
హైదరాబాద్: ఫార్మలిటికా ఎక్స్‌పో ఏడో ఎడిషన్ హైదరాబాద్‌లో జరగనుంది. ఆగస్టు 13 న హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫార్మాలైటికా ఎక్స్‌పోను ఇన్ఫార్మా మార్కెట్స్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు లైవ్ ఇన్-పర్సన్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 20 వరకు వర్చ్యువల్‌గా జరిగేట్లు ఇన్ఫార్మా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో ఫార్మా రంగానికి చెందిన నిపుణులతో పాటు విశ్లేషకుటు, ల్యాబ్ కెమికల్స్, ఫార్మా మిషనరీ, ప్యాకింగ్ సెక్టార్‌కి చెందిన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.
ఫార్మలిటికా ఎక్స్‌పో బీటూబీ ఫార్మా కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఎక్స్‌పోలో భాగంగా ఫార్మా రంగంలోని లీడింగ్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో నాణ్యత హమీ సాంకేతికత, నాణ్యత, రెగ్యులేటరీ, కాంప్లియెన్స్ ప్రమాణాలకు సంబంధించి తాజా ధోరణులను ఫార్మాలిటికా ప్రదర్శించనుంది.ఈ సందర్భంగా ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరక్టర్ యేగేష్ ముద్రాస్ మాట్లాడుతూ.. ఫార్మాలిటికా ఎక్స్‌పోను సరికొత్తగా హైబ్రిడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ )రూపంలో ఈ సంవత్సరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫార్మా రంగంలోని పలు అంశాలను చర్చించేందుకు ఒక వేదికగా ఫార్మాలిటికా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.