
సాక్షి, అమరావతి : రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశాడని, బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.220 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
‘అతిథిని దేవుడిలా భావించే పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి ఆదాయాన్ని పెంచుతాం. టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్, మంచి భాష ఉన్న గైడులను నియమించే యోచనలో ఉన్నాం. ఈ శాఖలో జరిగిన అవినీతిని వెలికితీస్తాం. భూములు తీసుకుని పెట్టుబడులు పెట్టని వాళ్ళ ఒప్పందాలు రద్దు చేస్తాం. నూతన ప్రభుత్వం వచ్చి పది రోజులైనా కాకముందే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి తావులేకుండా పాలన సాగించి చంద్రబాబు అవినీతిని ప్రజల ముందుంచుతాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment