
మాదాపూర్: తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ గుప్త అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండోమాక్–2022 పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ అండ్ మిషనరీ ఎక్స్‌పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యత్రాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆటోమెషీన్, మెషిన్ టూల్స్ పరిశ్రమలలో పురోగతి చెందుతుందన్నారు. యంత్ర పరికరాల ఉత్పత్తిలో భారతదేశం 10 స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ ఉత్పత్తిలో 0.9 శాతం ఉన్నట్టు తెలిపారు.మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనలో 125కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.