Hitex Exhibition
-
హైటెక్స్ ఎగ్జిబిషన్లో కలర్‌ఫుల్ ‘హైదరాబాద్ కామిక్ కాన్’ ఈవెంట్ (ఫొటోలు)
-
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 5K రన్ (ఫొటోలు)
-
5,500 మందితో హైదరాబాద్‌లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే..
పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ వాహనాల మార్కెట్‌కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శనకు హైదరాబాద్ వేదిక కానుంది. ఏప్రిల్ 26, 27న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ‘రెన్యూఎక్స్ 2024’(8వ ఎడిషన్) పేరుతో ఈవింట్‌ను జరుపనున్నారు. ప్రముఖ బీ2బీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ ఇన్ఫార్మా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 5,500 మంది వీక్షకులు, 150 కంపెనీలు పాల్గొనవచ్చని అంచనా. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 180 బ్రాండ్లను ప్రదర్శనగా ఉంచే ఈ కార్యక్రమంలో ప్రధానంగా పునరుత్పాదక శక్తికి సంబంధించి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్న కంపెనీలు పరస్పరం సహకారం అందించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. ఆయా విభాగాల్లోని నిపుణులు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుకల్పిస్తున్నారు. దాంతో పునరుత్పాదక ఇంధన రంగానికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయో చర్చించనున్నారు. ఈ ప్రదర్శనలో ఆర్కిటెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పారిశ్రామిక వినియోగదారులు, ఫెసిలిటీ మేనేజర్లు, ఎనర్జీ కన్సల్టెంట్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు, పవర్ డిస్ట్రిబ్యూటర్లు/ డీలర్లు, సిస్టమ్ ఇన్స్టాలర్లు, స్థానిక అధికారులు.. ఇలా రిన్యూవెబుల్ ఎనర్జీతో సంబంధం ఉన్న వివిధ విభాగాలకు చెందిన వారు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్పారు. ఇదీ చదవండి: భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే.. ఇన్ఫార్మా మార్కెట్స్ ఎండీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారత్‌లో వెలువడే కర్బన ఉద్గారాలు 45 శాతం కంటే తగ్గించాలనే లక్ష్యం ఉంది. 2070 నాటికి దీన్ని సున్నాకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో దాదాపు సోలార్ ఎనర్జీనే 55శాతంగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ రెన్యూవెబుల్ ఎనర్జీ అవసరాన్ని గుర్తించి ‘సుర్యఘర్ యోజన పథకం’ను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా దాదాపు 1కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగం సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ఈమేరకు ‘రెన్యూఎక్స్ 2024’ కార్యక్రమం వ్యాపారులు తమ ఉత్పత్తులను మరింత వైవిధ్యంగా మార్చేలా ఉపయోగపడుతుంది’ అని ఆయన వివరించారు. ఆసక్తి ఉన్న సందర్శకులు సంబంధిత వెబ్సైట్లో పూర్తి వివరాలు అందించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. -
Hyderabad : కిడ్స్ & పెట్స్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్/ మాదాపూర్: సాగులో నూతన పద్ధతులు, ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉంటూ వ్యవసాయ రంగ స్వరూపాన్ని మారుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పా రు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. పంటల సాగు కు అనేక రాయితీలను అందిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కిసాన్ అగ్రి షో–2023ను కిసాన్ ఫోరమ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్వినర్ నిరంజన్ దేశ్‌పాండేతో కలిసి మంత్రి ప్రారంభించారు. నగరంలో ఇంత భారీ స్థాయిలో అగ్రి ఎక్స్పో జరగడం ఇదే మొదటిసారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న పలు ఆవిష్కరణలను చూస్తుంటే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కచ్ఛితంగా వ్యవసాయ పరిశ్రమల్లో ఒక మార్పు తీసుకురాగలదని అనిపిస్తోందని అన్నారు. వినూత్న ఆవిష్కరణలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని అధిక దిగుబడులను పొందాలని రైతులకు సూచించారు. మనకు అవసరమైన పంటలతో పాటు విదేశీ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని కోరారు. దేశంలో పప్పు దినుసులు, వంటనూనెల కొరత నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ, ప్రపంచ అవసరాలకు సరిపడే విధంగా రైతాంగం తమ పంటలను పండించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కోరారు. నూతన సాంకేతికతల వినియోగానికి.. హైదరాబాద్‌లో ఈ తరహా భారీ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడంపై నిరంజన్ దేశ్ పాండే హర్షం వ్యక్తం చేశారు. వ్యవ సాయ రంగంలో నూతన సాంకేతికతల వినియోగానికి ఈ ప్రదర్శన బాట వేయగలదన్నారు. 20కి పైగా అగ్రి స్టార్టప్స్ నూతన సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. జ్ఞాన కేంద్రం వద్ద రైతులు తెలంగాణకు పనికొచ్చే నూతన సాంకేతికతల గురించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారని చెప్పారు. 160కి పైగా కంపెనీల అనుసంధానం అగ్రి స్టార్టప్స్ ప్రత్యేక విభాగమైన స్పార్క్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాష్ట్ర వ్యవసాయ వర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం సహా పెద్ద సంఖ్యలో ప్రధాన పరిశ్రమలు ఈ షో కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మూడురోజుల పాటు కొనసా గే ఈ ఎక్స్‌పోలో 150కి పైగా ఎగ్జిబిట ర్లు పాల్గొంటున్నా రు. ఈ వేదిక ద్వారా 160కి పైగా కంపెనీలు అనుసంధానం కాగలవని అంచనా. ఆకట్టుకుంటున్న స్టాళ్లు.. అగ్రి ఇన్పుట్, నీటి నిర్వహణ, పరికరాలు, ఉపకరణాలు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్‌కు సంబంధించిన స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. భారీ యంత్రాలు, ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగా అభివృద్ధి చేసిన ఎన్నో వినూత్న వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. -
హైదరాబాద్ : హైటెక్స్‌లో పెటెక్స్–2023 ప్రదర్శన (ఫొటోలు)
-
పెటెక్స్..అదుర్స్
మాదాపూర్: వివిధ దేశాలు...50 విభిన్న జాతులకు చెందిన 500 శునకాలు.. 700 రకాల చేపలు...క్యాట్ షో...అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు...నగరంలో మొదటిసారిగా ఏర్పాటైన పెటెక్స్–2023 ప్రత్యేకతలివీ. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఎనిమిది మంది అంతర్జాతీయ నిపుణులు పోటీల్లో న్యాయనిర్ణేతలుగా పాలుపంచుకుంటున్నారు. ఇక ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ క్యాట్ షోను నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమలో భారత్ ఒకటి అని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. పెంపుడు జంతువుల ప్రాముఖ్యతను వివరించేందుకే ప్రదర్శన ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆకట్టుకుంటున్న 700 రకాల చేపలు హైటెక్స్‌లో పెటెక్స్లో భాగంగా ఆక్వా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 700 రకాల చేపలు ప్రదర్శనలో ఉంచారు. చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాంటెడ్ అక్వేరియమ్, మాన్స్స్టార్, సెమీ అగ్రెసివ్ అక్వేరియమ్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో సిల్వర్ డెరోడో చేప ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ.3.50 లక్షల రూపాయలు. దీని ప్రత్యేకత..నీటిలో 12 అడుగుల లోతులో గంటకి 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో చివరి రోజు రెడ్‌చిల్లీ అర్వాన చేపను సందర్శకులు తిలకించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీని ధర. రూ.42 లక్షలు. దీని ప్రత్యేకత..నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని, అందంగా ఉంటుందని, ఇంట్లో ఉంటో వాస్తుపరంగా బాగుంటుందని జపనీయుల నమ్మకం. ఆకట్టుకుంటున్న 120 రకాల పిల్లులు ప్రదర్శనలో దాదాపు 120 రకాల పిల్లులను ఉంచారు. కొన్ని రకాల పిల్లులు చూడడానికి పులులుగా ఉన్నాయి. ఇందులో బెంగాల్ క్యాట్, ట్రెడిషనల్ లాంగ్ హేయిర్, హిమాలయన్, బ్రీటీస్ సార్ట్ హేయిర్, ఎక్సోటిక్ సార్ట్ హెయిర్, మెన్కున్ లాంటి బ్రీడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటి ధర రూ. 50 వేల నుండి రూ.3 లక్షల వరకు ఉన్నాయి. పక్షులు సైతం.. ఆస్ట్రేలియాకు చెందిన మోలుకన్ కొకాటో పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటి ధర రూ.50 నుండి ప్రారంభం. నెల ఖర్చు రూ.5 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. గృహాలలో పెంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు బ్లూగోల్డ్ మకావ్, రామచిలుకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు అందంగా తయారు చేస్తా.. నా దగ్గర ఉన్న చిన్న డాగ్ షెడ్జి. దీని ధర రూ.28 వేలు. దీనికి నెలఖర్చు రూ.10 వేల వరకు అవుతాయి. ప్రతి నెల డాక్టర్ వద్ద చెకప్ చేయిస్తా. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత ప్రేమగా చూసుకుంటాను. ప్రతి రోజు అందంగా తయారు చేస్తాను. – రమన్, జుంతుప్రేమికురాలు కుక్కలకు రక్తం అవసరం ప్రమాదాలు వాటిల్లినప్పుడు మనుషులకు రక్తం ఎలా అవసరం ఉంటుందో కుక్కలకూ అలాగే అవసరం. ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, సర్జరీలు చేసేటప్పుడు, రక్తం మార్చవలసిన పరిస్థితి కలిగినప్పుడు మాకు సమాచారం అందిస్తే సంబంధించిన ఇతర కుక్కలను తీసుకువచ్చి రక్తాన్ని ఇస్తాం. – కౌశిక్, జంతుప్రేమికుడు కేరింగ్ తీసుకోవాలి పెంపుడు జంతువులను పెంచాలనే కోరిక, ఆసక్తి ఉన్నప్పుడే వాటిని పెంచగలం, పెండుపు జంతువులను పెంచేవారు డాక్టర్ల సలహాలను, నిపుణులతో సంప్రదించాలి. వాటికి కావాల్సిన ఆహారాన్ని తగినంత మొతాదులో పెట్టాలి. వాటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. – గణేశ్, వెటర్నరీ డాక్టర్ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తాం.. బ్లాక్ల్యాబ్రో డాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పెంచుతున్నా. కుటుంబంలో ఒకరిగా చూసుకుంటాం. మా ఫ్రెండ్స్ సైతం చూడడానికి ఇంటికి వస్తారు. దీని ధర రూ.20 వేల నుండి ప్రారంభం అవుతుంది. దీనికి నెల ఖర్చు రూ.6 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. – జాగృతి, జంతు ప్రేమికురాలు -
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. (ఫొటోలు)
-
120 ఎగ్జిబిటర్లు..500 బ్రాండ్లు, ప్రారంభమైన ఇంటీరియర్ ఎక్స్పో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్ఆర్సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్ఆర్సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్స్‌లో ఇండోమాక్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మాదాపూర్: తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ గుప్త అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండోమాక్–2022 పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ అండ్ మిషనరీ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యత్రాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆటోమెషీన్, మెషిన్ టూల్స్ పరిశ్రమలలో పురోగతి చెందుతుందన్నారు. యంత్ర పరికరాల ఉత్పత్తిలో భారతదేశం 10 స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ ఉత్పత్తిలో 0.9 శాతం ఉన్నట్టు తెలిపారు.మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనలో 125కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. -
అక్టోబర్‌లో ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అక్టోబరు 1, 2,3 తేదీల్లో 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. సుమారు 150 నిర్మాణ సంస్థలు, 400 ప్రాపర్టీలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంపుకుంటోంది. ఇటీవల ఆగస్టులో క్రెడాయ్ ఆధ్వర్యంలో హైటెక్స్, హైదరాబాద్‌లో జరిగిన ప్రాపర్టీ షోకి సైతం మంచి స్పందన లభించింది. చదవండి: CII-Anarock survey: రూ.90 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లను తెగకొనేస్తున్నారు -
నేడు వైఎస్సార్ సంస్మరణ సభ
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణసభ గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలంటూ 300 మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో వైఎస్‌కు సన్నిహితులుగా మెలిగిన పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సినీప్రముఖులు ఉన్నా రు. వీరిలో కొందరికి విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ డి.శ్రీనివాస్, మాజీ ఎంపీలు కేవీపీ రామచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతోపాటు మంత్రి సబితాఇంద్రారెడ్డి, పలు పార్టీల సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, ఎంఏ ఖాన్, సురేశ్‌షెట్కార్, డి.కె.అరుణ, జితేందర్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ తదితరులున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వీరితోపాటు మాజీ ఐఏఎస్ అధికారులు రమాకాంత్‌రెడ్డి, బీపీ ఆచార్య, మోహన్‌కందా, సినీప్రముఖులు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, దిల్‌రాజు, పలువురు రిటైర్డ్ జడ్జీలు, జర్నలిస్టులున్నారని తెలిపారు. ఆహ్వానితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఈ సభ ఏర్పాట్లను మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన భాస్కరశర్మ పర్యవేక్షిస్తున్నారు. -
Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...
-
Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...!
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్ ఎస్టేట్, డెవలపర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మొదటి షో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుపులకు లోనైంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత ఎక్కడా ప్రాపర్టీ షోలు భారీ స్థాయిలో జరగలేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ ఆగస్టు 13,14,15 తేదీల్లో హైటెక్స్‌లో , క్రెడాయ్ హైదరాబాద్ యూనిట్ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది. రియల్ పుంజుకుంటోంది క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్ బాగుందని క్రెడాయ్, హైదరాబాద్ యూనిట్ ట్రెజరర్ ఆదిత్య అన్నారు. కోవిడ్ మునుపటి స్థితికి రియల్ ఎస్టేట్ చేరుకుంటుందనే నమ్మకం కలిగిందన్నారు. కొత్తగా ఇళ్లలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆఫీస్ స్పేస్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్లు ఉండటంతో మార్కెట్ ఆశాజనకంగా ఉందన్నారు. రెస్పాన్స్ బాగుంది ప్రాపర్టీ షో ప్రారంభం కాకుముందు జనాల రెస్సాన్స్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేదని, కానీ ఈ షో ప్రారంభమైన తర్వాత అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాంటూ తెలిపింది గౌరు డెవలపర్స్‌కి చెందిన కావ్య. కొత్త ఇళ్లులు, స్థలాలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని, మూడు రోజులుగా వస్తున్న వారికి తమ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నామంది. మార్కెట్‌పై అవగాహన దాదాపు పద్దెనిమిది నెలలుగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర పనులకే బయటకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై సరైన అవగాహన ఉండటం లేదు. అయితే క్రెడాయ్ భారీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడంతో మార్కెట్‌పై అవగాహన కోసం చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా గృహిణిలు కొత్త ఇళ్ల గురించి ఎక్కువగా వాకాబు చేస్తున్నారు. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ముసురుకున్న అనుమానాలను క్రెడాయ్ ప్రాపర్టీ షో పటాపంచలు చేసింది. -
అందుబాటు గృహాలు కట్టండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు బాగున్నాయి కాబట్టి పెద్ద సైజు గృహాలు, లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలు బాగానే సాగుతున్నాయని.. ఇది ఎల్లకాలం ఉండదని గృహ విక్రయాలలో స్థిరత్వం ఉండాలంటే మధ్యతరగతి గృహాలను నిర్మించాలని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అవసరమైన భూముల కొనుగోళ్లు, అనుమతుల మంజూరు, నిర్మాణ రాయితీలు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావులతో చర్చిస్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపల 20–30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం సుమారు రూ.3 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. ఇందులో రూ.1,500 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే రియల్టీ పరిశ్రమ 20–30 ఏళ్లు ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కువ స్థలం అందుబాటులోకి వచ్చి చౌక ధరలలో స్థలాలు దొరుకుతాయని పేర్కొన్నారు. రెరాకు శాశ్వత చైర్మన్.. త్వరలోనే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు శాశ్వత చైర్మన్, పూర్తి స్థాయి అధికారులను నియమించడంతో పాటు రిటైర్డ్ జడ్జి లేదా పరిశ్రమలోని నిపుణులను అథారిటీగా నియమించే అంశం తుదిదశకు చేరుకుందని మంత్రి వివరించారు. ధరణిలో అర్బన్ ఏరియాలతో ముడిపడి ఉన్న వ్యవసాయ భూములలో కొన్ని మినహా.. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు లేవని దీంతో ఆయా స్థలాల క్రయవిక్రయాల సమయంలో 15–20 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని చెప్పారు. సాఫ్ట్వేర్, బ్యాండ్‌విడ్త్ రిలేటెడ్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ధరణిలో నమోదైన భూములకు చట్టబద్ధత వస్తుందని.. దీంతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు, లావాదేవీలకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటు నుంచి పని చేసుకునే విధంగా సులభతరంగా ధరణిని రూపొందించామని చెప్పారు. ధరణిలో లీగల్ ప్రొవిజన్స్ లేవు.. ఇప్పటికీ ధరణిలో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని... ప్రధానంగా న్యాయమపరమైన నిబంధనలు (లీగల్ ప్రొవిజన్స్) లేవని తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతో భూ యజమానులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)లతో కలిపి మరొక సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. ధరణి విధానాన్ని ముందుగా ఒకట్రెండు జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి వాటి ఫలితాలను అంచనా వేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు సూచించారు. ప్రతి 10 ప్రాపర్టీలలో 7 ధరణి సమస్యలలో చిక్కుకున్నాయన్నారు. వేలాది దరఖాస్తుల కరెక్షన్స్ పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించే సమయం కలెక్టర్లకు ఉండటం లేదని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 5–6 నెలల సమయం పడుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తే పది రోజుల్లో పరిష్కరించవచ్చని చెప్పారు. టీఎస్–బీపాస్ పర్మిషన్స్ సంపూర్ణంగా లేవు.. టీఎస్–బీపాస్‌తో 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు వస్తున్నప్పటికీ అవి సంపూర్ణంగా లేవని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ, ఎన్విరాన్మెంటల్, వాటర్ బోర్డ్ విభాగాలు టీఎస్–బీపాస్‌లో అనుబంధమై లేవని.. దీంతో ఆయా విభాగాల కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో లేదా అర్బన్ ఏరియా ప్రాంతాలలో కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) విధానాన్నే ఉంచాలని కోరారు. గ్రిడ్, వేర్‌హౌస్ పాలసీలు, ఈ–సిటీ, ఎంఎస్ఎంఈ, మెడికల్ డివైజ్ వంటి పార్క్‌లు, ఫార్మా సిటీ వంటి కొత్త కొత్త అభివృద్ధి పనులు జరుగుతున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. దీంతో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం నలువైపులా విస్తరిస్తుందని తెలిపారు. పాలసీల రూపకల్పనలో రియల్టీ నిపుణులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. నేడు, రేపు కూడా ప్రాపర్టీ షో క్రెడాయ్ హైదరాబాద్ 10వ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు వంద స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 15 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. శని, ఆదివారాలలో కూడా ప్రాపర్టీ షో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి బ్యాంక్‌లు, పలు నిర్మాణ సామగ్రి సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మూడు రోజుల్లో కలిపి సుమారు 60 వేల మంది సందర్శకులు వస్తారని క్రెడాయ్ హైదరాబాద్ అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీ ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కే రాంబాబు, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో జరగనున్న ఏడో ఎడిషన్ ఫార్మాలిటికా ఎక్స్పో
హైదరాబాద్: ఫార్మలిటికా ఎక్స్పో ఏడో ఎడిషన్ హైదరాబాద్‌లో జరగనుంది. ఆగస్టు 13 న హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫార్మాలైటికా ఎక్స్పోను ఇన్ఫార్మా మార్కెట్స్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు లైవ్ ఇన్-పర్సన్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 20 వరకు వర్చ్యువల్‌గా జరిగేట్లు ఇన్ఫార్మా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో ఫార్మా రంగానికి చెందిన నిపుణులతో పాటు విశ్లేషకుటు, ల్యాబ్ కెమికల్స్, ఫార్మా మిషనరీ, ప్యాకింగ్ సెక్టార్‌కి చెందిన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఫార్మలిటికా ఎక్స్పో బీటూబీ ఫార్మా కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఎక్స్‌పోలో భాగంగా ఫార్మా రంగంలోని లీడింగ్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో నాణ్యత హమీ సాంకేతికత, నాణ్యత, రెగ్యులేటరీ, కాంప్లియెన్స్ ప్రమాణాలకు సంబంధించి తాజా ధోరణులను ఫార్మాలిటికా ప్రదర్శించనుంది.ఈ సందర్భంగా ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరక్టర్ యేగేష్ ముద్రాస్ మాట్లాడుతూ.. ఫార్మాలిటికా ఎక్స్పోను సరికొత్తగా హైబ్రిడ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ )రూపంలో ఈ సంవత్సరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫార్మా రంగంలోని పలు అంశాలను చర్చించేందుకు ఒక వేదికగా ఫార్మాలిటికా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
బ్రైడల్ ఫ్యాషన్ షోలో మెరిసిన శ్రద్ధా దాస్, బిగ్ బాస్ దివి
-
హైటెక్స్‌లో అక్వా ఎగ్జిబిషన్
సాక్షి, హైద్రాబాద్ : సముద్రతీరం లేని రాష్ట్రాల్లో సముద్రపు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపిఇడిఎ) చైర్మన్ శ్రీ కె.ఎస్. శ్రీనివాస్ గురువారం తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ‘అక్వా అక్వేరియా ఇండియా 2019’ పేరుతో మూడు రోజుల పాటు హైటెక్స్ ఎగ్జిబిషన్స్‌లో నిర్వహించే ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 2018-19లో ఏడు బిలియన్ డాలర్ల విలువ గల అక్వా ఉత్పత్తులను అమెరికా, ఐరోపా, చైనా, జపాన్ దేశాలకు ఎగుమతి చేస్తూ మనదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని తెలియజేశారు. ప్రస్తుతం మన దేశం ‘ఆర్టీమియా’ అనే చేపల ఆహారాన్ని దిగుమతి చేసుకుంటోందనీ, ఇప్పుడు దీనిని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ అక్వా కల్చర్ అభివృద్ధి చేసిందని ఆయన వెల్లడించారు. హేచరీస్, శిక్షణా కేంద్రాలను నెలకొల్పడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందనీ, శంషాబాద్ విమానాశ్రయంలో అక్వా క్వారంటైన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ మత్స్య శాఖ కమిషనర్ డా. సువర్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు వెయ్యి హెక్టార్లలో చేపల పెంపకాన్ని చేపడుతున్నామనీ, రిజర్వాయర్లలో, చెరువులలో చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. కాగా, ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రదర్శనలో 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘సీ ఫుడ్ ఫెస్టివల్’ పేరిట రొయ్యలు, చేపలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఏర్పాటు చేస్తున్నారు. -
కామి(కి)క్