సాక్షి, హైదరాబాద్: పర్యాటకరంగ అభి వృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పర్యాటక, సాంస్కృతి కశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామంగా తెలంగాణ మారిందని కొనియాడారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరి గిన ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం మీట్‌లో తెలంగాణ పర్యాటక వైభవాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నామన్నారు. టెంపుల్ టూరి జానికి ప్రత్యేక ఆకర్షణ తెలంగాణ అని, హైదరా బాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం గుర్తింపు పొందిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాదాద్రి దేవాలయం అభివృద్ధి చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment