of architect Ranghannanavar pic.twitter.com/YYjwmmDUtc
Comments
Please login to add a commentAdd a comment