టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి | Make a plan for the development of tourism | Sakshi
Sakshi News home page

టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి

Published Sun, Sep 28 2014 3:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి - Sakshi

టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి

శ్రీకాకుళం కల్చరల్: జిల్లాను టూరిజం హబ్‌గా తయారు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని  ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు.  జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చారిత్రాత్మక సంపద ఉందని, దానిని పరిరక్షించాలన్నారు.  ఈ జిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లన్నారు. నేడు ఎన్నో దేశాలు టూరిజం ద్వారా అభివృద్ధి జరిగాయన్నారు.
 
 అదే తరహాలో రాష్ట్రంలో టూరిజం,  వ్యవసాయం, పరిశ్రమలను ప్రోత్సహించేం దుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.  టూ రిజం హబ్ కోసం పూర్తిస్థాయి ప్రణాళికలుంటేనే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర టూరిజం మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి నిధులు తేలేదని అన్నారు.  ఎంపీ కింజరాపు రామమ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ  జిల్లాలో ఉన్న టూరిజం ప్రాంతాలకు విద్యార్థులకు తీసుకెళ్లి చూపించాలని కోరారు.  కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. డచ్ బంగ్లాను మ్యూజియం తయారు చేస్తున్నట్లు చెప్పారు.  
 
 విజేతలు వీరే...
 ఈ సందర్భంగా నిర్వహించిన వక్త్వత్వ పొటీలలో సీనియర్స్ విభాగంలో ఎం.కుసుమ కుమారి, ఎస్.సాయిమాధురి, సీహెచ్ సుకన్య, జూనియర్స్‌లో జి.అలేఖ్య, టి.స్వాతి వరుసగా మొదటి మూడు బహుమతులను సాధించారు.  వ్యాసరచన పోటీలో ఎం.కుసుమ కుమారి, ఎస్.సాయిమాధురి, ఎం.శ్రీదేవి, జూనియర్స్‌లో  జేవీ శ్రీవిద్య, ఆర్.ఉషా సాయికిరణ్, ఎల్.భార్గవనాయుడు వరుసగా మొదటి మూడు బహుమతులు పొందారు.  చిత్రలేఖనం  జూనియర్స్‌లో డి.దీపిక, ఎం.అపురూప్ సిద్దార్థ, సీనియర్స్‌లో పొందూరు శ్రీను, కె.పవన్‌కుమార్ మొదటి రెండు బహుమతులను సాధించారు. వీరికి అతిథులు బహుమతులు అందించారు.
 
 ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
 పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. రఘుపాత్రుని శ్రీకాంత్ నృత్య దర్శకత్వంలో విశ్వ వినాయక నృత్య గీతం, ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించే థీమ్ సాంగ్ నృత్యాన్ని చిన్నారులు ప్రదర్శించారు.  జాతీ యస్థాయి గుర్తింపు పొందిన విశాఖకు చెందిన బొట్టా నాగేశ్వరరావు మాట్లాడేబొమ్మ ప్రదర్శన, ఎస్‌ఎంపురానికి చెందిన గొంటి జ మ్మయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తప్పెటగుళ్ల ప్రదర్శనలు నిర్వహించారు.  
 
  విజయనగరం శ్యాం కుమార్ ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది.  జిల్లా పర్యాటక కేంద్రాల ఫొటో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్, ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement