Tourism Development
-
13 నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. 13న ఆస్ట్రేలియా వెళ్లనున్న ఆయన.. అక్కడ క్వీన్స్‌ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 15న సీఎం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మళ్లీ ఈ నెల 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పర్యాటక పాలసీని ప్రకటించిన నేపథ్యంలో... సింగపూర్‌లో పర్యాటకాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తారు. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి సింగపూర్ ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తోందన్న అంశాన్ని అధ్యయనం చేస్తారు. అనంతరం ఈ నెల 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. దావోస్ పర్యటనకు సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. -
నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
విజయవాడ కృష్ణా నదిలో ‘సీ ప్లేన్’ ఎక్కి నేరుగా కాకినాడ వద్ద దిగాలనుకుంటున్నారా.. లేదా విశాఖ రుషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, మాల్దీవుల వంటి దేశాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ‘సీ ప్లేన్’లు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ–కాకినాడ, కాకినాడ– రుషికొండ, కోనసీమ–విశాఖపట్నం, రుషికొండ–లంబసింగికి హాయిగా సీ ప్లేన్‌లో రయ్యిన దూసుకుపోయే అవకాశం కలుగుతుంది. తొలి దశలో ప్రతిపాదించిన 40 నిమిషాల ప్రయాణ షెడ్యూల్ విజయవాడ–కాకినాడ, కాకినాడ–రుíÙకొండ, రుషికొండ–లంబసింగి, లంబసింగి–రుషికొండ, రుషికొండ–కోనసీమ, కోనసీమ–విశాఖపట్నం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక గమ్యస్థానాల మధ్య దూరాన్ని చెరిపేసేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. అపార జలవనరుల మీదుగా ఆకాశంలో విహరిస్తూ సహజసిద్ధ పర్యాటక అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలోకి ‘సీ ప్లేన్’ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలను ఒకదానికొకటి అనుసంధానించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సీ ప్లేన్’ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి దశలో 9–10 మంది ప్రయాణ సామర్థ్యంతో ఆరు ప్రాంతాల్లో రెండు ‘ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్’లు నడిపేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19–20 సీట్లు ఉండే సర్విసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్.. ‘సీ ప్లేన్’ సేవలపై అంతర్జాతీయంగా పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మాల్దీవుల పర్యాటకంలో ఫ్లోటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, కెనడాలోనూ పెద్ద సంఖ్యలో సీ ప్లేన్లు పని చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో 48 శాతం సీ ప్లేన్ సేవలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కెనడాలో 34 శాతం, ఐరోపాలో 8 శాతం, ఆ్రస్టేలియాలో 4 శాతం, ఇతర ప్రాంతాల్లో 6 శాతం సేవలు అందిస్తున్నాయి. కాగా, పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలకు గంట దూరంలోనే విమాన సేవలుండాలనే ప్రాథమిక అంశాలకు పెద్దపీట వేస్తున్నాం. అందుకే సీ ప్లేన్ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించాం. ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని నీటి వ్యవస్థలను సీ ప్లేన్లకు ల్యాండింగ్ గ్రౌండ్‌గా ఉపయోగించవచ్చు. వీటి ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తాం’ అని పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
నయా ఆతిథ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఆతిథ్య’ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు రూ.140 కోట్లతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజు్ఞలైన అర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు అద్దుతోంది. విశాఖ నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ–టెండరింగ్ ప్రక్రియ ద్వారా హరిత హోటళ్ల అప్‌గ్రేడ్, పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 16 హోటళ్ల పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. విశాఖలోని యాత్రీనివాస్ హోటల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అరకులోని హరిత వ్యాలీ రిసార్టు, నెల్లూరు, ద్వారకాతిరుమలలోని హోటళ్ల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. మరో వారంలోగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టైడా జంగిల్ బెల్స్ రిసార్టు, విజయపురిసౌత్, శ్రీశైలం, సూర్యలంక, కడప, అరకులోని మయూరి, హార్సిలీహిల్స్, కర్నూలు, గండికోట హోటళ్లతో పాటు నెల్లూరు మైపాడు బీచ్ రిసార్టు, దిండి కోకోనట్ రిసార్టు, అనంతగిరి హిల్ రిసార్టులకు టెండర్లు పిలవనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ఆతిథ్య రంగంలోని ప్రైవేటు హోటళ్లకు దీటుగా ఏపీటీæడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్లో లగ్జరీ ఫర్నీచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడ్రన్ జిమ్, స్విమ్మిగ్ పూల్, సావనీర్ షాపు, మినీ బ్యాంకెట్/సమా వేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఉడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై–వెట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనాన్ని పెంచనుంది. పులివెందులలో 4స్టార్ హోటల్ పులివెందులలో రూ.23.50 కోట్లతో 4స్టార్ హోటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన 1.71 ఎకరాల్లోని ఓ భవనాన్ని గుర్తించి కొనుగోలు చేసింది. ఇందులో వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్ (క్లబ్ హౌస్), జిమ్, పిల్లల ఆటస్థలం, ఎలివేటర్స్, సరై్వలెన్స్ సిస్టమ్, సౌర విద్యుత్ స్టేషన్‌తో పాటు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. సౌకర్యాల కల్పనలో రాజీపడం పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలుత హరిత హోటళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. అత్యధిక పర్యాటకులు వచ్చే హోటళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తున్నాం. దశల వారీ అన్ని హోటళ్లలో మార్పులు చేస్తాం. నాణ్యమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. స్టార్ హోటళ్లకు దీటుగానే మా రిసార్టులు, హోటళ్లను తీర్చిదిద్దుతాం – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణీత కాల వ్యవధిలో.. హోటళ్ల ఆధునికీకరణలో భాగంగా ఈ–టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్ల సమన్వయంతో పని చేస్తున్నాం. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. అనుకున్న కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో హోటళ్లను అప్‌గ్రేడ్ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – మల్రెడ్డి, ఈడీ (ప్రాజెక్ట్స్), పర్యాటకాభివృద్ధి సంస్థ -
Bolarum : రాష్ట్రపతి నిలయంలో మరిన్ని పర్యాటక హంగులు
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో పలు పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానంగా 1948 నాటి ఫ్లాగ్ పోస్ట్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్ ఆజం షా నుంచి హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించిన ఎంకే వెల్లోడి బాధ్యతలు స్వీకరిస్తూ హైదరాబాద్ జెండా స్థానంలో జాతీయ జెండాతో కూడిన ఫ్లాగ్ పోస్ట్‌ను ఆవిష్కరించారు. అయితే కాలక్రమేణా ఆ ఫ్లాగ్‌పోస్ట్ పాడవడంతో 2010లో దాన్ని తొలగించారు. తాజాగా అందుకు ప్రతిరూపంగా నూతనంగా టేకుతో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ పోస్ట్‌ను రాష్ట్రపతి గురువారం ప్రారంభించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మ్యూజికల్ ఫౌంటేన్, చిల్డ్రన్స్ పార్క్, పునరుద్ధరించిన మూడు మెట్ల బావులతోపాటు సంప్రదాయ మోట పద్ధతి ద్వారా నీటిని తోడే వ్యవస్థను సైతం ప్రారంభించారు. అలాగే రాతిపై చెక్కిన శివుడు, నంది శిల్పాల నుంచి నీళ్లు జాలువారే వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లుఅధికారులు తెలిపారు. -
‘కొండంత’ అబద్ధం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ఊసే రామోజీకి నచ్చట్లేదు. అక్కడ అభివృద్ధి అసలే గిట్టట్లేదు. అందుకే విశాఖపట్నంలోని రుషికొండ టూరిజం పునర్నిర్మాణ ప్రాజెక్టుపై ‘ఈనాడు’ విష ప్రచారం మొదలెట్టింది. బోడి గుండుకి.. మోకాలికి ముడేస్తూ వాస్తవాల వక్రీకరణకు తెరలేపింది. త్వరలో రుషికొండను మిగలకుండా చేసేస్తారంటూ ప్రజలను మభ్యపెట్టేలా ఊహాజనిత కథనాన్ని అచ్చేసింది. విశాఖ జిల్లా పరవాడ మండలం ఎండాడ గ్రామం సర్వే నంబర్ 19/3, 19/4లో రుషికొండలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి 61 ఎకరాల భూమి ఉంది. అందులో కేవలం 9.88 ఎకరాల్లో మాత్రమే రిసార్టుల పునర్నిర్మాణ ప్రాజెక్టును ఏపీటీడీసీ ప్రతిపాదించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), అటవీ, జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి పూర్తి స్థాయి క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాతే పనులు చేస్తోంది. కానీ, ఈనాడు మాత్రం 61 ఎకరాల్లోనూ కట్టడాలకు అనుమతులిచ్చారని, కొండ పూర్తిగా కనుమరుగవుతుందంటూ భయాందోళన కలిగించేలా కథనం ప్రచురించడంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కె.కన్నబాబు ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వం ఏపీటీడీసీ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైఎండ్ లగ్జరీ రిట్రీట్ రుషికొండ ప్రాజెక్టును లీజుకిచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు లేదన్నారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రతి అంశంపై కోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాతే పనులు చేశామని చెప్పారు. భవనాల నిర్మాణం, రహదారులు సహా అన్ని పనులకు సంబంధిత శాఖల ఆమోదం తీసుకున్నామని, ఎక్కడా ఉల్లంఘనలకు చోటివ్వలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వంతో సమగ్రంగా చర్చించి, పరిపాలనపరమైన అనుమతులు పొందామని, ఇదంతా పర్యాటక శాఖకు తెలియకుండా జరగదని చెప్పారు. అదేవిధంగా అప్పటి పర్యాటక మంత్రికి తెలియకుండా ఈ ప్రాజెక్టు జరగదని, ఈనాడు రాసినవి అవాస్తవాలని చెప్పారు. అసలు వాస్తవాలను ఆయన వెల్లడించారు. ఆరోపణ: 61 ఎకరాల్లో కట్టడాలకు అనుమతులు వాస్తవం: రుషికొండలో ఏపీటీడీసీకి ఉన్నది 61 ఎకరాలు. అందులో 9.88 ఎకరాల్లో మాత్రమే పర్యాటక రిసార్టుల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు సీఆర్‌జెడ్ నుంచి అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. ఇందులో 19,968 చదరపు మీటర్లలో 7 బ్లాక్‌లు నిర్మించాలన్నది ప్రతిపాదన. 5.18 ఎకరాల్లో మాత్రమే భవనాలు ఉంటాయి. మిగిలిన 4.70 ఎకరాలు రోడ్లు, గ్రీనరి, గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్, డ్రెయిన్ల కోసం వినియోగిస్తారు. ఆరోపణ: రుషికొండలో 90 శాతం విస్తీర్ణంలో పనులు వాస్తవం: ఏపీటీడీసీ ప్రాజెక్టులో కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే 4 బ్లాకులను (విజయనగరం, గజపతి, కళింగ, వేంగి) నిర్మించింది. మిలిగిన 8.04 ఎకరాల్లో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టలేదు. వాటిని ల్యాండ్ స్కేపింగ్ పనుల కోసం వినియోగిస్తారు. అంటే ప్రతిపాదిత 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేవలం 13,542 చదరపు మీటర్లకు మాత్రమే నిర్మాణాలకు పరిమితమైంది. రుషికొండలో అందుబాటులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో 3 శాతం భూమిలో మాత్రమే భవనాల నిర్మాణం జరిగింది. ఇంకా 97 శాతం ప్రాంతం ఖాళీగానే ఉంది. ఆరోపణ: రుషికొండపై పర్యావరణానికి విఘాతం వాస్తవం: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సీఆర్‌జెడ్ క్లియరెన్స్, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్, ఫైర్ క్లియరెన్స్ తీసుకుంది. పర్యావరణ సమతుల్యత కోసం ఏపీటీడీసీ 16,350 స్థానిక జాతుల మొక్కలు, 24,120 హెడ్జ్ ప్లాంట్స్, 4,047 తీగజాతి మొక్కలతో గ్రీనరీని అభివృద్ధి చేసింది. రుషికొండను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటుతూ వృక్ష సంపదను పెంచుతోంది. సీఆర్‌జెడ్ అనుమతి పొందిన ప్రాంతంలో ఎక్కడా బోర్‌వేల్స్ వేయలేదు. ఇక భూగర్భ జలాలను వెలికితీశారనడానికి అవకాశమే లేదు. -
ఇక గ్లోబల్ గండికోట
ప్రస్తుతం దేశంలో పర్యాటకం కీ రోల్ పోషిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక దార్శనికతతో తన డైనమిక్ లీడర్‌షిప్‌తో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయి సెవెన్ స్టార్ రిసార్ట్స్‌ను, మంచి రూమ్స్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తాం. ఏపీలో హోటల్స్ స్థాపించడం వల్ల ఇక్కడి వారికి ఉపాధి ఇవ్వగలుగుతాం. ప్రఖ్యాతిగాంచిన ఈ గండికోటలో మంచి సౌకర్యాలతో లగ్జరీ సెవెన్ స్టార్ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, వైజాగ్‌లో కూడా హోటల్స్‌ను ప్రారంభిస్తాం. 2025కు ఈ హోటల్స్ ప్రారంభమవుతాయి. – విక్రమ్‌సింగ్ ఒబెరాయ్, ఒబెరాయ్ హోటల్స్ సీఈవో సాక్షి ప్రతినిధి, కడప: గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిల్చుకునే మన గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటలో ఆదివారం ఆయన ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తిరుపతి, విశాఖపట్నం ఒబెరాయ్ హోటల్స్‌కు కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దేవుడి దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. ఒక్కరోజే గండికోట, విశాఖపట్నం, తిరుపతితో కలిపి మూడు చోట్ల ఒబెరాయ్ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరగడం సంతోషకరం అని చెప్పారు. ఒబెరాయ్ లాంటి గ్రూపు ఇక్కడకు వచ్చి.. సూపర్ లగ్జరీ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోందన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హోటల్స్ కడితే గండికోట గ్లోబల్ టూరిజం మ్యాప్‌లోకి చేరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ జిల్లా, గండికోట రెండూ అంతర్జాతీయంగా చోటు దక్కించుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ కార్ల్ లో నూటెక్ బయోసైన్సెస్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఉద్యోగావకాశాలు విస్తృతం ఇక్కడ ఒబెరాయ్ హోటల్ రావడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఈ హోటల్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒబెరాయ్ ప్రాజెక్టు అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది. గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఒబరాయ్ లాంటి ఇంకో గ్రూపుని తీసుకొచ్చే కార్యక్రమం ముమ్మరంగా చేస్తాం. ► ఇంతకుముందు విక్రమ్ ఒబెరాయ్‌తో మాట్లాడుతూ ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ పెట్టే ఆలోచన చేస్తే హోటల్‌కు మంచిదని, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని.. ఈ హోటల్‌ను ఒక గోల్ఫ్ రిసార్ట్‌గా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పాను. ఆ దిశగా అడుగులు వేసేలా ఆలోచన చేస్తామన్నారు. ► విక్రమ్ ఒబెరాయ్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాజెక్టు రావడానికి శాయశక్తులా కృషి చేసిన చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్‌రెడ్డి నుంచి పర్యాటక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సహా ప్రతి ప్రభుత్వ అధికారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టుకు మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ కంపెనీ మన గురించి బయట గొప్పగా మాట్లాడితే ఇంకా నాలుగు కంపెనీలు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ► ఏవైనా చిన్న చిన్న అంశాలుంటే కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మనం ఎంత సహకారం అందిస్తే మన జిల్లా ప్రతిష్ట అంతగా పెరిగి అంత ఎక్కువ పరిశ్రమలు వస్తాయి.. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెడతారు. మీ సోదరునిగా అందరికీ ఇదే నా విజ్ఞప్తి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ పనులు ► జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నాం. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలని దశాబ్దాలుగా కన్న కలను నిజం చేస్తూ గతేడాది జిందాల్ గ్రూపుతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఇందుకు సంబంధించిన వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు ఈ నెలలోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తుంది. ఆ తర్వాత రెట్టించిన వేగంతో పనులు జరుగుతాయి. ► రేపు కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి సంబంధించిన ప్లాంట్‌కు ప్రారంభోత్సవం చేస్తున్నాం. కొప్పర్తిలో డిక్సన్ గ్రూపు 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఛానల్ ప్లే అనే మరో కంపెనీ హోం ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూపై సంతకాలు చేయనున్నాం. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ► ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ ప్రొడక్టస్ తయారు చేసే టెక్నో డామ్ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నాం. ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వైఎస్సార్ జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం, మంచి జరిగే రోజులు చాలా ఉన్నాయి. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు, అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
ఒబెరాయ్ హోటల్‌కు 20 ఎకరాల కేటాయింపు
తిరుపతి అలిపిరి/ జమ్మలమడుగు/మధురపూడి(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి అలిపిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను ఒబెరాయ్ హోటల్‌కు లీజ్ కమ్ రెంట్ విధానంలో కేటాయించే విషయమై ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు టూరిజం ఎండీ కన్నబాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డులోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటట్ ప్రతినిధులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గండికోటలో స్థలం పరిశీలన వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఒబెరాయ్ బృందం పర్యటించింది. ఒబెరాయ్ హోటల్ సీఈవో, ఎండీ విక్రమ్ ఒబెరాయ్, కార్పొరేట్ అఫెర్స్ ప్రెసిడెంట్ శంకర్, ఫైనాన్స్ ఆఫీసర్ కల్లోల్ కుందా,ఎంఏఎల్ రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. గతేడాది ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం గండికోటలో రిసార్టులను ఏర్పాటు చేస్తామని, భూమిని కేటాయించాలని కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్ యాజమాన్యానికి 50 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో రూ.250 కోట్లతో 120 విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఒబెరాయ్ బృందం గండికోటలోని వివిధ ప్రాంతాలను పరిశీలించింది. పెన్నానదిలోయ అందాన్ని తిలకించారు. పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో కలెక్టర్ల చర్చ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన హేవలాక్ బ్రిడ్జి, పర్యాటక కేంద్రమైన పిచ్చుక లంక అభివృద్ధిపై ఒబెరాయ్ గ్రూప్ ప్రతి నిధులతో తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లు కె.మాధవీలత, హిమాన్షుశుక్లా, ఎంపీ మార్గాని భరత్‌రామ్ చర్చించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తూ మధురపూడి విమానాశ్రయంలో ఆగిన ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులతో శనివారం రాత్రి సమావేశమై పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని విస్తరించవచ్చని వివరించారు. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం పెద్దపీట: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: పర్యాటకరంగ అభి వృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పర్యాటక, సాంస్కృతి కశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామంగా తెలంగాణ మారిందని కొనియాడారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరి గిన ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం మీట్లో తెలంగాణ పర్యాటక వైభవాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నామన్నారు. టెంపుల్ టూరి జానికి ప్రత్యేక ఆకర్షణ తెలంగాణ అని, హైదరా బాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం గుర్తింపు పొందిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాదాద్రి దేవాలయం అభివృద్ధి చేశామని వివరించారు. -
NEC Meet 2022: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరగాలి
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో టూరిజం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గువాహటిలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల 70వ ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్)ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడిదారులకు అనువైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజిటలీకరణ( అందుబాటులో ఎక్కడ ఎంత భూమి ఉంది), పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. 19 కొత్త రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సంపూర్ణం కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘ ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..
ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ.. ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తయిన తూర్పు కనుమల అందాలు అంతర్జాతీయ టూరిస్టులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కార్యనిర్వాహక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశీ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న విశాఖలో పీపీపీ విధానంలో పలు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పెట్టుబడులకు విదేశాలు ఆసక్తి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రిక్రియేషన్ టూరిజంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. సరికొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వివిధ దేశాలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. రిక్రియేషన్ అండ్ అడ్వెంచర్ టూరిజం విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టి.. పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ తదితర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రానున్న ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ఐకానిక్‌గా.. స్కైటవర్ తీరంలో సముద్ర మట్టానికి ఎత్తున విహరిస్తూ.. ఓవైపు అలల అందాల్ని.. మరోవైపు విశాఖ నగర హొయలను చూసేలా స్కైటవర్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీటూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచస్థాయి సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అంతర్జాతీయ వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమ్యూజ్మెంట్ రైడ్స్ సంస్థ ఇంటమిన్ ఈ ప్రాజెక్టుకు ఏపీటీడీసీ జాయింట్ వెంచర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి.. స్కైటవర్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. సుమారు 70 మంది సందర్శకులు చుట్టూ కూర్చొనే విధంగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ స్కైటవర్ పైకి తీసుకెళ్తుంది. రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే కాంతులతో కనిపించే ఈ టవర్.. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అరకు అందాల్లో తేలినట్టుందే.. మరోవైపు అడ్వెంచర్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రకృతి అందాలకు నిలయంగా.. అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆకర్షిస్తున్న విశాఖ మన్యం అడ్వెంచర్ టూరిజంకి కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా అరకులోయలో టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు రానుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరో ఫైల్ సంస్థ దీనికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి 30 మంది గాల్లో విహరించే సామర్థ్యం ఉన్న బెలూన్‌లో పర్యాటకులు విహరించేలా ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఇలా.. సరికొత్త పర్యాటకాన్ని విశాఖ వచ్చే టూరిస్టులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై.. రిక్రియేషన్ ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఏపీటీడీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. జలచరాల మధ్యలో విహరించేలా.. టన్నెల్ అక్వేరియం.. ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్ర లోతు ల్లో ఉండే పగడపు దీవులకు వెళ్లి.. 360 డిగ్రీల కోణంలో జలచరాల్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలో.. నీలి నీలి అందాలు.. చూపు తిప్పనీకుండా చేస్తాయి. టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్.. ఈ టన్నెల్ అక్వేరియంని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. టన్నెల్ అక్వేరియంకు ఎక్కువ శాతం సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. -
పర్యాటక గడప కడప.. మణిమకుటంలా గండికోట
వైఎస్సార్ జిల్లాలో పర్యాటకాభివృద్ధి వేగం పుంజుకుంది. కనీసం నాలుగైదు ప్రాంతాల్లో కొత్తగా పర్యాటకుల సందడి పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కావడం, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో గొప్ప ప్రాంతాలు ఉండడంతో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏటా పర్యాటకరంగంపై సమీక్షించుకునేందుకు సెప్టెంబరు 27న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగం తీరుతెన్నులపై కథనం. జిల్లా పర్యాటక రంగానికి గండికోట మణిమకుటంలా వెలుగుతోంది. ఇక్కడి ప్రైవేటు పర్యాటక టెంట్ల ద్వారా ప్రతి శని, ఆదివారాలలో రూ. 10 లక్షలకు పైగా రాబడి ఉంది. అధికారులు ఇటీవల టెంట్లను ఆన్లైన్ బుకింగ్ చేసే పద్ధతిని ప్రవేశపెట్టి క్రమబద్ధీకరించారు. ఇక్కడి రాబడిని గమనిస్తే గండికోట పర్యాటక వైభవం ఎలా ఉందో అంచనా వేయవచ్చు. శని, ఆదివారాల్లో కోటలోని హరిత హోటల్లో గదుల కోసం ఒకటిన్నర నెల ముందే రిజర్వు చేసుకోవాల్సి వస్తుండడం కూడా గమనార్హం. ఈ కోటకు యునెస్కో వారసత్వ హోదా కల్పించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం ప్రత్యేక శ్రద్ధ జిల్లాలో పర్యాటకాభివృద్ధికి గల అనుకూలతలను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ, సోమశిల వెనుక జలాలను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేసే విషయంపై దృష్టి పెట్టారు. ఇడుపులపాయ, పార్నపల్లె, పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కూడా పర్యాటకంగా తీర్చిదిద్ది బోటింగ్ సౌ కర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సోమశి ల వెనుక జలాల ప్రాంతాల్లో అటవీశాఖ వన విహారి పేరిట జలాధార పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోంది. ఇవే కాకుండా ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, పుష్పగిరి, వేంపల్లె గండి, పొలతల తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. మన కడప బస్సు యాత్ర కలెక్టర్ మన కడప పేరిట కడప సమీపంలోని నాలుగు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ఏసీ బస్సు యాత్రకు అవకాశం కల్పించారు. నాలుగు వారాలుగా ఈ యాత్ర విజయవంతంగా సాగుతోంది. జిల్లాలో పర్యాటకాభివృద్ధి కోసం రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ లాంటి సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే పలు పర్యాటక పుస్తకాలు, బ్రోచర్లు, ఫొటో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఈ రంగానికి ప్రచారం కల్పిస్తున్నాయి. ఇప్పటికి రాష్ట్ర పర్యాటకశాఖ జిల్లాలో ఇద్దరు రచయితల పర్యాటక పుస్తకాలకు ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రకటించడం జిల్లాలో జరుగుతున్న పర్యాటక కృషికి నిదర్శనం. 2022 సంవత్సరానికిగాను రాయలసీమ టూరిజం సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజుకు జిల్లాలో టూరిజానికి ఉత్తమ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నందుకు ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రకటించగా మంగళవారం తిరుపతిలో అవార్డు ప్రదానం చేయనున్నారు. ఐదేళ్లుగా వరుసగా రాష్ట్ర పర్యాటకశాఖ ఎక్స్‌లెన్స్ అవార్డులను జిల్లా వాసులు కైవసం చేసుకోవడం గమనిస్తే జిల్లాలో వ్యక్తులు, సంస్థలు పర్యాటకాభివృద్ధికి ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో అర్థమవుతోంది. ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్న ఆశలు కలుగుతున్నాయి. సీఎం సూచనతో... డిగ్రీలో పర్యాటకం కోర్సును ప్రతి కళాశాలలో తప్పక నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడం ఆ రంగంపై ఆయనకు గల అభిమానాన్ని, అంకిత భావాన్ని చాటుతోంది. ఇప్పటికే కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మూడు సంవత్సరాలుగా దాదాపు 50 మందికి పైగా విద్యార్థినులు బీఏలో టూరిజం కోర్సు చేశారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కూడా త్వరలో టూరిజం కోర్సు ప్రారంభం కానుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ ఈ కోర్సును ప్రారంభించేందుకు సుముఖంగా ఉండడం శుభపరిణామం. -
విశాఖ పర్యాటకాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
దొండపర్తి(విశాఖ దక్షిణ): విశాఖను పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం నగరంలో ఒక హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ముందుగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా రూపొందించిన యాప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధితో పాటు పర్యాటకంగా మరింత ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్డు 30 కిలోమీటర్ల మేర పర్యాటకాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల రూపకల్పన కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీలో మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో విశాఖ మరింత ప్రగతికి బాటలు పడతాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా కమిటీ ఏర్పాటు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా కమిటీ నూతనంగా ఏర్పాటైంది. శనివారం ఒక హోటల్లో జరిగిన ఛాంబర్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా లీలారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా గీతాశ్రీకాంత్‌లు నియమితులయ్యారు. అలాగే కమిటీలో ఇతర సభ్యులుగా గ్రంధి మల్లిక, హిమ బిందు, ఉమా వర్మ, జయలక్షి్మ, ఐశ్వర్య, రజితారెడ్డి, వినీత, రజనిచిత్ర, నిర్మల, విజయకుమారి నియమితులయ్యారు. ఈ నెల 25వ తేదీన ఈ కమిటీ ఆధ్వర్యంలో మేఘాలయ హోటల్లో అంగడి పేరుతో ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఎలక్టెడ్) పి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కోశాధికారి ఎస్.అక్కయ్యనాయుడు, భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
పిటిషనర్లవన్నీ అవాస్తవాలే
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండ రిసార్టు పునరుద్దరణ ప్రాజెక్టుకు సంబంధించి పిటిషనర్లు చెబుతున్నవన్నీ అవాస్తవాలని పర్యాటక అభివృద్ధి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. హైకోర్టుకు చెప్పారు. పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామన్నారు. పిటిషనర్లు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానం దాఖలు చేస్తామని విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులపై చర్యలు.. విశాఖ జిల్లా యందాడలోని సర్వే నంబర్ 19 పరిధిలో ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులివ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు, విశాఖ పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన నేత మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మూర్తి యాదవ్ తరఫున న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా 20–30 ఎకరాల్లో అదనంగా కొండను తవ్వేశారని ఆరోపించారు. తవ్వకాల వ్యర్థాలను బంగాళాఖాతంలో వేస్తున్నారని చెప్పారు. హైకోర్టు స్పందిస్తూ.. పనులకు సంబంధించి తామిచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్లు తేలితే.. బాధ్యులైన అధికారులను కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపిస్తామంది. రిసార్టును ఎంత మేర కూల్చివేశారో.. ఆ మేరకు నిర్మాణాలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినా కూడా కోర్టు ధిక్కార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ కోసం అవసరమైతే జిల్లా జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామంది. ఆ మేరకు ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు సిద్ధం కాగా.. అభిషేక్ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వారు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానంలో అన్ని వాస్తవాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు. తమ సమాధానం చూసిన తర్వాతే కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. 5.18 ఎకరాలకు మించి నిర్మాణాలు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ జోక్యం చేసుకుంటూ.. 20 ఎకరాలకు పైనే తవ్వకాలు జరిపారని.. సమీపంలోని బస్టాండ్‌ను కూల్చి వేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడానికి ముందే.. గతంలో ఎప్పుడో బస్‌స్టాండ్‌ను తొలగించినట్లు చెప్పారు. ఈ విషయం పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురించి అతని తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యాజ్యంపై త్వరలో కౌంటర్ వేస్తామని సుమన్ చెప్పారు. -
హైటెక్స్‌లో ఇండోమాక్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మాదాపూర్: తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ గుప్త అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండోమాక్–2022 పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ అండ్ మిషనరీ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యత్రాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆటోమెషీన్, మెషిన్ టూల్స్ పరిశ్రమలలో పురోగతి చెందుతుందన్నారు. యంత్ర పరికరాల ఉత్పత్తిలో భారతదేశం 10 స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ ఉత్పత్తిలో 0.9 శాతం ఉన్నట్టు తెలిపారు.మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనలో 125కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. -
బొర్రా గుహలకు మెట్రో గేటు
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు సరికొత్తగా సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నాయి. ఇక్కడికి దేశ విదేశాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పర్యాటక శాఖ అధునాతన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆన్లైన్ ఈ–పోస్ టికెట్ల ద్వారా గుహలు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో గుహలు ముఖద్వారం వద్ద కొత్తగా మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు మూడు, బయటకు వచ్చేటప్పుడు మూడు గేట్లు చొప్పున అమర్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. తాజాగా టెక్నీషియన్లు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ప్లాట్‌ఫాం నిర్మించిన వెంటనే మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తారు. గుహలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల్లో పెద్దలకు రూ. 70, చిన్నపిల్లలకు రూ. 50 చెల్లిస్తే మాగ్నెటిక్స్ కాయిన్స్ ఇస్తారు. వీటిని చూపించగానే గేటు తెరుచుకుంటుంది. గుహలను తిలకించి తిరిగి బయటకు వచ్చేందుకు మరోసారి చూపించాలి. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత టికెట్ల ధరలు అమలులో ఉన్నట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు. (చదవండి: విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్) -
20 సినిమాలకు పైగా షూటింగ్.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే..
పిచ్చాటూరు(చిత్తూరు జిల్లా): జిల్లాలోనే అతిపెద్ద జలాశయం అరణియార్ బహుసుందరంగా మారనుంది. బోటింగ్ సరదా తీర్చనుంది. సినిమా షూటింగులకు అనువుగా తయారుకానుంది. రిసార్టులు కొలువుదీరేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చిల్ర్టన్స్ పార్క్, ఉద్యానవనం, పచ్చిక బయళ్లు, వ్యూ టవర్ వంటి నిర్మాణాలతో ముస్తాబు కానుంది. తిరుమల– చెన్నై మార్గంలో పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికార యంత్రాంగం అరణియార్ ప్రాజెక్టు సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. అరణియార్ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పిచ్చాటూరు అరణియార్ గేట్ల వద్ద ప్రకృతి అందాలు అరణియార్ వద్ద చేపట్టనున్న పనులు తుడా అందించే నిధులతో అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ నిర్మించను న్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా పర్యాటక శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు. అతి సుందరమైన ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్ వద్ద సేద తీరేవారు. ప్రకృతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరణియార్ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగితరం చేస్తున్నారు. గతంలో షూటింగ్ స్పాట్ ఇదే పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు గతంలో షూటింగ్ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరించారు. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్ రౌడీ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి తారలు ఇక్కడ సందడి చేసినవారే. సంతోషంగా ఉంది గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యానవనం, రకరకాల జంతువుల బొమ్మలతో పిల్లలను ఎంతో ఆహ్లాదపరిచేది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. మళ్లీ ఇక్కడ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. సుందరీకరణను వేగవంతం చేయాలి. – తిరుమల, టూటౌన్, పిచ్చాటూరు అందుబాటులో ఆహ్లాదం అరణియార్ ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలోలాగా పర్యాటకులు, సినీ తారలు, దర్శకు లు తరలి రావాలి. ఈ జలాశయం షూటింగ్ స్పాట్‌గా సందడి చేయాలి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరడంతోపాటు స్థానికులకు కాస్త ఆహ్లాదం అందుబాటులో ఉంటుంది. –గంగాధరం రెడ్డి, రిటైర్డ్ టీచర్, పిచ్చాటూరు మరిన్ని నిధులు తెప్పిస్తా పర్యాటక అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు తేవడానికి నా వంతు కృషి చేస్తా. గతంలో ఈ అరణియార్ వైభవాన్ని స్వయంగా చూశాను. కాబట్టే మళ్లీ ఆ స్థితికి రావాలని ప్రయతి్నస్తున్నా. తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారం తీసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేస్తున్నారు. –కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్యే, సత్యవేడు -
ఆంధ్రప్రదేశ్ టూరిజం.. ‘స్టార్’డమ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ‘స్టార్’ స్టేటస్ సంతరించుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో సుమారు రూ.2,600 కోట్లతో పది ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఆతిథ్య రంగంలో దిగ్గజ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయి. నూతన టూరిజం పాలసీ 2020–2025 ప్రకారం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. సంబంధిత ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి సిద్ధంగా ఉన్నవి వెంటనే నిర్మాణ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఇటీవల వేర్వేరు ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఒబెరాయ్.. ఐదు ప్రదేశాల్లో ఒబెరాయ్ హోటళ్ల గ్రూప్ రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్లతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించనుంది. అన్నవరం, పిచ్చుకలంక, పేరూరు, గండికోట, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. హార్సిలీ హిల్స్‌లో సింగిల్ ఫేజ్‌లో నిర్మాణం పూర్తి కానుంది. లగ్జరీ సూట్లు, ఓపెన్ లాన్లు, పార్టీ ఏరియా, ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు, 24 గంటలు అందుబాటులో అంతర్జాతీయ రుచులతో కాఫీ షాప్‌లు, కాన్ఫరెన్స్, బాంకెట్ హాల్, బార్, ఈత కొలను, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా ఇతర సౌకర్యాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. పెనుకొండలో ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.వంద కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 288 గదులతో యాత్రి నివాస్ (అతిథి గదులు), 2 వేల సీట్ల సామర్థ్యంతో యాంపీ థియేటర్, కృష్ణలీలల థీమ్ పార్క్, 1,000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, 108 పడకలతో ధర్మశాల డార్మిటరీలు అందుబాటులోకి రానున్నాయి. మ్యూజియం, ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, సంస్కృతి భవన్, హెరిటేజ్ క్రాఫ్ట్ సెంటర్, ఐకానిక్ టవర్, చిన్నారులకు వినోద కేంద్రం, 600 కార్లకు పార్కింగ్ సదుపాయం, ప్రసాదం, ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది. పెనుకొండలో మూడేళ్ల భవన నిర్మాణ వ్యవధితో పాటు 33 ఏళ్ల లీజుకు అనుమతించారు. నాలుగు చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు హయత్, తాజ్ గ్రూప్‌ల భాగస్వామ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించనున్నారు. హయత్ సంస్థ విశాఖపట్నం శిల్పారామం పరిసరాల్లో రూ.200 కోట్లతో మూడు ఎకరాల్లో 200 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శిల్పారామం ప్రాంతంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో 225 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 5,100 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. విజయవాడలో రూ.92.61 కోట్లతో 81 గదులు, రెండు బాంకెట్ హాల్స్‌తో నాలుగు నక్షత్రాల హోటల్ రానుంది. ఇక తాజ్ వరుణ్ గ్రూప్ విశాఖపట్నంలో రూ.722 కోట్లతో 260 గదుల ఐదు నక్షత్రాల హోటల్, 90 సర్వీస్ అపార్ట్మెంట్స్, 12,750 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటర్, 2,500 సీటింగ్ సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ను నిర్మిస్తుంది. ఇందులో ఐదు రెస్టారెంట్లు, షాపులు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒలింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ 15 వేల ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి. రాయితీలు ఇలా.. పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దెను మార్కెట్ విలువలో ఒక శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచనున్నారు. భూ బదలాయింపు చార్జీలను మినహాయించారు. స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఐదేళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒబెరాయ్ సంస్థ ప్రాజెక్టులకు నాలుగేళ్ల నిర్మాణ కాలంతో పాటు 90 ఏళ్ల లీజును నిర్ణయించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లు, లగ్జరీ విల్లాల విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున, ఐదు నక్షత్రాల హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్స్, కన్వెన్షన్ సెంటర్ల ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్మెంట్ కల్పిస్తారు. ఆయా ప్రాజెక్టుల విలువను బట్టి ఏటా గరిష్ట వినియోగంపై పరిమితి విధించారు. పెట్టుబడిదారులకు సులభంగా.. సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పాత పాలసీ కంటే మెరుగ్గా పెట్టుబడిదారులకు రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాం. అందుకే అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మెగా టూరిజం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. పెట్టుబడిదారులకు ఎక్కడా సమస్య లేకుండా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
పర్యాటకానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్.. ప్రపంచాన్ని పిలుద్దాం
రాష్ట్రానికి ఈ చివర అనంతపురం జిల్లాలో లేపాక్షి మొదలు.. ఆ చివర శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్రగిరుల వరకు కనువిందు చేసే అందాలు ఎన్నెన్నో. నల్లమల సౌందర్యం మధ్య కొలువైన శ్రీశైల మల్లన్న, శేషాచలంపై వెలసిన వెంకన్న, కనుచూపు తిప్పుకోలేనంతగా కట్టిపడేసే పాపి కొండలు, కేరళను కనుల ముందు సాక్షాత్కరింపచేసే కోనసీమ, ఊటీని తలదన్నేలా అరకు.. కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్ల సవ్వడి చెంత వెలసిన ఎన్నో క్షేత్రాలు, అపురూప దృశ్యాలకు నిలయం మన ఆంధ్రప్రదేశ్. ఈ అందాలను కనులారా వీక్షించాలే తప్ప వర్ణించలేం.. సాక్షి, అమరావతి: చారిత్రక సంపద, ప్రకృతి రమణీయత, అతి పొడవైన సముద్ర తీరానికి నెలవైన ఆంధ్రప్రదేశ్.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు సంతరించుకుంటోంది. రాష్ట్రంలో రూ.2,868.60 కోట్ల మేర పెట్టుబడులతో పలు భారీ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే హోటళ్లలో కొత్తగా 1,564 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్ర స్థాయి పెరుగుతుందని చెప్పారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా దీనిపై ఆధారపడే వారికి మెరుగైన అవకాశాలు వస్తాయని అన్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకు రావడంపై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త ప్రాజెక్టులు ఇలా.. ► విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్ విలాస్ బ్రాండ్‌తో రిసార్టులు. ► విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్. ► తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్మెంట్. ► విశాఖపట్నంలో టన్నెల్ ఆక్వేరియం, స్కై టవర్ నిర్మాణం. ► విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్. ► అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. -
పర్యాటక రంగానికి ఏపీ చిరునామా కావాలి
-
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి
-
ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తితో పర్యాటక శాఖకు నష్టం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల 5 స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఇద్దరు పర్యాటక కాంటాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీస్కున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన సముద్రం... అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని.. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలిపారు. లోకల్ టూరిస్ట్‌లకు నాలుగు జోన్లుగా చేస్తున్నామని, జోన్‌కొక మేనేజర్ ఉంటాడని చెప్పారు. -
పర్యాటకం ప్రకాశించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర పర్యాటక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.61.74 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని అన్ని శిల్పారామాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు వాటిని ఆధునికీకరించడానికి పీపీపీ విధానంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కనీసం 6 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా ఏడాది పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో రూ.6 కోట్లతో 3డీ ఎంటర్టైన్మెంట్ జోన్, 5డీ థియేటర్స్‌ను అభివృద్ధి చేస్తోంది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా సముద్ర ప్రాంతంలో జెట్టీల అభివృద్ధితోపాటు, రుషికొండ బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అటవీ శాఖతో కలిసి కనీసం 12 ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. అటవీ ప్రాంతంలో సుందరమైన కాటేజీల నిర్మాణంతో పాటు సఫారీ, ట్రెక్కింగ్ వంటి వసతులు కల్పించనున్నారు. ఎంఐసీఈ టూరిజం కేంద్రాలుగా విశాఖ, తిరుపతి రాష్ట్రంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే విశాఖ, తిరుపతిల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్) టూరిజం ఆకర్షణలో భాగంగా విశాఖ, తిరుపతి నగరాలను అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, సదస్సులకు వేదికగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆ రెండుచోట్ల అంతర్జాతీయ వసతులతో భారీ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చన్నది పర్యాటక శాఖ భావన. సుమారు రూ.6 వేల కోట్లతో ఎంఐసీఈ టూరిజంలో భారత్ ప్రస్తుతం 27వ స్థానంలో ఉంది. ఏటా కనీసం 20 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆదాని సంస్థ సొంతంగా ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించనుండగా, పర్యాటక శాఖ భీమిలి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో భారీ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ ఏటా రాష్ట్రానికి సుమారు 1.70 కోట్ల మంది దేశీయ, విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ఇందులో 15 శాతం మంది అంటే 25 లక్షల మందిని విశాఖ ఆకర్షిస్తోంది. విశాఖ బీచ్‌లు, బొర్రా గుహలు, అరకు, సింహాచల దేవస్థానం వంటివి ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్‌లో భాగంగా రూ.1,200 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా భీమిలి మండలం అన్నవరం వద్ద 200 ఎకరాల్లో భారీ హోటల్స్, రిసార్టుల నిర్మాణం చేపడుతున్నారు. 30 ఎకరాల్లో ఒకటి, 35 ఎకరాల్లో ఒకటి చొప్పున రెండు లగ్జరీ రిసార్టులు, 15 ఎకరాల్లో లగ్జరీ హోటల్, 5 ఎకరాల్లో మినీ గోల్ఫ్ కోర్స్, 60 ఎకరాల్లో బీచ్ అభివృద్ధి చేయనున్నారు. తొట్లకొండ బీచ్ వద్ద పీపీపీ విధానంలో భారీ టన్నెల్ అక్వేరియాన్ని అభివృద్ధి చేయనున్నారు. కైలాసగిరి వద్ద 120 మీటర్ల ఎత్తులో స్కై టవర్, ఆర్కే బీచ్ అభివృద్ధి వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. -
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నామని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం సీఎస్ అధ్యక్షతన ఎకో టూరిజం డెవలప్ మెంట్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధి చేసూ్తనే.. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ అధికారులు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వచ్చే నెల 15వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి ప్రణాళికలతో రావాలని ఆదేశించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ ఎకో టూరిజం అభివృద్ధికి తీసుకోబోయే చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, ఇందులో భాగంగా సీఎస్ చైర్ పర్సన్‌గా టూరిజం డిపార్టుమెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి వైస్ చైర్ పర్సన్లుగా, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో సభ్య కన్వీనర్‌గా, మరో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులతో ఎకో టూరిజం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ రాష్ట్రంలో సుందరమైన అటవీ ప్రాంతాలను గుర్తించి, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఎకో టూరిజం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నా మన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో రిస్టార్టులు, జంగిల్ లాడ్జిల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు పాల్గొన్నారు. -
నిరంతరం రైతన్నకు మేలు
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఆయన శనివారం గుజరాత్లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కాలానుగుణంగా ప్రయత్నాలను మరింత పెంచాల్సి ఉందని మోదీ అన్నారు. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవడానికి అవకాశం కల్పించడం, వేలాది రైతు ఉత్పాదక సంస్థలను సృష్టించడం, మధ్యలోనే ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, పంటల బీమా పథకాన్ని మెరుగుపర్చడం, 100 శాతం వేప పూత యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, సాయిల్ హెల్త్ కార్డులు.. వీటన్నింటి లక్ష్యం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడమేనని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఇలాంటి చర్యలతో రైతాంగానికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. మన రైతన్నలకు మేలు చేసే చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్కడ సౌకర్యాలు కల్పిస్తే.. గుజరాత్ ప్రభుత్వం అమలు చేయనున్న కిసాన్ సూర్యోదయ యోజన(కేఎస్‌వై)ను ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయ రంగానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తారు. గిర్నార్ కొండపై ఏర్పాటు చేసిన రోప్‌వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల ఈ రోప్‌వే రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకుంటుందని అధికారులు చెప్పారు. ఇది ఆసియాలోనే పొడవైన రోప్‌వే. పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని చెప్పారు. ప్రపంచానికి దారి చూపుతున్న భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ఆరో స్థానానికి చేరిందన్నారు. గత ఆరేళ్లలోనే ఈ ఘనత∙సాధ్యమైందన్నారు. ‘ఒక సూర్యుడు.. ఒక ప్రపంచం.. ఒక గ్రిడ్’ విషయంలో ప్రపంచానికి భారత్ దారి చూపుతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. కిసాన్ సూర్యోదయ యోజన కింద వ్యవసాయానికి సూర్యోదయం నుంచి ఉదయం 9.30 గంటలకు వరకు కరెంటు సరఫరా చేస్తారని, దీనివల్ల లక్షలాది మంది రైతుల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పగటి పూటే కరెంటు సరఫరా ఉంటుంది కాబట్టి సూక్ష్మ సేద్యం ప్రారంభిస్తే వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తాయని రైతులకు సూచించారు. -
గండికోట పిలుస్తోంది..
సాక్షి ప్రతినిధి, కడప: గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టింది. భారీగా నిధులు వెచ్చించి సొబగులు అద్దనుంది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తర్వాత సుందరమైన ప్రాంతంగా దీనికి ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వైఎస్సార్ పర్యాటక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ తరహాలో గండికోటలో కూడా రూపుదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు వ్యయమవుందని అంచనా. దీంతోపాటు రూ.7.50 కోట్లతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న రోప్‌వే నిర్మాణాన్ని కూడా పూర్తి చేయనుంది. అత్యాధునిక వసతులతో రిసార్ట్ రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం 13 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ నిర్మాణంతోపాటు ప్రకృతి వైద్యశాల, స్విమ్మింగ్‌ఫూల్ తదితర అన్ని వసతులతో ఈ రిసార్ట్స్ ఏర్పాటు కానుంది. సాహసం శ్వాసగా.. ఇప్పటికే సాహసకృత్యాల అకాడమీ (అడ్వంచర్స్)కి రూ.3 కోట్లతో అన్ని వసతులు సమకూర్చుతున్నారు. ఐదెకరాలలో తరగతులతోపాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. హిమాలయ పర్వతాలలో మాత్రమే ఇలాంటి అకాడమీ ఉంది. అది కూడా అక్కడ పర్వతారోహణపై శిక్షణ మాత్రమే ఇస్తారు. గండికోటలో వాయు, జల, పర్వతారోహణలపై శిక్షణ ఇవ్వనున్నారు. కోటలో ఆర్కియాలజీ విభాగం అనుమతులతో దాల్మియా కంపెనీ దెబ్బతిన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించే పనులను చేపట్టింది. టాయిలెట్ల నిర్మాణంతోపాటు కోట పరిసరాల శుభ్రత పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 2 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేట్టారు. మరో 15 వసతి గృహాలు (టెంట్లు) నిర్మించి ఫ్రీకౌట్ కంపెనీకి లీజుకు ఇచ్చింది. రూ.50 లక్షల ఖర్చుతో బోటింగ్ సౌకర్యం కలి్పంచారు. పచ్చదనం కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కోట ముందు నుంచి టెంట్ల వరకు సిమెంటు రోడ్డు నిర్మించారు. రూ.30 లక్షలతో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పడిపోకుండా రూ.5 లక్షలతో కోట వారగా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో జమ్మలమడుగు క్రాస్ నుంచి గండికోట వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పెట్టుబడికి అనుకూలం.. ప్రభుత్వ ప్రోత్సాహం గండికోట పరిధిలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. తగినంతగా నీరుంది. రోడ్డు వసతి ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్‌పోర్టు ఉంది. సమీపంలోని జమ్మలమడుగులో రైల్వేస్టేషన్ ఉంది. 35 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు పట్టణముంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రాంతం. గండికోట పర్యాటకంగా అభివృద్ధి చెందితే చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుకున్న యువత సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే గండికోటలో వివిధ రకాల అభివృద్ధి పనులలో అవకాశం కల్పించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గండికోటలో పర్యాటకాభివృద్ధి గండికోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. అమెరికాలోని గ్రాండ్ కేనియన్ తర్వాత గండికోట పర్యాటక కేంద్రంగా ఉంటోంది. అత్యాధునిక వసతులు కల్పించి జాతీయ స్థాయిలో మరింత పేరు వచ్చేలా తీర్చిదిద్దుతాం. ఆ దిశగా పనులు వేగవంతం చేశాం. ఇప్పటికే గండికోట ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నాం. –సి.హరి కిరణ్, జిల్లా కలెక్టర్ -
అందాలలో ఆహో మహోదయం..
ప్రకృతి వనరుల సిరిసంపదలు ఓ వైపు.. విశ్వఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరోవైపు.. అంతర్జాతీయ యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక సోయగాలు ఇంకోవైపు... ఇలా.. లెక్కకు మించి ప్రకృతి సంపద సొంతం చేసుకున్న విశాఖ జిల్లా.. పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. గత ప్రభుత్వం ప్రకటించిన అస్తవ్యస్త టూరిజం పాలసీతో విసిగిపోయిన పెట్టుబడిదారులు.. ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టబోయే కొత్త పాలసీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రోత్సాహకాలు.. రాయితీలతో పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేలా పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో కొత్త ప్రాజెక్టులు తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం.. ఆర్థిక, పర్యాటక రాజధానిగా భాసిల్లేందుకు అవసరమైన కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న టూరిజం పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. గత ప్రభుత్వం ప్రకటించిన లొసుగుల పాలసీతో పెట్టుబడులు రాక.. పర్యాటకం చతికిలపడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టూరిజంలో పెట్టుబడులు పెరిగేలా పాలసీని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కొత్త విధానానికి సంబంధించి టూరిజం అధికారులు సమావేశమై.. నూతన పాలసీ గురించి వివరించారు. అయితే ఫ్రెండ్లీ పాలసీగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించడంతో పర్యాటక విధానం ప్రకటించేందుకు మరో వారం రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. వికర్ష నుంచి.. ఆకర్షణ వైపు... టీడీపీ సర్కారు ప్రకటించిన టూరిజం పాలసీ.. పారిశ్రామిక వర్గాలను అంతగా ఆకర్షించలేకపోయింది. 9 మేజర్, 42 సబ్మేజర్ థీమ్స్‌గా మొత్తం 680 ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు రాయితీలతో కూడిన విధానాన్ని ప్రకటించింది. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టు వ్యయాన్ని బట్టి 5 నుంచి 15 శాతం రాయితీతో పాటు, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీపై వందశాతం పన్ను రాయితీ కల్పిస్తామని పేర్కొంది. ఇవేమీ అమల్లోకి తీసుకురాలేదు. పర్యాటక ప్రాజెక్టుకు 21 రోజుల్లో అనుమతి ఇచ్చేలా సింగిల్ డెస్క్ విధానాన్ని అమల్లో తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికి మూడు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తీసుకొచ్చి కేవలం రెండు వారాల్లో అనుమతులిస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యలేదు. అదే విధంగా ఏదైనా సంస్థకు అందించే స్థలం విలువ ఆధారంగా 2 శాతం చొప్పున అద్దె చెల్లించాలనీ, ఆ తర్వాత ఏటా 5 శాతం చొప్పున చెల్లించాలంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిబంధన విధించింది. లీజు ముగిసే సరికి ఈ అద్దె భారీ స్థాయికి చేరుకుంటుందని పారిశ్రామికవేత్తలు పెదవి విరిచారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ..ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. మరో వారం రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన టూరిజం పాలసీ పర్యాటకులతో పాటు పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండబోతోందని అధికారులు చెబుతున్నారు. హోటల్స్.. రిసార్టులతో... జిల్లా చుట్టూ పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పాలసీ.. టూరిజం పాలసీ దాదాపు సిద్ధమయ్యింది. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు కొత్త పర్యాటక విధానంలో మార్పులు చేస్తున్నాం. విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు,పర్యాటక శాఖ మంత్రి -
సాక్షి ఎఫెక్ట్: డొంక కదులుతుంది!
నెల్లూరు (టౌన్): ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నెల్లూరు డివిజన్లో అవినీతి, అక్రమాల డొంక కదులుతోంది. నెల్లూరు డివిజన్ కార్యాలయంలో దివ్యాంగురాలైన సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటన తర్వాత ఇక్కడి కార్యకాలపాలపై సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆ శాఖ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. టూరిజం శాఖ నెల్లూరు డివిజన్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై విచారించి వెంటనే నివేదిక సమరి్పంచాలని ఆ శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ►ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ టూరిజం శాఖ జీఎం సుదర్శన్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయన మూడు రోజులుగా నెల్లూరులో ఉండి దాడి ఘటనకు సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. ►దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ శేషగిరిబాబు జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ నాగరాజకుమారిని నియమించారు. ఈ ఇద్దరి విచారణలతో పాటు అవినీతి అక్రమాలపై మరో కమిటీ ఏర్పాటు కానుండటంతో ఆ శాఖ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అక్రమాలెన్నో.. ఏపీ టూరిజం నెల్లూరు డివిజన్ పరిధిలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ►ప్రధానంగా ఆ శాఖకు సంబంధించి హోటళ్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు కొనుగోళ్లు, గదుల బుకింగ్‌లో జరిగిన లొసుగులు, తడ హరిత హోటల్లో జరిగిన విందు తదితర అంశాలపై విచారణ జరగనుంది. ►ఆ శాఖ పరిధిలో జరిగిన కాంట్రాక్ట్ పనులు, వాటిల్లో నాణ్యత తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. ►ఈ నేపథ్యంలో కొనుగోళ్లన్నీ అకౌంట్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగాయా లేక సొంతంగా జరిగాయా అనే విషయాన్ని నిగ్గు తేల్చనున్నారు. ►బోటింగ్ యూనిట్లు నిర్వహణపైన విచారణ కమిటీ ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ►హోటల్ గదుల బుకింగ్‌కు సంబంధించి గతంలో పలు అక్రమాలు చోటు చేసుకున్న సందర్భంలో బాధ్యులను బదిలీలతో సరిపెట్టారు. ►ఇప్పుడు వాటి గుట్టును కూడా విచారణ కమిటీ వెలికి తీయనుంది. ►మరొక వైపు నెల్లూరు హరితా హోటల్ ఆవరణలోని డివిజన్ కార్యాలయంలో నెలకొన్న విభేదాలు, వర్గపోరుపైన విచారణ కమిటీ దృష్టి పెట్టనుంది. ►గతంలో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేయడం, మరో ఉద్యోగి సహచర ఉద్యోగినిపై కుర్చీ విసరడానికి దారి తీసిన పరిస్థితి, కార్యాలయంలో క్రమశిక్షణ పరిస్థితులపై విచారణ కమిటీ ఆరా తీయనుంది. ►విజిలెన్స్, డివిజనల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారుల కదలికలను యూనిట్ల మేనేజర్లు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారిస్తే గుట్టు మొత్తం బయట పడుతుందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ►ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గతంలో తిరుపతికి బదిలీ చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి నెల్లూరుకు వచ్చి నెల్లూరు డివిజన్ మొత్తాన్ని శాసిస్తున్నాడు. సాక్షి కథనాలతో కలకలం ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలను సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ శాఖలో కలకలం రేగుతోంది. విచారణ జరిగితే ఎవరెవరికి ముప్పు ఉందో అనే అంశంపై ఆ శాఖ ఉద్యోగులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తడలో హరిత హోటల్లో జరిగిన విందుపై డివిజనల్ మేనేజర్ తూతూ మంత్రంగా విచారణ చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ►అప్పట్లో బాధ్యుడైన అధికారిని సస్పెండ్‌తో సరిపెట్టగా కేవలం రెండు నెలల్లోనే తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని చిత్తూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంబంధిత తడ హోటల్ మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. ►గతంలో నెల్లూరు డివిజన్ కలిసి ఉన్న తిరుపతి డివిజన్లోని హార్స్లీ హిల్స్‌లోని హరితా హోటల్లో గదుల బుకింగ్‌లో జరిగిన మాయాజాలం, కడప, తిరుపతిల్లో ప్రొవిజన్స్ కొనుగోళ్లు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారించి నివేదిక సమరి్పచినా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ►అయితే ఈ నివేదికలపై కూడా ప్రస్తుత ఎండీ ప్రవీణకుమార్ విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది. ►విచారణ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
పర్యాటకానికి రాష్ట్రం పర్యాయ పదం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ పర్యాయ పదం కావాలని, ఇందుకు అనుగుణంగా వెంటనే కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ దిశలో టూరిజమ్ ట్రేడ్ రెగ్యులేషన్ ప్రక్రియ కొనసాగాలని, పర్యాటకానికి సంబంధించిన అన్నింటి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్దేశించారు. విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలన్నారు. మన పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిపాదనలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని శిల్పారామాలను పునఃసమీక్షించాలని, వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కొత్త టూరిజమ్ పాలసీ ► ఈ ఏడాది మార్చి 31తో రాష్ట్రంలో పర్యాటక విధానం ముగిసినందున వెంటనే కొత్త విధానాన్ని రూపొందించాలి. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ పర్యాయ పదం అనే దిశలో కొత్త విధానం ఉండాలి. రెగ్యులేషన్ ఆఫ్ టూరిజమ్ ట్రేడ్ ► పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్ల వెంటనే అన్నింటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► పర్యాటక రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజమ్ అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, ఆయా చోట్ల ఉన్న సదుపాయాలు వంటి అన్నింటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలి. శిల్పారామాల అభివృద్ధి ► రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న శిల్పారామాలను పునఃసమీక్షించాలి. వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలి. వాటిలో పదే పదే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ దిశగా వాటి అభివృద్ధితో పాటు అవసరమైన మార్పులు చేయాలి. ► సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 7 స్టార్ సదుపాయాలు ఉండాలి ► విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే అన్ని చోట్ల 7 స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేయాలి. ► రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇచ్చి, వారి ప్రతిపాదనలను కూడా తీసుకోవాలి. ఆ తర్వాతే దేన్నైనా ఖరారు చేయాలి. ► పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు వచ్చేలా విధి విధానాలు ఉండాలి. కనీసం 10–12 ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల పూర్తి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలి. ► రాజస్థాన్‌కు ఎక్కువ మంది టూరిస్టులు ఎందుకు వెళుతున్నారని పరిశీలిస్తే అక్కడ పెద్ద పెద్ద హోటళ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయి. అందువల్ల అదే స్థాయిలో రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాల్లో మంచి వసతులతో హోటళ్లు ఏర్పాటు కావాలి. ► ప్రస్తుతం ఏయే జిల్లాలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి..5 స్టార్ ఎన్ని? 4 స్టార్.. 3 స్టార్.. 2 స్టార్.. సింగిల్ స్టార్ హోటళ్లు ఎన్నున్నాయో గుర్తించి వాటిని మ్యాపింగ్ చేయాలి. వాటి వివరాలు టూరిస్టులకు అందుబాటులో ఉంచాలి. -
ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్‌కు 600 మంది..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. కరోనా వైరస్ కారణంగా మసాజ్‌లకు పేరొందిన తైపీస్ మసాజ్ పార్లర్ కస్టమర్లు లేక వెలవెలబోతుంది. ఈ పార్లర్‌ను తైవాన్ సరిహద్దులో నెలకొల్పారు. ఈ పార్లర్‌కు రోజు 600 మంది కస్టమర్లు వచ్చే వారని.. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు వస్తున్నారని పార్లర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కస్టమర్లతో ఎంతో సందడిగా తమ పార్లర్ ఉండేదని.. ప్రస్తుతం పార్లర్ లాబీలో ఎవరు లేకపోవడంతో కాలక్షేపం చేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం పర్యాటక రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని.. తమకు కస్టమర్లు లేక తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మసాజ్ పార్లర్ డిప్యూటి జనరల్ మేనేజర్ వాంగ్ జీ క్వాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధి లభించే రంగానికి తమ ఉద్యోగులు ఎంచుకోవాలని జీ క్వాన్ సూచించారు. ఇటీవల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా తైవాన్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పర్యాటక రంగ నిపుణులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ద్వీపం, వైవిధ్యమైన ఆహార అలవాట్లు, ఆసియాలో ఉదారవాద ప్రజాస్వామ్యం తదితర అంశాలు తైవాన్ పర్యాటక రంగ అభివృద్ధికి కీలక అంశాలని తైవాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తైపీస్ మసాజ్ పార్లర్ 24 గంటల పాటు సేవలందించడం విశేషం. జపాన్, దక్షిణ కొరియా పర్యాటకులు ఎక్కువగా పార్లరును సందర్శిస్తుంటారు. అయితే గత 20ఏళ్లుగా తమకు ఈ రంగంలో అనుభవం ఉందని.. ఇప్పుడు వేరే రంగాన్ని ఎంపిక చేసుకొని ఉపాధి పొందడం అంత సులువు కాదని పార్లర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రజనీకాంత్‌పై ట్వీట్, ఫ్యాన్స్ ఆగ్రహం -
టూరిస్ట్ హబ్ కానున్న ప్రకాశం
సాక్షి, ఒంగోలు మెట్రో: ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలున్న జిల్లా పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం అసలు పట్టించుకోని పర్యాటక విభాగాన్ని తొలి ఏడాదిలోనే పట్టించుకుని తొలి విడత మూడు ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విడతల వారీగా జిల్లాలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను గుర్తించి అభివృద్ధి చేసి జిల్లాను టూరిస్ట్ హబ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మూడు ప్రాంతాల ఎంపిక.. జిల్లాలో తొలి విడతగా 2019–20 వార్షిక సంవత్సరానికి గాను మూడు ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం, దాని సమీపంలోని అన్నంగి ప్రాంతంతో పాటు కొత్తపట్నం సముద్రతీరాన్ని కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే శాఖ అధికారులను సర్వే చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. అయితే, ఈ మూడు ప్రాంతాలనూ ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కన్సల్టెంట్స్తో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద బోటు షికారు ఇప్పటికే ఉన్నప్పటికీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. తద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. ఇక గుండ్లకమ్మలో బోటు షికారు కోసం బోట్ల సంఖ్య కూడా పెంచనున్నారు. అన్నంగి ప్రాంతంలో 13 ఎకరాలలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ సహకారంతో అభివృద్ధి చేసి అన్నంగి కొండ మీద ఒంగోలు గిత్త పెద్ద ప్రతిమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశిష్టతను పర్యాటకులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి సర్వే చేసి సూచనలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తపట్నం బీచ్‌లో వసతులు.. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి. సందర్శకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి తీర ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగేట్టు తీర్చిదిద్దనున్నారు.కలెక్టర్ సూచనలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తొలి విడతగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకుల సంఖ్య పెంచటం లక్ష్యంగా తద్వారా పర్యాటక ప్రాంతంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
జిల్లాలో పర్యాటక వెలుగులు
సాక్షి, కడప : జిల్లా పర్యాటకానికి కొత్త ఊపు రానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఖ్యాతి గల గండికోటలో రెండు కొండల మధ్య అద్దాల వంతెన ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో జిల్లా పర్యాటకుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఊహించని రీతిగా సోమశిల ప్రాజెక్టును జల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా జిల్లా పర్యాటక అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇంతకుముందే ఇడుపులపాయను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఉండడంతో జిల్లా నలుమూలల ఇక పర్యాటక వెలుగులు కనిపించనున్నాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాష్ట్ర పర్యాటకాభివృద్దిపై తీసుకున్న నిర్ణయాలలో మన జిల్లాకు సంబంధించి పర్యాటకం అభివృద్ది పథంలో పరుగులు తీయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. అలాగే జిల్లా పర్యాటకాభిమానులు, సంస్థల్లో కొత్త సంతోషం కనిపిస్తోంది. నలు వైపులా.. ఇంతకుముందే ఒంటిమిట్టకు ప్రభుత్వ లాంఛనాలు దక్కడంతో తూర్పు పర్యాటక ప్రాంతం ఇప్పుడు ఇడుపులపాయ అభివృద్ధితో దక్షిణ‡ప్రాంత పర్యాటకం, సోమశిలతో ఉత్తర పర్యాటకం, గండికోటతో పడమర పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. తిరుపతి నుంచి రైల్వేకోడూరు ఉద్యాన పరిశోధన కేంద్రం, రాజంపేటలో కన్నప్ప ఆలయం, అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, నందలూరు సౌమ్యనాథ ఆలయం, బౌద్దారామాలు, ఒంటిమిట్ట వరకు తూర్పు పర్యాటక సర్క్యూట్‌గా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్నాయి. గండికోటలో అద్దాల వంతెన పథకం విజయవంతమైతే పడమర పర్యాటక ప్రాంతాలు కూడా సహజంగా అభివృద్ది చెందగలవు. ఇడుపులపాయతో దక్షిణ పర్యాటక ప్రాంతా లు రాయచోటి, రాక్ గార్డెన్స్, వెలిగల్లు ప్రాజెక్టు, వేంపల్లె గండిక్షేత్రంలకు పర్యాటక కళ రానుంది. సోమశిల అభివృద్ధితో గోపవరం, మొల్లమాంబ జన్మస్థలి, బ్రహ్మంగారిమఠం, బద్వేలు లక్ష్మిపాలెం ఆలయం, వనిపెంట ప్రాంతాలు ఉత్తర విభాగంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న పర్యాటకాభివృద్ది నిర్ణయాలతో జిల్లా నాలుగు వైపుల నాలుగు ప్రత్యేకమైన పర్యాటక సర్క్యూట్లు ఏర్పడినట్లయింది. ఇవి అభివృద్ది చెందడం ప్రారంభమైతే జిల్లా అంతటా పర్యాటకుల సందడి నెలకొంటుంది. దీని ద్వారా జిల్లాకు ఆర్థిక ఆదాయం కూడా లభించనుంది. పెరగనున్న ప్రతిష్ఠ గండికోటకు అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా ఇండియన్ గ్రాండ్ క్యానియన్‌గా పేరుంది. ఇప్పటికే నాలుగుమార్లు వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంతో ఈ ప్రదేశానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్లుగా వారాంతాలలో హరిత పర్యాటక హోటల్లో గదులు లభించని పరిస్థితి ఉంది. ఇప్పుడు గండికోట పెన్నా ప్రవాహంపై అద్దాల వంతెన ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించగానే జిల్లా పర్యాటక అభిమానులు, అభివృద్ధి సంఘాలు, పర్యాటక అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు జిల్లా పర్యాటకానికి పట్టాభిషేకం చేయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దికి నిధుల కొరత ఉన్న విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చినా ఈ విషయంగా ముందడుగు వేయాలని ఆయన సూచించడం పర్యాటక రంగ అభివృద్దికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారని స్పష్టమవుతోంది. -
‘టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌ని నియమిస్తాం’
సాక్షి, అమరావతి : రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశాడని, బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.220 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అతిథిని దేవుడిలా భావించే పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి ఆదాయాన్ని పెంచుతాం. టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్, మంచి భాష ఉన్న గైడులను నియమించే యోచనలో ఉన్నాం. ఈ శాఖలో జరిగిన అవినీతిని వెలికితీస్తాం. భూములు తీసుకుని పెట్టుబడులు పెట్టని వాళ్ళ ఒప్పందాలు రద్దు చేస్తాం. నూతన ప్రభుత్వం వచ్చి పది రోజులైనా కాకముందే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి తావులేకుండా పాలన సాగించి చంద్రబాబు అవినీతిని ప్రజల ముందుంచుతాం’ అన్నారు. -
ఉత్తుత్తి వాగ్దానాల బాబు !
సాక్షి,అవనిగడ్డ : సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ‘ఏటిమొగ – ఎదురుమొండి మధ్య కృష్ణా నదిలో రూ.74 కోట్లుతో వారధి నిర్మిస్తాం.. చుక్కల భూములు, కండిషన్ పట్టాల భూముల సమస్య పరిష్కరిస్తాం.. ఇలా దివిసీమ వాసులకు ఇచ్చిన మరెన్నో హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపై రాతలుగా మార్చేశారు. ప్రతి సారీ మాట తప్పి నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎదురుమొండి వారధి ఏమైంది? గత ఏడాది నవంబర్ 21వ తేదీ ఉల్లిపాలెం, చల్ల పల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల సమయం ఉన్నా ఈ విషయంలో.. ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం పట్ల దీవుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2008లో రూ.45 కోట్లతో వారధి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నిధుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన మరణం అనంతరం వీటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వారధి నిర్మిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి శూన్యం పవిత్ర కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం ప్రాంతం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2017లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా సాగర సంగమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి సాగర సంగమాన్ని ప్రత్యేక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, కూచిపూడి, శ్రీకాకుళం, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవిలను కలుపుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు. చుక్కలు చూపిస్తున్నారు దివిసీమలోని పలు మండలాల్లో కండిషన్ పట్టా భూములు రైతులకు చుక్కలు చూపిస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై దివి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో కండిషన్ పట్టా (సీపీ పట్టా), చుక్కల భూములు 34 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఐదారు తరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతున్న భూములే అయినప్పటికీ కండిషన్ పట్టా లిస్టులో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో పొలాలను అమ్ముకునేందుకు వీలు పడక, అప్పుల పాలవుతున్నారు. రక్షణ కేంద్రం ఏర్పాటయ్యేనా? దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పలు అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ అంటకాగిన నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోగా, టీడీపీ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక పలు అనుమతులు రావడం కొసమెరుపు సీఎం దివిసీమకు ఇచ్చిన హామీలు కోడూరు పీహెచ్‌సీని 24 గంటల వైద్యశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరచిపోయారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో లింగన్నకోడు, ఇరాలి, రత్నకోడుపై చెక్‌డ్యాంలు (రబ్బర్ డ్యాంలు) నిర్మిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీ చేశారు. విజయవాడ – మచిలీపట్నం నాలుగులైన్లకు ఉల్లిపాలెం వారధిని అనుసంధానం చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు. కేరళను తలదన్నే ప్రకృతి సుందర ప్రదేశమున్న దివిసీమను రాజధానిలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపానపోలేదు. రూపాయి బోనస్ ఇవ్వలేదు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఆరు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నీట మునిగి దెబ్బతింది. మొక్కజొన్న తడిసిందని క్వింటాల్‌కు రూ.150 తగ్గించి కొన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.6 వేలు నష్టపోయాం. క్వింటాల్‌కు రూ.200 బోనస్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఏడాది అయినా ఇంతవరకూ ఒక్క రైతుకు రూపాయి బోనస్ ఇవ్వలేదు. – గాజుల రాంబాబు, రైతు, బందలాయిచెరువు -
తీరానికి కొత్త హారం
విశాఖ సుందరి మెడలో పచ్చల హారంలా భాసిల్లుతున్న సాగర తీరం కొత్త నగిషీలు అద్దుకోనుంది. ఇప్పటికే దేశ, విదేశాల టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తున్న తీరంలో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల తీరం వెంబడి సుందరీకరణ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.150 కోట్లు వెచ్చిస్తున్నారు. జీవ వైవిధ్యంతోపాటు పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా పలు ప్రాజెక్టులకు అధికారులు రూపకల్పన చేశారు. 15 రోజుల్లో తుది మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తారు. అనంతరం దానిపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయానికి అవకాశం కల్పిస్తారు. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కార్యాచరణ ప్రారంభిస్తారు. విశాఖ సిటీ : విశాఖ నగరానికి మణిహారమైన సువిశాల సాగర తీరం సరికొత్తగా కనువిందు చేయనుంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకూ బీచ్‌లో విభిన్నతలు సంతరించుకునేలా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. జీవీఎంసీ, వుడా సహా పలువురు స్టేక్ హోల్డర్ల నేతృత్వంలో ఏపీడీఆర్‌పీలో భాగంగా రూ.150 కోట్లతో విశాఖ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. నాలుగు జోన్లుగా జరగనున్న అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై ప్రజల అభిప్రాయాలు సైతం సేకరించిన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ విశాఖ నగరికి పర్యాటక మణిహారం సుందర సాగర తీరం. ఇప్పటికే అనేక సందర్శన స్థలాలు, అంతర్జాతీయ స్థాయి సబ్‌మెరైన్, యుద్ధ విమాన మ్యూజియాలతో భాసిల్లుతున్న బీచ్‌కు సరికొత్త అందాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీపీఆర్)లో భాగంగా బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ, వుడా సిద్ధమయ్యాయి. హుద్‌హుద్ సమయంలో విశాఖ సముద్ర తీరం అతలాకుతలమైంది. అప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనులు చిన్నాభిన్నమైపోయాయి. ఈ నేపథ్యంలో బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీడీఆర్పీ ఈ ప్రాజెక్టు అమలుకు సిద్ధమైంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ మొత్తం 30 చదరపు కిలోమీటర్ల వరకూ రూ.150 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం డీపీఆర్‌లు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. గతంలో తీర ప్రాంత అభివృద్ధిలో అనుభవం ఉన్న ఐఎన్ఐ డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్‌కు పూర్తిస్థాయి సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యతని అక్టోబర్ 25న అప్పగించారు. 11.72 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నివేదికను ఐఎన్ఐ ప్రతినిధులు పూర్తి చేశారు. మరో 15 రోజుల్లో దీన్ని ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్ల నాలుగో సమావేశం ఇటీవలే జీవీఎంసీలో జరిగింది. 10 రోజుల్లో చివరి సమావేశం నిర్వహించి బృహత్ ప్రణాళికకు ఓకే చెప్పనున్నారు. అన్ని వర్గాలనూ అలరించేలా.. ఈ ప్రాజెక్టులో భాగంగా సువిశాల తీర ప్రాంతాన్ని విభిన్న రకాలుగా అభివృద్ధి చేయనున్నారు. సహజసిద్ధంగానూ అదే సమయంలో నగర జీవనానికి దగ్గరగానూ ఉండేలా రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా, అన్ని వర్గాల ప్రజలనూ అలరించేలా బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలని ఏపీడీఆర్పీ నిర్ణయించింది. సహజ పర్యావరణానికి, సముద్ర జీవావరణానికి హాని జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో సంప్రదాయ మత్స్యకారుల జీవనానికి వి«ఘాతం కలగకుండా చూడాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టుని 2 విభాగాలుగా విభజించారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాక ప్రజలకు అందుబాటులో ఉంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. అనంతరం 104 వారాల్లో కనస్ట్రక్షన్ మేనేజ్మెంట్ బాధ్యతలను పూర్తి చేయాలని జీవీఎంసీ, వుడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాయి. మాస్టర్ ప్లాన్ వివరాలివీ.. ఆర్కే బీచ్‌లో సౌకర్యాలు మరింత మెరుగు పడనున్నాయి. ప్రత్యేక వాకింగ్ ట్రాక్‌లతో పాటు మరిన్ని విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. వుడా పార్క్‌కు బీచ్‌ను అనుసంధానం చేసేలా ఏర్పాట్లు. బీచ్‌కు వచ్చే పర్యాటకులతో జాలరిపేట స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ సుమారు 10 కి.మీ మేర ప్రత్యేక వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటు. లాసన్స్ బే పార్క్, లుంబినీ పార్క్, తెన్నేటి పార్కులతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల అనుసంధానం. జోడుగుళ్లపాలెం బీచ్‌కు, కైలాసగిరి మార్గానికి అనుసంధానం చేస్తూ తెన్నేటిపార్కుని అభివృద్ధి చేయనున్నారు. సాగర్‌నగర్ బీచ్‌ను అభివృద్ధి చేసి మెరైన్ లైఫ్ పార్క్, ఎండాడ బీచ్‌తో అనుసంధానించనున్నారు. సమగ్ర సౌకర్యాలతో రుషికొండ, మంగమూరిపేట బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఎర్రమట్టి దిబ్బలకు పర్యాటక తాకిడి పెరిగేలా వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి. భీమిలి బీచ్ పునరుద్ధరించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. నాలుగు జోన్లుగా అభివృద్ధి బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకూ జరగనుంది. ఈ ప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నాలుగు జోన్లలో ప్రస్తుతం ఏ విధమైన అభివృద్ధి జరుగుతోంది... ఆ ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేపడితే బాగుంటుందనే అంశంపై సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ముఖ్యంగా స్థానికతకు ప్రాధాన్యమిస్తూ వృక్ష సంపద, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్కుల్లో కొత్తదనం నింపాలని భావిస్తున్నారు. స్థానిక అంశాలను క్రోడీకరించుకొని చేయబోయే అభివృద్ధి కోసం తీరప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి కురుపాం సర్కిల్ వరకూ, కురుపాం సర్కిల్ నుంచి రుషికొండ వరకూ, రుషికొండ నుంచి భీమునిపట్నం మీదుగా కాపులుప్పాడ– రుషికొండ జంక్షన్ వరకూ, భీమునిపట్నం నుంచి కాపులుప్పాడ–రుషికొండ జంక్షన్–భీమిలి బీచ్ వరకూ జోన్ల వారీగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. -
సరిహద్దుల్లో స్నేహగీతం..
వుహాన్: సరిహద్దు అంశాల్లో నమ్మకం, అవగాహన నెలకొల్పే లక్ష్యంతో పరస్పరం సమాచార మార్పిడిని పటిష్టం చేసేందుకు ఇరు దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. భవిష్యత్తులో డోక్లాం తరహా సంఘటనలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య వుహాన్‌లో జరుగుతున్న అనధికారిక సదస్సు చివరిరోజైన శనివారం సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్–చైనా సరిహద్దులకు సంబంధించిన అన్ని అంశాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా విభిన్న రంగాల్లో భారత్–చైనా సహకారంపై దృష్టిసారించామని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమిచ్చే మార్గాలు, ప్రజల మధ్య సంబంధాల్ని పెంపొందించే అంశాలపై మేం చర్చించాం. వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం, పర్యాటక రంగాలపైనా మాట్లాడాం. మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. భారత్, చైనాల మధ్య దృఢమైన స్నేహం రెండు దేశాల ప్రజలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే లాభదాయకం’ అని ట్వీట్ చేశారు. మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు, ఇతర కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 9 గంటల పాటు కలిసి గడిపారని చైనా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. కాగా రెండ్రోజుల చైనా పర్యటన ముగించుకున్న మోదీ భారత్‌కు చేరుకున్నారు. గతేడాది 73 రోజుల పాటు కొనసాగిన డోక్లాం వివాదంతో దెబ్బతిన్న సంబంధాల్ని పునఃనిర్మించే దిశగా శనివారం మోదీ, జిన్‌పింగ్ చర్చలు కొనసాగాయి. ఇరువురి మధ్య అనధికారిక సమావేశం వివరాల్ని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడిస్తూ..‘సరిహద్దు అంశాల పరిష్కారంలో నమ్మకం, పరస్పర అవగాహన నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యాలు సమాచార మార్పిడిని బలోపేతం చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేశారు. నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే ఇరు వైపులా ఆమోదించిన నిర్ణయాల్ని నిజాయతీతో అమలు చేయాలని వారి సైన్యాలను రెండు దేశాల అధినేతలు నిర్దేశించారు’ అని చెప్పారు. సరిహద్దు అంశంలో సముచితం, అంగీకారయోగ్యం, పరస్పర ఆమోదనీయమైన ఒప్పందం కోసం పత్యేక ప్రతినిధుల ప్రయత్నాల్ని మోదీ, జిన్‌పింగ్‌లు ఆమోదించారని గోఖలే తెలిపారు. ఉగ్రవాద నిరోధంలో సహకరించుకుందాం.. ‘శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలకు తగిన పరిణతి, అవగాహన ఉందనే అభిప్రాయంతో ఇరువురు నేతలు ఏకీభవించారు. ఆందోళనలు, ఆకాంక్షలు, సున్నితమైన అంశాల్లో ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలనే విషయాన్ని మోదీ, జిన్‌పింగ్‌లు గుర్తు చేసుకున్నారు. భారత్, చైనాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ ఆసక్తులు ఇమిడి ఉన్నాయని, ఆ అంశాలపై విస్తృత స్థాయి సంప్రదింపుల ద్వారా వ్యూహాత్మక చర్యల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని వారిద్దరు అంగీకరించారు. పరస్పర అవగాహనను పెంపొందించుకునే క్రమంలో ఆ సంప్రదింపులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ, జిన్‌పింగ్‌లు విశ్వసించారు’ అని గోఖలే తెలిపారు. ఉగ్రవాదంతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన ఇద్దరు నేతలు ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిష్పాక్షికంగా సాగాల్సిన అవసరంతో పాటు దానిని కొనసాగించాలని ఇరు నేతలు నొక్కిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంతో సాగాలని మోదీ అభిలషించారు. చైనాకు వ్యవసాయ, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులకున్న అవకాశాల్ని ప్రధాని ప్రస్తావించారు’ అని తెలిపారు. ప్రపంచాన్ని మార్చగల శక్తులుగా.. భారత్, చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగాల్సిన అవసరముందని, పరస్పర విశ్వాసం ఆధారంగా అభివృద్ధి కొనసాగాలని జిన్‌పింగ్ ఆకాక్షించారు. భేటీ వివరాల్ని చైనా ప్రభుత్వ వార్తా సంస్థజిన్హుహ వెల్లడిస్తూ ‘చైనా భారత్‌లు మంచి పొరుగు దేశాలే కాకుండా మిత్ర దేశాలు కూడా.. ప్రపంచాన్ని మార్చగల కీలక శక్తులుగా ఒకరినొకరు పరిగణించుకోవాలి. సానుకూల, న్యాయబద్ధమైన, కలుపుగోలు ప్రవర్తనను తప్పకుండా అలవరచుకోవాలి.అదే సమయంలో పరస్పర ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర సహకారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. భారత్, చైనాలు సన్నిహిత వ్యూహాత్మక చర్చలు కొనసాగించాల్సిన అవసరముంది’ అని మోదీతో చైనా అధ్యక్షుడు తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరుదేశాలు మరింత పరిణతితో విభేదాల్ని పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో సమన్వయం, సహకారం బలోపేతం చేసుకోవాలని.. ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ కోసం కృషిచేయాలని జిన్‌పింగ్ సూచించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఇద్దరు నేతలు వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి, ఆహార భద్రత అంశాలపై కూడా చర్చించారు. చైనాలోని అతిపెద్ద నది యాంగ్జీ, భారత్‌లో అతిపెద్ద నది గంగా నదుల్ని పరిరక్షణలో తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య క్రీడల ప్రోత్సాహం, బౌద్ధ మతం కేంద్రంగా పర్యాటక అభివృద్ధిపై కూడా మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు జరిపారు. మోదీ, జిన్‌పింగ్ బోటు షికారు వుహాన్‌లోని సుందరమైన ఈస్ట్ లేక్ తీరం వెంట మోదీ, జిన్‌పింగ్‌లు శనివారం విహరించారు. తర్వాత బోటు షికారు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. ‘ఈస్ట్ లేక్‌లో బోటు షికారు గుర్తుండిపోయేలా సాగింది’ అని మోదీ ట్వీట్ చేశారు. శాంతి, సామరస్యం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు ఒకే బోటులో షికారు చేశారు అని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. దంగల్ బాగా నచ్చింది: జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా బాగా నచ్చిందట.. గతేడాది చైనాలో దాదాపు 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమాను చూసినట్లు మోదీతో జిన్‌పింగ్ చెప్పారు. గతంలో ఎన్నో భారతీయ సినిమాలు చూశానని, వాటిలో హిందీ, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు ఉన్నాయని చైనా అధ్యక్షుడు చెప్పడం విశేషం. ‘మరిన్ని భారతీయ సినిమాలు చైనాలో, చైనా సినిమాలు భారత్‌లో ప్రదర్శిస్తే బాగుంటుందని జిన్‌పింగ్ ఆకాంక్షించారు’ అని విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. శుక్రవారం తొలిరోజు భేటీ అనంతరం 1982ల నాటి బాలీవుడ్ సినిమా ‘యే వదా రహా’లోని ‘తు హై వహీ దిల్ నే జిసే అప్నా కహా..’ పాటను చైనా వాద్యకారులు వినిపించారు. వుహాన్‌లోని ఈస్ట్‌లేక్ వద్ద సంభాషించుకుంటున్న మోదీ, జిన్‌పింగ్ ఈస్ట్లేక్లోని బోటులో మోదీ, జిన్‌పింగ్ -
ఇక ఫెస్టివల్స్ నిర్వహణ పర్యాటకశాఖకే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ ఫెస్టివల్స్‌ను వచ్చే ఏడాది నుంచి పర్యాటకశాఖే నిర్వహిస్తుందని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదాయం వచ్చే ఈవెంట్లు, పండగలను నిర్వహించడం ఎలా? అన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి జరగనున్న యాటింగ్ ఫెస్టివల్ వివరాలను తెలిపేందుకు సోమవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ జెట్టీ వద్ద ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో 24 ఈవెంట్లకు గాను 18 మాత్రమే నిర్వహించామన్నారు. వచ్చే సంవత్సరం ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో కేలండర్ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందన్నారు. విశాఖలో ఉన్న అందమైన పర్యాటక వనరులను బయట ప్రపంచానికి తెలియజేయడానికి, అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించేందుకు యాటింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు వచ్చే ఆదరణను బట్టి భవిష్యత్‌లో ఇలాంటివి నిర్వహించాలా? వద్దా? అన్నది అధ్యయనానికి వీలుంటుందన్నారు. గోవాలో యాటింగ్ ద్వారా గంటకు రూ.90 వేల నుంచి లక్ష ఆదాయం వస్తుందని, విశాఖలోనూ అలాంటి ఆదరణ ఉంటుందో, లేదో చూస్తామన్నారు. ఫెస్టివల్లో పాల్గొనున్న 9 బోట్లు యాటింగ్ ఫెస్టివల్లో 9 బోట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ ఫెస్టివల్ పూర్తయ్యాక వీటిలో రెండు బోట్లను కొన్నాళ్లపాటు ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ ఉంచుతామని తెలిపారు. అనుమతి కోసం విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో చర్చిస్తామన్నారు. యాటింగ్‌లో పాల్గొనే బోట్లకు రక్షణగా గజ ఈతగాళ్లున్న స్థానిక మత్స్యకారుల బోట్లు ఉంటాయని, అత్యవసర సాయం అందించడానికి నేవీ అంగీకరించిందని చెప్పారు. ఇప్పటివరకు 14 మంది రిజిస్ట్రేషన్ ఇప్పటిదాకా ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు 14 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. యాటింగ్ క్రీడ ఖరీదు కూడుకున్నది కావడంతో ఉన్నత వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే టిక్కెట్టు ఖరీదు రూ.14,500గా నిర్ణయించామన్నారు. అన్ని పర్యాటక ఈవెంట్లను ఈ–ఫ్యాక్టర్ సంస్థకే ఎందుకు కట్టబెడుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ టూరిజం ఎంప్యానల్ అయినందును ఈ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు. ఈ యాటింగ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన సొమ్మును మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఈ–ఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి సుమీత్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ యాచింగ్ ఫెస్టివల్లో వివిధ అడ్వెంచర్ ఈవెంట్లతో పాటు ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి లక్కీ డ్రా తీస్తామన్నారు. విజేతలకు ఒకరోజు యాచ్‌ల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ ఈడీ డి.శ్రీనివాసన్, జిల్లా పర్యాటకాధికారి పూర్ణిమదేవి, ఈఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి ముఖర్జీ పాల్గొన్నారు. -
పర్యటకశాఖాధికారులపై కలెక్టర్ ఫైర్
కాకినాడ రూరల్: కాకినాడ వాకలపూడి బీచ్‌లో స్వదేశ్దర్శన్ పథకం కింద రూ. 45 కోట్లతో చేపడుతున్న పనుల్లో నాణ్యతాలోపం కొట్టవచ్చినట్టు కనిపిస్తోందని, పనులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవంటూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, పర్యాటకశాఖాధికారులతో కలసి శనివారం ఆయన బీచ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫౌంటెన్, ల్యాండ్ స్కేపింగ్, షాపింగ్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ హాలు, లేజర్‌షో, ఏసీ థియేటర్ పనులను ఆయన పరిశీలించారు. ల్యాండ్ స్కేపింగ్ పనులు మందకొడిగా జరుగుతుండడం, ఆ పనులు కూడా సక్రమంగా లేకపోవడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 10 నాటికి అన్ని పనులు పూర్తికావాలన్నారు. బీచ్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏఏ షాపులు ఏర్పాటు చేస్తున్నారని పర్యాటకశాఖ ఆర్డీ జి. భీమశంకరాన్ని ప్రశ్నించగా ఆయన సరిగా బదులివ్వలేదు. అక్వేరియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడంతో అతనిని పిలిపించండని ఆదేశించారు. దాంతో వచ్చిన వ్యక్తిని అక్వేరియం ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడగగా తనకు ఏమీ తెలియదని, భీమశంకరం రమ్మంటే వచ్చానని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భీమశంకరాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ లైటింగ్‌కు ఏర్పాటు చేసిన స్తంభాలు తుప్పపట్టి ఉండడంతో విద్యుత్‌శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్‌లో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్తంభాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 19, 20, 21 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ప్రారంభం రోజునముఖ్య మంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. సామర్లకోట, కాకినాడ నగరం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుచేయాలన్నారు. ప్రముఖులు నేరుగా సభాస్థలికి రావడానికి వీలుగా ప్రత్యేక మార్గం కేటాయించాలన్నారు. బీచ్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున నోడల్ అధికారిగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 21న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరవుతారని ఆయన సమక్షంలో జరిగే రాక్ డ్రమ్స్ ప్రదర్శన ఎంపిక జాతీయ స్థాయిలో జరుగుతుందన్నారు. అనంతరం వాకలపూడి బీచ్ మార్గాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. జేసీ మల్లికార్జున, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు, సమాచారశాఖ డీడీ ఎం ఫ్రాన్సిస్, పర్యాటకశాఖ ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
కంప్యూటరీకరణపై కాలయాపన
- రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం - ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు - పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం సాక్షి, హైదరాబాద్: భారీ ధరలకు కొన్న పడవలను మరమ్మతుల పేరుతో వృథాగా పడేయటం.. రూ.కోట్లు వెచ్చించి నాసికరం పనులతో సౌండ్ అండ్ లైట్ షోలు పడకేసేలా చేయటం.. అడ్డగోలు బిల్లులతో హరిత హోటళ్లలో నిధులు దారి మళ్లించటం.. ఇలా పర్యాటక అభివృద్ధి సంస్థలో అధికారులది ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించి నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించటం ద్వారా కొంతవరకు పరిస్థితిని అదులోపులోకి తెచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కౌంటర్లను కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ మురగబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల పేరుతో కాలయాపన పర్యాటకుల టూర్ బుకింగ్స్, వివిధ ప్రాం తాల్లో సౌండ్ అండ్ లైట్ షో టికెట్ల విక్రయం, హోటళ్ల లెక్కలకు సంబంధించిన కీలక విషయాల్లో కంప్యూటరీకరణ సరిగా లేదు. దీంతో కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం 2015లో రూ.రెండున్నర కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో సంబంధిత పనులు చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్.. టెండర్ల పేరుతో కాలయాపన చేసింది. ఓసారి టెండర్లు పిలవగా, కేవలం ఒకే బిడ్ దాఖలైందన్న కారణంతో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత అదే తరహాలో మరోసారి రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలిచి.. పనులు మొదలుపెట్టినా కొలిక్కి తేలేక పోయారు. ఇలా రెండేళ్లపాటు ఆ నిధులను కంప్యూటరీకరణ కోసం ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో నిధులను అసలు లక్ష్యం కోసం ఖర్చు చేయలేదని గుర్తించిన ఆడిట్ విభాగం.. కార్పొరేషన్ వివరణ కోరింది. ఖాళీ బిల్లులతో నిధుల దారి మళ్లింపు రాష్ట్రవ్యాప్తంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేస్తున్నా చాలా చోట్ల పర్యవేక్షణ సరిగా లేక నిధులు దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ బిల్లులను దగ్గర పెట్టుకుని వాటితో నిధులు దారి మళ్లిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల స్వయంగా పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్‌లోని ప్లాజా హోటల్లో అక్రమాల నిగ్గు తేల్చారు. హుసేన్సాగర్ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల వద్ద బోటింగ్ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ప్లాజా హోటల్, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకు కరెంటు ఖాతాలోనే ఉంచటం వల్ల పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ కోల్పోయింది. వేరే పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.లక్షల్లో అదనంగా ఆదాయం సమకూరేదన్న విషయం ఇటీవల ఆడిట్ పరిశీలనతో తేలింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ రెస్టారెంట్ నిర్వహణకు టెండర్లు పిలిచినా సకాలంలో దాన్ని అప్పగించక భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించలేదు. -
నాలుగు సర్క్యూట్లుగా పర్యాటక అభివృద్ధి
కాకినాడ సిటీ : జిల్లాలో పర్యాటక ప్రాంతాలను నాలుగు సర్కూ్యట్స్‌గా విభజించి వివిధ పనులు చేపట్టనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పర్యాటక, అటవీశాఖ అధికారులతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్కూ్యట్స్లో భాగంగా కోనసీమ బ్రాకిష్ సర్కూ్యట్‌లో దిండి, బోడసకుర్రు, ఇతర లంకలను కలుపుతూ పర్యాటక ప్యాకేజీని అమలు చేస్తారని, దీనికోసం అనువైన ప్రాంతాలను గుర్తించాలని తహసీల్దారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండవదిగా అఖండ గోదావరి సర్కూ్యట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని, దీనికోసం ముఖ్యమంత్రి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. దీనిలో భాగంగా కోటిలింగాల నుంచి పుష్కరఘాట్ వరకు విస్తరణ పనులు చేపడతారని, పిచ్చుకలంక అభివృద్ధితో పాటు, హేవ్‌లాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారన్నారు. ధవళేశ్వరం నుంచి కడియం వరకూ ప్రత్యేక బోటు ప్రయాణం వంటి ప్రతిపాదనలు ఈ సర్కూ్యట్‌లో ఉన్నాయన్నారు. మూడో సర్కూ్యట్‌లో కాకినాడ బీచ్– కోరంగి అభయారణ్యం, వాటర్ సోర్సు వంటి పర్యాటక అభివృద్ధి పనులు ఉన్నాయని, నాలుగవ సర్కూ్యట్‌లో ఎకో ఎడ్వంచర్ టూరిజంలో భాగంగా మారేడుమిల్లి అటవీ ప్రకృతి అందాలు, జలపాతాలు వీక్షించే ప్రాంతాలను రూపొందిస్తున్నారన్నారు. ఏజెన్సీలోని భూపతిపాలెం రిజర్వాయర్‌లో ఉన్న ద్వీప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, పాములేరు వద్ద జలక్రీడలు ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మోతుగూడెం జలపాతాలకు రహదారి నిర్మాణం చేపట్టాలని సూచించారు. మారేడుమిల్లిలోని బేంబో చికెన్ వంటి ఆహార పదార్థాలు విక్రయించేవారికి ఒకేచోట కామన్‌గా షాపులు ఉండేలా స్థలం కేటాయించాలని, దీని ద్వారా వారికి మార్కెటింగ్ పెరగడంతో పాటు రోడ్లపై రద్దీ తగ్గుతుందన్నారు. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖల అధికారులతో ఈనెల 21న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్‌కు సూచించారు. కోరంగి అభయారణ్యంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో మెకనైజ్డ్ బోట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ ఆర్డీ భీమశంకర్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో ప్రభాకరరావు, పర్యాటకశాఖ ఈఈ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధి గాలికి!
సాక్షి, హైదరాబాద్: ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పైసా ఖర్చు చేయని ప్రభుత్వం ఇతర దేశాల్లో రోడ్‌షోల పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. బుద్ధుడి పేరిట టూరిజం ప్రాముఖ్యతను విదేశాలకు విస్తరించి వారిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త విధానాన్ని రూపొందించింది. నెలకు ఒక దేశాన్ని ఎంచుకొని ఆయా దేశాల్లో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి రోడ్‌షోలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా చైనా, జపాన్ దేశాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో కూడిన ఒక ప్రతినిధి బృందం వెళ్తోంది. విదేశీ పర్యాటకులు రాష్ట్రంలో ప్రత్యేకించి చూడదగ్గ ప్రాంతాలు లేకపోయినా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇతర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తుండాన్ని కొందరు అధికారులే తప్పు పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు ఒక శాతం కూడా వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. పర్యాటక రంగాల అభివృద్ధికి నిధుల లేమి.. రాష్ట్రంలో ప్రధానమైన 54 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి ఇందుకోసం అనేక ప్రోత్సాహకాలతో ప్రణాళికలను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిలో తొమ్మిది పర్యాటక ప్రాంతాలను తక్షణం అభివృద్ధి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సాగర తీరాలు, జలాధార, ఎకో, బౌద్ధ, మత, వారసత్వ, వినోదం, సాహస, ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైద్య పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా వాటి కోసం ప్రత్యేకించి నిధులు విడుదల చేయలేదు. పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నా నిధులు లేని కారణంగా అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు టూరిజంపై నిర్వహించిన ప్రతి సమీక్ష సమావేశంలోనూ చెబుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ముఖ్యంగా సాగరతీరంలో ఆహ్లాద థీమ్ పార్క్, వాటర్ వరల్డ్, నౌకాయానం, వినోద పార్కులు, మెరైన్ టూరిజం లాంటి పార్కులు ఎక్కడా లేవు. ఇలాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రచారం కోసం విదేశాల్లో రోడ్‌షోల నిర్వహణకు, ప్రచారం కోసం హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. మొక్కుబడి కార్యక్రమాలు మినహా పర్యాటక అభివృద్ధి సుస్థిరం కావడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తీర ప్రాంత పర్యాటకాన్ని వివిధ ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తే లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా పట్టించుకోవడం లేదు. -
చందంపేటలో... రమణీయ సోయగాలు
పచ్చని చీరను పరుచుకున్నట్టున్న కొండలు.. కొండల నడుమ జాలువారే జలపాతాలు.. పురాతన ఆలయాలు.. శివలింగాలను నిత్యం అభిషేకించే జలధారలు.. వేల ఏళ్ల క్రితం నాటి సమాధులు.. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దేవరచర్ల, వైజాగ్ కాలనీ ప్రాంతాల్లోని అందాలివి. ఇంతేకాదు ‘అరకు లోయ’ను తలపించే సోయగాలు.. బొర్రా గుహలను తలపించే గాజుబిడం గుహలు.. వేల ఏళ్లనాటి ఆలయ అద్భుతాలను ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. చుట్టూ కొండలు.. పచ్చని అందాలు.. జలపాతాలు * బొర్రా గుహలను తలపిస్తున్న గాజుబిడం గుహలు * పురాతన ఆలయాలు.. నల్లమల అడవి సొబగులు * పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిన అధికారులు దేవరకొండ/చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం దాదాపుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. వైశాల్యంలో చాలా పెద్దదైన ఈ మండలం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏరాటైన తర్వాత పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కూడా. ఈ నేపథ్యంలో దేవరచర్లలోని ప్రకృతి అద్భుతాలను, అక్కడి రమణీయ దృశ్యాలను, జలపాతాల గురించి ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు దేవరచర్లను సందర్శించారు. అక్కడి అద్భుతాలను తెలంగాణ ‘అరకు’గా అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల డిమాండ్లతో అధికారులు... ఇటీవల ఇక్కడి మరిన్ని ప్రాంతాలను సందర్శించి, ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లుగా వెలుగులోకి రాని ఎన్నో రమణీయ ప్రదేశాలు అక్కడ ఉన్నాయని.. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతం అనువుగా ఉందని వారు పేర్కొన్నారు. కాచరాజుపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మధ్యలోని గుట్టల్లో ఉన్న గాజు బిడం గుహలను పరిశీలించారు. బొర్రా గుహలకు ఇవి ఏమాత్రం తీసిపోవని గుర్తించారు. అంతేకాదు బొర్రా గుహల్లో మామూలుగా రాతి కట్టడం మాదిరిగా ఉండగా గాజుబిడం గుహల్లో మాత్రం ఎరుపు, ఆకుపచ్చ మిళితమైన రంగుల్లో ఉండడాన్ని గుర్తించారు. ఆ గుహలకు ఎంతో విశిష్టత ఉందని, పురావస్తుశాఖ అధికారులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దేవరచర్లలో ఉన్న శివలింగంతో పాటు చందంపేట పరిసర ప్రాంతాల్లో 9 గుట్టల పరిధిలో పురాతనమైన ఆలయాలున్నట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు. అక్కడి నుంచి కృష్ణానదిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమయంలో ముంపునకు గురైన ఏలేశ్వరం గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణా నదిలోని ఓ దీవిలో ఉన్న మల్లన్న, మల్లప్ప దేవాలయం గురించి తెలుసుకున్నారు. అభివృద్ధి చేయాల్సి ఉంది.. దేవరచర్ల, వైజాగ్ కాలనీలో గుర్తించిన అంశాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ శివాజీ చెప్పారు. కృష్ణానదిలో ఉన్న పలు దీవులను పరిశీలించిన వారు.. అవి పాపికొండలను తలపించే మాదిరిగా ఉన్నాయని అభివర్ణించారు. అరకును మించిన సోయగాలు చందంపేట ప్రాంతంలో ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశక్యత ఉందని పేర్కొన్నారు. కాగా.. దేవరచర్లలో ఉన్న పురాతన ఆలయాలు, ప్రకృతి అందాల విషయమై తన దృష్టికి వచ్చిందని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు నివేదిక తయారు చేశారని హోంమంత్రి నాయిని ఇటీవల దేవరకొండలో పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు. -
పర్యాటక శోభ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు.. చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఇక పర్యాటకశోభ సంతరిం చుకోనుంది. జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.99.86కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం సర్క్క్యూట్‌గా స్వదేశ్ దర్శన్ మిషన్ పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి పర్యాటక రంగానికి వన్నె తెచ్చేందుకు సంకల్పించింది. జిల్లాలోని ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్వదేశ్ దర్శన్ మిషన్ డెరైక్టరేట్ కమిటీ ఈ నెల 19న ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ పర్యాట క సంస్థ ప్రతిపాదనల మేరకు పర్యాటకులను అన్నిరకాలుగా ఆకర్షించేందుకు అ నువైన ప్రదేశాలు ఎంపిక చేసి వాటిలో ప ర్యాటకులకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. కొ ల్లాపూర్ సమీపంలోని సోమశిల నదికి స మీపంలో ప్రకృతి అందాలను పర్యాటకులను అక్కడ సకల సదుపాయాలు కల్పిం చాలని అలాగే బోటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 12.72కోట్లు కేటాయించింది. అలాగే కొ ల్లాపూర్ సమీపంలోని సింగోటం రిజర్వాయర్‌గా ఉన్న శ్రీవారి సముద్రం చెరువు ను పర్యాటకుల కంటికింపు కలిగే విధం గా తీర్చిదిద్దడానికి రూ.10.12 కోట్లు కేటాయించింది. శ్రీశైలంకు సమీపంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న అక్క మహాదేవి ప్రాంతాన్ని రూ.6.27 కోట్లతో పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉమామహేశ్వరం ప్రాంతా న్ని బేస్ క్యాంప్ సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ.18.12కోట్లు కేటాయిం చింది. వీటితో అక్కడ ట్రెక్కింగ్ పర్యాటకుల కోసం నడకదారులు ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అలాగే అచ్చంపేట నియోజకవర్గంలోని ఫరహాబాద్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అక్కడ సైక్లింగ్, ట్రెక్కింగ్, పర్యాటకులు నివాసముండేందుకు వసతులను ఏర్పాటుచేసేందుకు రూ.12.47 కోట్లను మంజూరు చేసింది. అలాగే మల్లెలతీర్థానికి రూ.14.89 కోట్లను మంజూరు చేసింది. ఈగల పెంటలో ఓపెన్‌ఎయిర్ థియేటర్ నిర్మాణానికి సుమారు రూ.15.94 కోట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో పర్యాటకరంగం దశ తిరిగే అవకాశం ఉంది. -
పర్యాటకానికి కేటాయింపులేవీ?
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గారి మాటలకీ, చేతలకీ హస్తిమశకాంతరమంత తేడా ఉంటుందని అందరికీ తెలుసు. రాజ ధాని విషయంలో ఆయనగారు చేస్తున్న ప్రగల్భాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. పర్యాటక రంగానికి ఆయన కేటా యింపులు చూస్తే ఎవరికైనా మతిపోక తప్పదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు మిగిలిన 13 జిల్లాల్లో చారిత్రక ప్రాధాన్యం కలి గిన ప్రదేశాలు 277 ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించినది కేవలం 30 లక్షలు. ఆ సొమ్ము ను 277 చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు సమానంగా విభ జిస్తే ఒక్కొక్కదానికి కేవలం రూ.10,830లు మాత్రమే వస్తాయి. ఇంత తక్కువ సొమ్ముతో పర్యాటక అభివృద్ధి ఏ స్థాయిలో చేయా లని కలలు కంటున్నారో మరి. హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు మార్పులు, చేర్పులు, హంగుల కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారని ప్రచార సాధనాలు కోడై కూస్తున్నాయి. రాష్ట్రంలోని వందలాది చారిత్రక వారసత్వ ప్రదేశాల రక్షణకు కేవలం 30 లక్షల రూపాయలు సరి పోతాయి కానీ, నారా చంద్రబాబు నాయుడి గారి ఆఫీసును తీర్చి దిద్దడానికి 50 కోట్లు కావాలట. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి ఇంతకంటే సరైన నిదర్శనం ఏం కావాలి? - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు -
టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాను టూరిజం హబ్‌గా తయారు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చారిత్రాత్మక సంపద ఉందని, దానిని పరిరక్షించాలన్నారు. ఈ జిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లన్నారు. నేడు ఎన్నో దేశాలు టూరిజం ద్వారా అభివృద్ధి జరిగాయన్నారు. అదే తరహాలో రాష్ట్రంలో టూరిజం, వ్యవసాయం, పరిశ్రమలను ప్రోత్సహించేం దుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. టూ రిజం హబ్ కోసం పూర్తిస్థాయి ప్రణాళికలుంటేనే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర టూరిజం మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి నిధులు తేలేదని అన్నారు. ఎంపీ కింజరాపు రామమ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న టూరిజం ప్రాంతాలకు విద్యార్థులకు తీసుకెళ్లి చూపించాలని కోరారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. డచ్ బంగ్లాను మ్యూజియం తయారు చేస్తున్నట్లు చెప్పారు. విజేతలు వీరే... ఈ సందర్భంగా నిర్వహించిన వక్త్వత్వ పొటీలలో సీనియర్స్ విభాగంలో ఎం.కుసుమ కుమారి, ఎస్.సాయిమాధురి, సీహెచ్ సుకన్య, జూనియర్స్‌లో జి.అలేఖ్య, టి.స్వాతి వరుసగా మొదటి మూడు బహుమతులను సాధించారు. వ్యాసరచన పోటీలో ఎం.కుసుమ కుమారి, ఎస్.సాయిమాధురి, ఎం.శ్రీదేవి, జూనియర్స్‌లో జేవీ శ్రీవిద్య, ఆర్.ఉషా సాయికిరణ్, ఎల్.భార్గవనాయుడు వరుసగా మొదటి మూడు బహుమతులు పొందారు. చిత్రలేఖనం జూనియర్స్‌లో డి.దీపిక, ఎం.అపురూప్ సిద్దార్థ, సీనియర్స్‌లో పొందూరు శ్రీను, కె.పవన్‌కుమార్ మొదటి రెండు బహుమతులను సాధించారు. వీరికి అతిథులు బహుమతులు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. రఘుపాత్రుని శ్రీకాంత్ నృత్య దర్శకత్వంలో విశ్వ వినాయక నృత్య గీతం, ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించే థీమ్ సాంగ్ నృత్యాన్ని చిన్నారులు ప్రదర్శించారు. జాతీ యస్థాయి గుర్తింపు పొందిన విశాఖకు చెందిన బొట్టా నాగేశ్వరరావు మాట్లాడేబొమ్మ ప్రదర్శన, ఎస్‌ఎంపురానికి చెందిన గొంటి జ మ్మయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తప్పెటగుళ్ల ప్రదర్శనలు నిర్వహించారు. విజయనగరం శ్యాం కుమార్ ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా పర్యాటక కేంద్రాల ఫొటో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్, ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం పదునెక్కాలి
సాక్షి, ఏలూరు : జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు ఆదేశాలిచ్చారు. విజయవాడలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల ప్రథమ సమావేశంలో ముఖ్యమంత్రితో కలెక్టర్ భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయూలని, అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల పెంపకాన్ని విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని పథకాలకు, కార్యక్రమాలకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. పతి ఇంటినుంచి ఒక మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్ మ్యాపింగ్‌ను ఉపయోగించుకుని సర్కార్ భూములను కాపాడటంతోపాటు, కొత్త సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూములను సిద్ధం చేయూలన్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని తీసుకుని నిరుపయోగంగా ఉంచిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా అక్షరాస్యతను మెరుగుపరచాలని, గర్భిణి, శిశు మరణాలను నివారించడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. యువతలో వృత్తి నైపుణ్యత మెరుగుపరచడానికి పథకాలను రూపొందించాలని, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ముఖ్యంగా సేవల రంగాన్ని విస్తరించడానికి చర్యలు చేపట్టాలనిఆదేశించారు. అభివృద్ధిలో సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని (ఐటీ) పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. సమష్టిగా అభివృద్ధి సాధిస్తాం: కలెక్టర్ సమష్టి కృషితో జిల్లాలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఆవశ్యకత, కేంద్ర సంస్థల ఏర్పాటుకు గల అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ భూముల లభ్యత, వ్యవసాయ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేసినట్లు కలెక్టర్ వివరించారు. -
పర్యాటక అభివృద్ధికి రూ.10 కోట్లు
ఏలూరు రూరల్ :జిల్లాలో రూ.10 కోట్లతో చేపట్టే పర్యాటక అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోదావరి పర్యాటక సర్య్కూట్, కొల్లేరు పర్యాటక సర్య్కూట్, దేవాలయాల పర్యాటక సర్య్కూట్లుగా వేర్వేరు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొల్లేరు అందాలను పర్యాటకులు తిలకించేందుకు వీలుగా ఏలూరు నుంచి కృష్ణా జిల్లాలోని ఆటపాక వరకూ టూరిస్ట్ బస్సు నడపాలన్నారు. కొల్లేరులో బోట్లు, కొత్తదనంతో కూడిన రిసార్ట్లు నిర్మించాలన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, రిసార్టులు, బోటు షికారు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలను భక్తులే కాకుండా పర్యాటకులు కూడా దర్శించేలా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. వీటితోపాటు ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రవిసుభాష్, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, సెట్వెల్ సీఈవో సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు పాల్గొన్నారు.