conferances
-
ఋతు ఘోష
వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అంతా కలిసి గ్లాస్గో వెళ్లారు. అక్కడ ‘కాప్’ సదస్సు జరుగుతోందంటేనూ మనుషులు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోడానికి వెళ్లా రంతే. దేశాధినేతలు ఒకరి తర్వాత ఒకరు లేచి భూతాపాన్ని తగ్గించేస్తాం అని చెప్పినప్పుడల్లా గ్రీష్మకు నవ్వాగడం లేదు. వాతావరణంలో అనూహ్య మార్పులకు అడ్డుకట్ట వేయా ల్సిందేనని వక్తలు సూచించినపుడు హేమంత అయితే నవ్వాపుకోలేక కింద పడిపోయింది. వర్ష, వసంత కలిసి ఆమెను పైకి లేవదీసి కూర్చోబెట్టారు. కర్బన ఉద్గారాలను బాగా తగ్గించేస్తున్నాం, ఇక ఓజోను పొరకు ప్రమాదం ఏమీ ఉండదని మరో వక్త అనగానే శిశిరకు ఒళ్లు మండిపోయింది. ఇక చాల్లేవే వెళ్దాం, ఇక్కడి నుంచి వీళ్ల అబద్ధాలు అకాల వర్షాలు తెచ్చిన అనూహ్య వరదలను మించి పోటెత్తుతున్నాయి అని వర్ష అనేసరికి ఆరు గురూ నవ్వుకుంటూ సభా ప్రాంగణం నుండి బయటకు వచ్చేశారు.‘నిజంగానే భూతాపాన్ని తగ్గిస్తారంటావా?’ అని ఆశగా అడిగింది శరత్. ‘ఊరుకోవే పిచ్చిదానా! నమ్మక నమ్మక మనుషులనే నమ్ముతావా?’ అని హేమంతం విసుక్కుంది. ‘మనం ఒకప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్లం. చైత్రం, వైశాఖం వచ్చిందంటే చాలు చెట్లు చిగురించి పూల గుత్తులతో నవ్వుతోంటే మన బిడ్డలే కదా అని మురిసిపోయేవాళ్లం. జ్యేష్ఠం, ఆషాఢం వస్తే మంచి ఎండలతో హానికారక క్రిము లను సంహరించి ప్రాణికోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించి సంతోషించేవాళ్లం. శ్రావణ, భాద్రపదాల్లో... ఎండా కాలంలో భుగ భుగమని వేడెక్కిపోయి సెగలు కక్కి ఉక్కిరి బిక్కిరైపోయిన భూమితో పాటు చెట్టూ చేమపై అమృత జల్లు కురిసినట్లు వర్షాలు కురిపించి లోకానికి చల్లటి కబురు అందించేవాళ్లం. మార్గశిరంలో మంచు కురిసే వేళలో లోకమంతా హాయిగా మైమరచి ఉంటే మన వల్లనే కదా ఈ సుఖం అని ఆనందించేవాళ్లం. కొత్త చిగుళ్లకు పునాది వేయ డానికి మాఘ, పాల్గుణ మాసాల్లో ఆకులు రాల్చి వృక్షాల తలలు శుభ్రం చేసేవాళ్లం. ఇపుడివన్నీ కూడా తల్లకిందులు చేసేశారు మనుషులు’ అని హేమంతం కళ్లు తుడుచుకుంది. ‘అవునే, ఫలానా కాలం వస్తే వాతావరణం ఫలానా విధంగా ఉంటుందని ప్రాణికోటికి తెలిసేది. ఇపుడది లేదు. ఏ కాలంలో ఏం జరుగు తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరో ఎందుకు మనమే చెప్పలేకపోతున్నాం. ఆ మధ్య మండు వేసవి కాలం కదా, నాకు పనిలేదు కదా అని విశ్రాంతి తీసుకుందా మనుకున్నా. అంతలోనే అల్పపీడన ద్రోణి వచ్చి అమాంతం తట్టి లేపి డ్యూటీ కెళ్లాలంది. అప్పటికప్పుడు కుండపోత వర్షం కురిపించి ఇంటికి వచ్చేసరికి తెల్లారి పోయింది’ అని వర్ష ఫిర్యాదు చేసినట్లు ఏకరవు పెట్టింది. కూర్చున్న గ్రీష్మ ఉన్నట్లుండి లేచి నిలబడి, ‘నువ్వే నేంటి? నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి? మొన్నా మొన్నటి వరకు నడి వేసవిలో 40 డిగ్రీల సెల్సియస్ దాటకుండా డ్యూటీ చేసేదాన్ని. ఈ మనుషుల పాపమా అని కొన్నేళ్లుగా ఆ వేడి కాస్తా పెరుగుతూనే వస్తోంది. ఈ ఏడాది చాలా దేశాల్లో 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయే ఎండలతో మండి పోయాను. ఆ ఒళ్లు మంట ఇప్పటికీ తగ్గలేదు తెలుసా?’ అని గ్రీష్మ కోపంగా అంది. ‘భూమ్మీద 84 కోట్లకు పైగా జీవరాశులు ఉన్నాయి. పాపం ఏ జీవరాశీ ప్రకృతికి విరుద్ధంగా చిన్న ఉల్లంఘనకు పాల్పడలేదు. మనుషులు మాత్రం తమ ఇష్టారాజ్యం అన్నట్లు వినాశనాన్ని తెచ్చిపెడుతున్నారు. అభివృద్ధి ముసు గులో పరిశ్రమలు పెట్టి లోకాన్ని విష కాలుష్యంతో నింపే స్తున్నారు. మన అమ్మ భూదేవి కడుపులో రసాయిన ఎరువులు పోసేసి దాని అరోగ్యం పాడు చేస్తున్నారు. మనల్ని చల్లగా చూస్తోన్న ఆకాశాన్నీ వదిలి పెట్టకుండా కర్బన వాయువులు ఊదరగొట్టి ఆకాశానికి చిల్లులు పెట్టేస్తున్నారు. మన ఋతువులు గతి తప్పి ఇలాగే తిరిగితే మానవాళి మిగిలి ఉంటుందా అసలు?’ అని శరత్ శాపనార్థాలు పెట్టింది. ఆరు ఋతువుల మాటలు గమనిస్తోన్న భూదేవి బాధగా దగ్గి, ‘ఊరుకోండర్రా. వాళ్లూ మన బిడ్డలే కదా. మనం అలా శపిస్తే పాపం వాళ్లేమైపోతారు?’ అని అమ్మలా అడిగింది. ఆకాశం కూడా, ‘అవునర్రా, భూమి చెప్పింది నిజం’ అంది. ఋతువులకు మండుకొచ్చింది. ‘మీ ఇద్దరికీ ఉన్నంత సహనం మాకు లేదు. మనుషులు తమ తప్పు సరిదిద్దుకుంటే మేం చల్లగానే చూస్తాం. కానీ ఈ తప్పులపై తప్పులు చేస్తే మాత్రం తరుముకు వచ్చే విపత్తులకు మా బాధ్యత లేదు’ అని నిష్కర్షగా చెప్పాయి. సకల జీవరాశులూ ఔనన్నట్లు తలలూపాయి. కాకపోతే ఈ భాషే ఇంకా మనిషికి అర్థం కావడం లేదు. – సి.ఎన్.ఎస్. యాజులు మొబైల్: 95055 55384 -
హైదరాబాద్‌లో జరగనున్న ఏడో ఎడిషన్ ఫార్మాలిటికా ఎక్స్పో
హైదరాబాద్: ఫార్మలిటికా ఎక్స్పో ఏడో ఎడిషన్ హైదరాబాద్‌లో జరగనుంది. ఆగస్టు 13 న హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫార్మాలైటికా ఎక్స్పోను ఇన్ఫార్మా మార్కెట్స్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు లైవ్ ఇన్-పర్సన్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 20 వరకు వర్చ్యువల్‌గా జరిగేట్లు ఇన్ఫార్మా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో ఫార్మా రంగానికి చెందిన నిపుణులతో పాటు విశ్లేషకుటు, ల్యాబ్ కెమికల్స్, ఫార్మా మిషనరీ, ప్యాకింగ్ సెక్టార్‌కి చెందిన సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఫార్మలిటికా ఎక్స్పో బీటూబీ ఫార్మా కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఎక్స్‌పోలో భాగంగా ఫార్మా రంగంలోని లీడింగ్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో నాణ్యత హమీ సాంకేతికత, నాణ్యత, రెగ్యులేటరీ, కాంప్లియెన్స్ ప్రమాణాలకు సంబంధించి తాజా ధోరణులను ఫార్మాలిటికా ప్రదర్శించనుంది.ఈ సందర్భంగా ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరక్టర్ యేగేష్ ముద్రాస్ మాట్లాడుతూ.. ఫార్మాలిటికా ఎక్స్పోను సరికొత్తగా హైబ్రిడ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ )రూపంలో ఈ సంవత్సరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫార్మా రంగంలోని పలు అంశాలను చర్చించేందుకు ఒక వేదికగా ఫార్మాలిటికా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రజా సమస్యలపై సదస్సులు
అనంతపురం అర్బన్: రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెలలో పెద్ద ఎత్తున్న సదస్సులు, సమావేశాలను నిర్వహించాలని సీపీఐ కార్యదర్శి వర్గం తీర్మానించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. అనంతరం జగదీశ్ విలేకరులతో మాట్లాడారు. వి.కె.ఆదినారాయణరెడ్డి శత జయంతి ఉత్సవాలను అక్టోబరు 8న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 100 టీఎంసీలకు పెంచాలని ఈనెల 20న అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. విద్యా, వైద్య రంగాలపై ఎస్కేయూలో, ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభించాలన్న డిమాండ్‌తో 22న రాయదుర్గంలో, పీఏబీఆర్ కుడికాలు కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలకు కృష్ణా జలాలు కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ నెల 28న రాప్తాడులో సదస్సు నిర్వహిస్తామన్నారు. అలాగే గుంతకల్లు నియోజవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీరు ఇవ్వాలన్న ఽడిమాండ్తో 29న గుంతకల్లులో సదస్సు నిర్వహిస్తామన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ ఎత్తివేయాలని ధర్మవరంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తామనారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై 30న పుట్టపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్యదర్శి వర్గం నిర్ణయించిందన్నారు. అలాగే గార్లదిన్నెలో 31న రైతాంగ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కరువు పరిస్థితులపై సెప్టెంబరు ఒకటిన కదిరిలో సెమినార్ నిర్వహిస్తామన్నారు. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.